తెలుగు పుస్తక ప్రపంచం Telegram channel photo

తెలుగు పుస్తక ప్రపంచం

@nagaveni_telugubooksPublic Channel

విజ్ఞాన భాండాగారం

244

Last views

6.5k (6,506 subscribers)
సభ్యుడు
—
Rating
56
Total Posts
Oct 22, 2026, 1:23 AM
అప్‌డేట్ చేయబడింది
Apr 5, 2026
Created
Stats

మీరు తెలుగులో కంటెంట్‌ని చూస్తున్నారు. ఇతర భాషల్లోని కంటెంట్‌ని చూడటానికి సైట్ భాషను మార్చండి.

Channel Information

Channel Information
Channel Nameతెలుగు పుస్తక ప్రపంచం
Username@nagaveni_telugubooks
Categoryసినిమాలు (Movies)
Languageతెలుగు
Countryభారతదేశం
సభ్యుడు6,506
Channel TypePublic Channel
Created5, ఏప్రి 2026
Last Updated22, అక్టో 2026 • 3 గంటల క్రితం
StatusActive

ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్
#160992+297
భాష ర్యాంకింగ్
#83-1
కేటగిరీ ర్యాంకింగ్
#504మార్పు లేదు

సబ్‌స్క్రైబర్ వృద్ధి

మొత్తం: 6.5K30 Days growth: +240.4%
09/2209/2710/0210/0710/1210/1710/21
సబ్‌స్క్రైబర్ వృద్ధి - 30 Days
DateSubscribers
22:09:20266,482
23:09:20266,482
24:09:20266,482
25:09:20266,482
26:09:20266,482
27:09:20266,482
28:09:20266,482
29:09:20266,482
30:09:20266,482
01:10:20266,482
02:10:20266,482
03:10:20266,482
04:10:20266,482
05:10:20266,482
06:10:20266,482
07:10:20266,482
08:10:20266,482
09:10:20266,482
10:10:20266,482
11:10:20266,482
12:10:20266,482
13:10:20266,482
14:10:20266,525
15:10:20266,525
16:10:20266,525
17:10:20266,525
18:10:20266,525
19:10:20266,525
20:10:20266,525
21:10:20266,506
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Weekly
DateSubscribers
Week of 30:03:20266,002
Week of 06:04:20266,013
Week of 13:04:20266,013
Week of 20:04:20266,013
Week of 27:04:20266,109
Week of 04:05:20266,109
Week of 11:05:20266,186
Week of 18:05:20266,186
Week of 25:05:20266,186
Week of 01:06:20266,279
Week of 08:06:20266,279
Week of 15:06:20266,279
Week of 22:06:20266,279
Week of 29:06:20266,356
Week of 06:07:20266,356
Week of 13:07:20266,356
Week of 20:07:20266,448
Week of 27:07:20266,448
Week of 03:08:20266,503
Week of 10:08:20266,503
Week of 17:08:20266,544
Week of 24:08:20266,525
Week of 31:08:20266,525
Week of 07:09:20266,505
Week of 14:09:20266,482
Week of 21:09:20266,482
Week of 28:09:20266,482
Week of 05:10:20266,482
Week of 12:10:20266,525
Week of 19:10:20266,506
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Monthly
DateSubscribers
April 20266,109
May 20266,186
June 20266,356
July 20266,448
August 20266,525
September 20266,482
October 20266,506
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Yearly
DateSubscribers
20266,506

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1శూన్యం నుండి సామ్రాజ్యం వరకు! - నల్లమోతు శ్రీధర్3.1K
  2. #2ప్రపంచం నిన్ను అడ్డుకుంటోందా? బాంబులు వేస్తోందా? భూకంపాలు తెస్తోందా? ర3.1K
  3. #34. సోలార్ ఎనర్జీ వాడకం పెరగాలి ... భారీగా పెరగాలి . వీలున్న చోటల్లా ఇం3.0K
  4. #4ఈ ఆనకట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు నిజం తెలుసుకుందాం.2.9K
  5. #510 సంవత్సరాలుగా LPG లేకుండానే వంటలు!2.9K
  6. #6నమ్మాళ్వార్ తన ప్రచార ఉద్యమంతో ఎంతో మంది రైతులను, యువకులను సుస్థిర వ్య2.8K
  7. #7"ఆడ మగ ఇద్దరు చేసే తప్పులకూ ఆడదాన్ని మాత్రం బాధ్యురాలిగా చేయడం పెద్ద అ2.6K
  8. #8"శక్తి " హీనులం కాదు ...2.5K
  9. #9గ్యాస్ లేకుండానే రోజూ 2 లక్షల పిల్లలకు భోజనం… బెంగళూరులో అద్భుత కిచెన్2.4K
  10. #10ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, భరతనాట్య నర్తకి, బహుముఖ ప్రజ్ఞాశ2.2K

ఇటీవలి పోస్ట్‌లు

1. మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః| అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః| సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.

3. కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః| జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.

4. ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా| ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.

5. సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్| విధుఛ్చచంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.

6. క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః| యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.

7. యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః| తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||

తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.

8. ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః| ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.

9. పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా| తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||

తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః| ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన||

తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు.

11. ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః| సంయోగాశ్చ వియోగాశ్చ
కా తత్ర పరివేదన||

తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.
సర్వేజనా సుఖినోభవంతు!!

(సేకరణ: ధన్యవాదాలు)
244000
అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ యూని వర్సిటి లో ‘’రేడియో యాక్టివ్ ఐసోటోపులు ‘’మీద రిసెర్చ్ చేశారు .ఆయన రాసిన ‘’హై వాక్యూం ‘’అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది...!
దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు ,వేదాంత ప్రవచనాలు ,యోగా ఉపన్యాసాలు ,తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద* 1947 మాతృదేశామైన భారత దేశం వచ్చేశారు..!
డిల్లీ లోని నేషనల్ ఫిజిక్స్ లాబరేటరీ లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా తమ అమూల్య మైన సేవలందించారు. ఏడేళ్ళ తర్వాత స్వామీజీకి భీమ వరం వద్ద ఒక ఆక్సిడెంట్ జరిగింది .విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ లో చేరారు .ప్రమాదం తప్పి ,ఆరోగ్యం కుదురుకొన్నది...!
ఆంద్ర విశ్వ విద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో సౌకర్యాలు ,పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ నాటి వైస్ చాన్సలర్ స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యలతో అప్పగించారు .వారు తమ శక్తి యుక్తులను ధార పోసి 1954 లో చేరి తీర్చి దిద్దారు. న్యూక్లియర్ ఫిజిక్స్ కు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది .1-7-1956 లో విశ్వ విద్యాలయం లో న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖ‘’ను స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది. ఎంతో మందిని ప్రోత్సహించి ,ప్రేరణ కల్గించి న్యూక్లియర్ ఫిజిక్స్ భవిష్యత్తును చాటి చెప్పి, అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేశారు...!
ఆంద్ర దేశం లో న్యూక్లియర్ ఫిజిక్స్ కు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద ప్రొఫెసర్ గా.., న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో చేరి, హెడ్ ప్రొఫెసర్ గా1965 న పదవీ విరమణ చేశారు. రాష్ట్ర మంతటా పర్య టించి, వారు వేద వేదాంగ ,యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీక రించే వారు. ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని ,పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు. ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్‘’ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు...!
స్వామి జ్ఞానానంద మతాన్ని సైన్స్ ను ‘’సింతెసిస్‘’ చేయాలని భావించారు .ఆయన మహా మానవతావాదిగా నిరూపించుకొన్నారు...!!!

( శ్రీభూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గారు...)
సేకరణ...
910001
చరిత్ర పుస్తకాలలో చోటు దక్కని.,. భారతీయ న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు.. 😯

#న్యూక్లియర్_ఫిజిక్స్_స్వామి_జ్ఞానానంద.. (5.12.1896 - 21.09.1969)
సైన్స్ కు మతానికి పొత్తు కుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ , జగదీశ్ చంద్ర బోస్ , స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని, అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టంగా చెప్పి ,ఆచరించి మార్గ దర్శనం చేశారు...!

న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్పెక్త్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశవిదేశాల్లో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చెరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద...!

#స్వామి_జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడిలో 1896 డిసెంబర్ 5న జన్మించారు. వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు తండ్రి గారు రామరాజు గారు మహా వేద విజ్ఞాన ఖని. వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలును, ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు...!
సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది.ఆ వేద భాండా గారాన్ని కుమారుడు లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్వినియోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమాభినివేశాన్ని సంపాదించుకొన్నారు. ఆ గ్రంధాలకు సార్ధకత చేకూర్చారు...!
నర్సాపురం లోని టేలర్ హై స్కూల్ లో విద్యాభ్యా సంచేశారు.ఇరవైవ ఏట వివాహం జరిగింది... బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడి పారు...!
తర్వాత పదేళ్లు దేశ సంచారం లో,పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు. హిమాలయా చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు. వేదాధ్యయనం వారిని విడువ లేదు.దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్నిన్చుకొన్నారు. మానసిక వికాసం కలిగింది.ఒక అపూర్వ తెజస్సేదో వారిలో విరాజిల్లింది...!
క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది. దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలా మలకం చేసుకోకుండా ఉండలేదు అందుకని జర్మని చేరుకొన్నారు. అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, ఫిజిక్సు చదివారు.ఫిజిక్స్ అంటే వీరాభిమానం కలిగింది. అంతే అప్పుడే విస్తరిస్తున్న ’హై టెన్షన్ ఎక్స్ రే ఫిజిక్స్ ‘’లో రిసెర్చి ప్రారంభించారు...!
ప్రేగ్ లోని చార్లెస్ యూని వర్సిటి లో వీరు రిసెర్చ్ కొన సాగించారు.వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి ,శిష్యుని వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి ‘’స్వామి జ్ఞానానంద‘’* అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు.అప్పటి నుండి స్వామి కాషాయామ్బర దారిగా జీవించారు...!
1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద. అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుంఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు.ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే.ఎన్నో తెలియ రాని విషయాలను విజ్ఞానంతో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు. అదొక తపస్సు గా, యోగం గా, వారు భావించి ఉత్తేజితులను చేశారు...!
ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధంగా వెలువడింది. డ్రిస్దేయిన్ వర్సిటి ప్రొఫెసర్ స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు.అవి మానవాళికి కర దీపికలన్నాడాయన...!
#జ్ఞానానందకు అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన ద్రుష్టిపడింది.పడింది అంటే దాన్ని ఆపోసన పట్టినట్లే 1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ చేశారు.
ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితు లయేట్లు చేశారు.యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు.యోగాలో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తీ స్వాధీనం కలుగు తుందని సోదాహరణం గా ఉపన్య సహించే వారు స్వామీజీ ఉపన్యాస సారాన్నంతా‘’పూర్ణ సూత్రాలు ‘అనే ఉద్గ్రంధంగా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది...!
ఇది వారి మహోత్రుష్టరచన గా ప్రశంశలు అందుకొన్నది. తర్వాత ఆయన ప్రొఫెసర్ డోల్షేక్ గారితో కలిసి జర్మని ,ఫ్రాన్స్ ,జెకోస్లోవేకియా లలో పర్య టించారు...!
స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన x ray spectography లో రిసెర్చ్ చేసి 1936 లో D,Scసాధించారు .ఇంగ్లాండ్ ,లివర్ పూల్ వర్సిటీ లలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు .న్యూక్లియర్ ఫిజిక్స్ లో ‘’spectography of beeta rays radiation ‘’లో అద్భుత పరిశోధన చేసిPh.D పొందారు...!
792002
భవిష్యత్తులో ప్రపంచజనాభా విస్ఫోటంతో ఆహారకొరత ఏర్పడితే ఇజ్రాయెల్ పద్ధతులే గతి. సమస్య హెచ్చినా ఇజ్రాయెల్ సొల్యూషన్ కనుక్కుంటుంది. (ఇతర దేశాలకు ఆ శక్తి ఉండవచ్చు. కానీ ఇజ్రాయెల్ కు ఖచ్చితంగా ఆ శక్తి ఉందని ఋజువయింది)

****

ఇజ్రాయెల్ ఇవి సాధించటానికి ప్రోద్బలం "మతం" కాదు. విపరీతంగా డబ్బు కాదు. అలా డబ్బు బలిసిన దేశాలు ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయి.

అవసరం. మేధ. మానవజాతిపై అక్కర. ఎవరేమనుకున్నా ఇదే నిజం.

మొత్తం ప్రపంచం ఇజ్రాయెల్ కు వ్యతితేకులు. ఒక ప్రధానమతం వారేమో తమ బాసు ను శిలువెక్కించింది యూదులని కోపం. అలా ఏదో మూఢత్వంతో హిట్లర్ 8 లక్షల యూదులను నాశనం చేశాడు. (వారు బ్రతికి ఉంటే?)

ఇంకొక మతం. తమ దేవుడిని కాక, ఇంకెవరో దేవుడిని పెట్టుకున్నారని ప్రపంచాన మారణహోమాలు సృష్టిస్తుంది. వీరు మానవాళి వినాశనానికే తక్క, సాయానికేం చేస్తారు? వంద కోవిడ్ లొచ్చినా, మొత్తం ప్రపంచం క్షామంలో పడిపోయినా వీరు ఇంతే.

ఏమీ లేక, ఉండడానికి ఇంత చోటు తెచ్చుకున్న ఇజ్రాయెల్ ప్రపంచానికి ఇచ్చింది అది.

దీని అర్థం - ఇజ్రాయెల్ వల్ల నిర్వాసితులైన అభాగ్యులైన పాలస్తీనా వారిని త్రోసిపుచ్చటమూ, వారి మీద జాలి లేకపోవడమూ కాదు.

వారిది నిజంగా దయనీయమైనదే.

అయితే అందుకు సమాధానం ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చెయ్యటం కాదు. నిజానికి ఇజ్రాయెల్ మొదట్నించీ అదే చెబుతూ ఉంది.

పాలస్తీనా సమస్య శాంతియుతంఫా పరిష్కారం కావడం అరబ్బు దేశాల వారికే ఏ మాత్రం ఇష్టం లేదు. వారి సమస్య పాలస్తీనా కు సహానుభూతి కన్నా, ఇజ్రాయెల్ ను తుదముట్టించటమే అన్నది స్పష్టం.

ఇజ్రాయెల్ నాశనమైతే - ఏం జరుగితుందో ఈ పోస్ట్ కొంచెం అర్థమైనా చాలు.

మానవాళి మొత్తాన్ని ఒక కుటుంబంలా (వసుధా ఏక కుటుంబకం) అన్న భావనకు అర్థం తెలుసు కనుకే, యూదులను భారతదేశం శతాబ్దాల వెనుకనే గౌరవించింది. ఆశ్రయం ఇచ్చింది. తమ ధర్మానికి అడ్డంకి అని ఏ మాత్రం భావించలేదు.

అతి కఠినమైన సమస్యలకు పరిష్కారం కనుక్కున్న ఇజ్రాయెల్ దేశానికి - నిజాయితీగా కూర్చుని శాంతియుతంగా తేల్చుకోగలిగితే - పాలస్తీనా సమస్య - సమస్య కాదు. ఇంకా వీలైతే ఆ విషయంలో దౌత్యం చేసి, సరైన పరిష్కార సూచన ఒక్క భారతదేశం చెయ్యగలదు.

అది అరబ్బులకు ఇష్టం లేదు కనుకనే 75 యేళ్ళ యుద్ధాలు.

ఇజ్రాయెల్ కు అరబ్బు వారెలాగో మనకు మనదేశంలో నానావాదులు. వీరు పైకి మాత్రమే సమానత్వ, శాంతికాముక ప్రవచనాలు చెప్పేది. లోతుగా ఆలోచించే, విశ్లేషించే తీరిక, తెలివిడి వారికి అణుమాత్రం లేవు.
1,510009
ఇజ్రాయెల్ ప్రగతి.

నాలుగైదు నెలలకు మునుపు. అనంతపురం లో గార్లదిన్నె వద్ద ఒక రైతు తన నాలుగు ఎకరాల పొలం లో "ఏపిల్" పళ్ళు సాగు చేశాడన్న వార్త వచ్చింది.

అనంతపురంలో! అంటే 42 డిగ్రీల ఎర్రటి ఎండలో ఏపిల్ సాగు! దీనికి మూలం రైతు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న KLD వరైటీ మొక్కలు. ఏపిల్ పళ్ళు హిమాలయల్లో, కాశ్మీర్ వంటి చలి ప్రదేశాల్లోనే పండేది. కానీ దాన్ని ఇలా సాధారణ పంటగా మార్చిన ఘనత ఇజ్రాయెల్ ది.

*

1948 లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పుడు ఆ దేశం దగ్గర తిండి లేదు. దేశాన నీటి పారుదల వ్యవస్థలు సరిగా లేవు. సగం దేశం యెడారి.

పౌరులకు తినే తిండి మీద రేషన్ ఉండేది. అంటే ప్రతి పౌరుడికి రోజు ఒంతపరిమాణంలో మాత్రమే తిండి అందుతుంది.

అన్నిటికన్నా ముఖ్యంగా - ఏ ఇతర దేశం సాయమూ లేదు! ప్రపంచ దేశాలు అన్నీ ఇజ్రాయెల్ కు వ్యతిరేకం.(ఒక్క భారతదేశం మినహాయింపు. అయితే ఈ దేశమూ అప్పుడు సాయం చేసే స్థితిలో లేదు).

ఆ గడ్డు పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కనిపెట్టిన వ్యవసాయ పద్ధతి పేరు డ్రిప్ ఇరిగేషన్. బిందుసేద్యం.

75 ఏళ్ళ తర్వాత , ఇప్పుడు ఆ దేశపు పద్ధతిని ప్రపంచంలో నూరు దేశాలు అనుసరిస్తున్నాయి. నూరు దేశాలంటే సగానికి పైగా ప్రపంచం!

నీరు. ఇజ్రాయెల్ కు నీరు అందేది గెలీలి అన్న విశాలమైన చెరువు ద్వారా. దానికి మూలం జోర్డాన్ నది.

అయితే ఈ గెలీలి చెరువు కూడా ఎండి నెర్రెలు విచ్చేది. మరొకపక్క మృతసముద్రం. అంటే సాధారణ సముద్రాలకంటే 34 % అధికంగా ఉప్పు పేరుకున్న సముద్రం. అది ఎందుకూ పనికి రాదు.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే పద్ధతికి నడుం కట్టింది. ప్రపంచంలో అత్యంతాధునిక DeSalination లవణనిర్మూలీకరణ కర్మాగారాన్ని నిర్మించింది. ఇటువంటి కర్మాగారానికి ముఖ్యమైన అవసరం - విద్యుచ్ఛక్తి.

ఒక ఉప్పునీరు, మంచి నీరు కలిస్తే మొత్తం అంతా ఉప్పునీటిగా మారుతుంది. ఇది సహజమైన పరిణామం. దీనికి వ్యతిరేకంగా జరిగే ప్రక్రియ ReverseOsmosys. ప్రకృతినియమానికి వ్యతిరేకం కనుక శక్తి చాలా కావాలి.(మన ఫ్రిజ్ లో జరిగే చల్లబరిచే ప్రక్రియ, సహజానికి వ్యతిరేకం కనుక ఫ్రిజ్ నడవడానికి విద్యుచ్ఛక్తి కావాలి.)

ఆ శక్తిని కూడా తెలివిగా ఎంతమేరకు కావాలో అంతమేరకు కూర్చుకుని,ఒక పనికి కావలసిన శక్తి మరొక పనికీ ఉపయోగపడేట్టు, కుదిరిన చోట్ల గురుత్వాకర్షణ ను ఉపయోగించుకుంటూ ఈ కర్మాగారం ఏర్పడింది.

ఆ తర్వాత దానికంటే మెరిగ్గా మరొకటి, ఆపై మరొకటి. ఇలా ఆరు! ప్రపంచంలో అత్యధికంగా.

ఇప్పుడు సగం ఎడారి ఉన్న ఇజ్రాయెల్ 90 శాతం అనువు గాని నేలను వ్యవసాయం చేయదగినట్లు చేసింది. తన తిండి అవసరాలల్లో ఎంతోభాగం సొంతంగా సంపాదించుకొని స్వయంసమృద్ధం అయింది. కేవలం 3 శాతం జనాభా వ్యవసాయం చేస్తారు.

ఇప్పుడు ఇజ్రాయెల్ 130 దేశాలకు అంతో ఇంతో ఆహార ఎగుమతులు చేస్తున్నది. 130 దేశాలు.

అలా ఉంటే, ఉప్పునీటిని శుద్ధం చేసి, ఆ నీటిద్వారా గెలీలి సముద్రాన్ని మంచినీటితో నింపింది. పరిపుష్టం చేసుకుంది. అదీ పోగా మిగిలిన వ్యర్థజలాల్లో 85 % తిరిగి వ్యవసాయభూమిలకు చేర్చింది.

అంతే కాదు. క్రిములు, పంటనాశనం చేసే జీవులను అరికట్టేందుకు చాలా తెలివిగా గుడ్లగూబలను పెంచటం, సాలీడు జాతిని పునరుత్పత్తి చేయలుండా చేసే ప్రక్రియ ఏదో కనుక్కోవడం - ఇలా అనూహ్యమైన పద్ధతులు కనుక్కుంది.

ఇదీ అనేకదేశాలకు సొంతం.

అలా ఉంటే రక్షణవ్యవస్థది మరో కథ.

1948 లో ఇజ్రాయెల్ ఏర్పడిన ఒక్కరోజు తర్వాత ఆ దేశంపై ఐదు దేశాలు యుద్ధం తలపెట్టాయి.

విమానాలు, విమానదళం ఏ మాత్రం లేదు.
నావికదళం హుళక్కి.
ఉన్న ఆర్మీ కూడా అనుభవం లేదు.

అయితే ఇజ్రాయెల్ యుద్ధం జయించింది.

అయితే ఇజ్రాయెల్ తన పౌరుడైన - ఎజ్రా వీజ్మన్ అన్న ఆయనకు ఒక అనూహ్యమైన బాధ్యత - వాయుసేన నిర్మించడాన్ని ఒప్పజెప్పింది. (Later he became president of the nation)

అతడు పాతబడిపోయిన తుక్కు విమానాలను ఐరోపా తదితర దేశాల్లో తెచ్చుకొన్నాడు. ప్రపంచయుద్ధంలో పనిచేసిన యూదులను కూడగట్టాడు.

అనతికాలంలో వాయిసేనను నిర్మించాడు. 1967 లో ఇజ్రాయెల్ కు తన మీద మరొక యుద్ధం మొదలవబోతుందన్న సూచన అందింది.

సరిగ్గా ఆరు రోజుల్లో యుద్ధం ముగిసింది.

యుద్ధం ఆరంభానికి ముందే ఇజ్రాయెల్ వాయుసేన శత్రువుల వాయుసేనలకు చెక్ పెట్టి యుద్ధం గెలవటం విశేషం.

ఆపై రక్షణ వ్యవస్థలో ఇజ్రాయెల్ సాధించిన ఘనతలు ఊహించలేనివి.

India is also using israel defence systems like Irony Done, MRSAM, Spyder etc.

పైన పేర్కొన్నవి ఇజ్రాయెల్ ప్రగతికి సంబంధించిన అంశాల్లో బహుశా 5 నుంచి 10 శాతానికి మాత్రమే పరిమితం. ఆపై ఊహించుకోవచ్చు.

టెక్నాలజీ రంగంలోనే కాదు, అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యాపారులు యూదులు. (ఉదా ఎలాన్ మస్క్, మనం గోక్కుంటున్న ఈ ముఖపుస్తకం, Whatsapp అధిపతి యూదు). సినిమాల్లో స్పీల్ బర్గ్, శాస్త్రవేత్తల్లో ఐన్స్టీన్ మొదలు ఓపెన్ హైమర్ వగైరా.

ప్రపంచానికి ఇజ్రాయెల్ అవసరం.
1,160007
మీ ఆవేశం సల్లగుండా .. కాస్త తగ్గించుకోండి స్వామీ !
1 . నేను ఫలానా పార్టీ.. ఫలానా నాయకుడు అని చెప్పడం లేదు .అన్ని పార్టీ లు ఒక్కటే అని కూడా చెప్పడం లేదు . మీ రాజకీయ అభిమానం ఉండనీ . కానీ అదే పనిగా పొద్దున్న పేపర్ చదివి... రాత్రి ప్రైమ్ టైం లో టీవీ చర్చ చూసి .. మధ్యలో సోషల్ మీడియా పోస్ట్ లు వీడియో లు చూసి .. తెగ ఆవేశ పడొద్దు . ఒంటికి మంచిది కాదు . రాగ భావ ద్వేషాన్ని తగ్గించుకోండి . రాజకీయుడు కోట్లు ఖర్చు పెట్టి మీడియా ద్వారా విసిరే ఎమోషనల్ హైజాక్ ట్రాప్ నుంచి బయట పడండి . ఎన్నికలు వచ్చినప్పుడు మీ అభిమాన నాయకుడికే ఓట్ వేద్దురు ... కానీ ప్రతి రోజూ మద్దెల దరువు వద్దు .
2. మీ బతుకు గురించి... కుటుంబం భార్యా పిలల్ల గురించి ఆలోచించండి . ఉందిలే కష్టకాలం ముందు ముందునా .. జాగ్రత్త పడండి .
3. గత 25 సంవత్సరాలు సంపద వెల్లువ . పెట్టుబడి దారీ విధానం లో ఇదొక పొంగు కాలం . పెరుగుట .. అదీ కృతిమ పెరుగుట విరుగుట కొరకే కదా . ఇప్పుడు విరుగుడు కాలం మొదలయ్యింది .
4. అప్పు చేసి తప్పు కూడు తిన్నారు . నేటి ప్రపంచ అప్పు 365 ట్రిలియన్ డాలర్స్ . 2026 సంవత్సరం మొదటి ఆరునెలల్లో ఇది పది ట్రిలియన్ డాలర్స్ పెరిగింది . అమెరికా , చైనా, జపాన్ , ఇంగ్లాండ్, ఫ్రాన్స్ , జర్మనీ, ఇండియా కెనడా , బ్రెజిల్ .. ఇవీ అప్పుల్లో అగ్ర స్థానం లో ఉన్న దేశాలు .
అప్పు చేసారు సరే .. కట్టాలి కదా ?
ఎలా ?
మునిగే దాక అప్పు చేస్తారా ?
ఒక ముక్క లో చెప్పాలి అంటే గత ముప్పై సంవత్సరాలుగా పెద్దలు చేసిన అప్పులు మరో పది ఇరవై సంవత్సరాలు వారి పిల్లలు కట్టాలి .
యువతరం బతుకులు చితికి పోతున్నాయి .
మీకు అర్థం కావడానికి ఒక్క ముక్కలో చెబుతాను . 20 ఏళ్ళ క్రితం అమెరికా తండ్రి బ్రెజిల్ కు పోయి లండన్ తండ్రి పట్ఠాయ కు పోయి .. మస్తు ఎంజాయ్ చేస్తే .. ఇప్పుడు వారి కొడుకులు .. ఉద్యోగాలు లేక .. ఉంటే ఆదాయం సరిపోక బతుకు బండి నడవక డింకీ కొడుతున్నారు .
ప్రపంచ వ్యాపితంగా ఇదే సీన్ .
స్పెయిన్ లో గత పదేళ్లలో ఇంటి అద్దెలు రెట్టింపు అయ్యాయి . దీన్ని భరించలేక 50 నగరాల్లో లక్షలాది మంది రోడ్ ల పైకి వచ్చి ప్రదర్సన చేస్తున్నారు .
రెండు ఉద్యోగాలు చేసినా ఆదాయం సరిపోక ఇంగ్లాండ్ లో అల్లాడి పోతున్నారు .
ధరలు పెరగడం వల్ల బతకలేక అమెరికా ప్రజలు రిపబ్లికన్ పార్టీ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారట .
5. చెత్త వీడియో లో చూడడం ఆపండి .
"తగినంత ప్రోటీన్ తినకపోతే ఇదిగో ఈ సమస్యలు అని చెబితే .. డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? . నీకు ఎంత సంపాదన?" ..అని అడిగే పిచ్చి స్థాయికి మీ మెదడును పాడు చేసుకోవద్దు .
"పోస్ట్ లో ఏమీ లేదు . అనవసర సోది .. ఇంత లెంగ్త్ "అంటాడు ఇంకోడు . నిజమే అనుకొందాము . సోది పోస్ట్ ఎందుకు చదివినట్టు ? టైం ఎందుకు వృధా చేసుకున్నట్టు ? నేనేమయినా చెట్టుకు కట్టేసి పోస్ట్ బలవంతంగా వినిపించానా ?. మీ టైం లైన్ పై మీరు రాసుకొన్నటు .. నా టైం లైన్ పై నేను రాసుకొంటున్నా . దాన్ని ఫేస్బుక్ వాడు ప్రమోట్ చేస్తే అది వాడి బిజినెస్ . నాకేంటి ?
నా పోస్ట్ ను కేవలం అయిదుగురే చదివినా నాకు వచ్చే నష్టం లేదు . లక్ష మంది చదివినా ఫేస్బుక్ వాడు ఇచ్చేది ఏమీ లేదు .
నిన్న ఎవరో ఒక వ్యక్తి కామెంట్ చేసినట్టు "కంచి గరుడ సేవ "
మీ కుటుంబానికి మీరే దిక్కు . ఆరోగ్యం కాపాడుకోండి . స్మార్ట్ థింకింగ్ అలవాటు చేసుకోండి .
ఆదాయం పెంచుకొనే మార్గాలు ఆలోచించండి .
వృధా ఖర్చులు మానండి .
పొదుపు చేయండి .
నేను గతంలో బంగారం కొనండి అని చెప్పినప్పుడల్లా కొంత మంది స్టాక్ మార్కెట్ .. మ్యూచువల్ ఫండ్స్ మంచివి అన్నారు . ఇప్పుడు ... తత్త్వం బోధపడిందా ?
నాకు తెల్సిన విషయాలను .. విజ్ఞానాన్ని మీకు ఉచితంగా అందిస్తున్నా .
తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం .
" మైదా వద్దు .. సింపుల్ కార్బ్స్ వద్దు" అని నేను చెబితే .. మీరు కసిగా .. నా పై ద్వేషం తో .. రోజూ మైదా పాస్తా నూడుల్స్ తింటే నేను మీ ఇంటికొచ్చి ఆపుతానా ? మీ పై కేసు పెడుతానా ?
మీ లైఫ్ మీ ఇష్టం .. ఉంచుకొంటారో .. చించుకొంటారో ..
ఒక కుటుంబ బ సభ్యుడి లాగా ఏవో కొన్ని చెబుతున్నా . అంతే . అంతకన్నా ఏమీ లేదు
{ అన్నట్టు మొన్న రాత్రి ఒక కాల్ . ఒక ప్రముఖ నాయకుడి నుంచి .. MLC గా పోటీ చెయ్యమని . 2007 లో దండమెట్టేసాను . ఇప్పుడు ఊబిలో దిగుతానా .?
ఎవడికీ తలవంచను .. ఎవడినీ యాచించను ..{ ఓట్లు } }

ఈ పోస్ట్ లో చివరిగా రెండు మాటలు .
1 . నేను ఒక టీచర్ . "సార్" అని పిలిస్తేనే నాకు ఇష్టం . ఏమండీ అనొచ్చు .
అన్నా / తమ్మడు / బావ / మామయ్య / అంకుల్ / పెంకుల్ / తాత / ముత్తాత / జేజి తాత .. లాంటి పిలుపులు వద్దు .
2. నాయనలారా .. రాజకీయనాయకుడి కోసం ఏడవకండి .. మీ కోసం .. మీ పిల్లల కోసం ఏడవండి .
908004
" ఎన్నికలొస్తున్నాయి .. అవతలి పార్టీ అభ్యర్థి .. గట్టోడు . అక్రమ మార్గాల్లో కూడేసిన సంపదలో ఎన్నికల కోసం 40 కోట్లు బయటకు తీసాడు . వాడిని ఓడించాలి అంటే... నువ్వు కనీసం 50 కోట్లు ఖర్చు పెట్టగలగాలి . చేయగలవా ?"

" అలాగే అన్నా . ఇదిగో పార్టీ ఫండ్ కోసం ఇంత . మిగతా డబ్బు ఎన్నికలకోసం ఖర్చు పెడుతా ".

సీట్ ఇచ్చారు .
సోషల్ మీడియా .. మీడియా .. సమస్త సైన్యాన్ని మోహరించి జనాలకు బ్రెయిన్ వాష్ చేసి{ మధ్య తరగతి కోసం } డబ్బులు పంచి { బీదల కోసం } గెలిపించారు .
50 కోట్లు ఖర్చు పెట్టినోడు ... పదవీ కాలంలో సంపాదించాలి కదా ?
ఖర్చు పెట్టిన యాభై కోట్లు ... మళ్ళీ ఎన్నికలకోసం 60-70 కోట్లు .. సంపాదించాలి కదా ?

ప్రతి దానికీ రేట్ నిర్ణయిస్తాడు .
ఉదాహరణకు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అంటే నాకు ఎకరాకు ఇరవై లక్షలు ఇవ్వాలి . ఇవ్వక పొతే నీ వెంచర్ ముందుకు సాగదు . అధికారులు ప్రతి అడుగులో సమస్యలు సృష్టిస్తారు " అంటాడు .

ఇదొక ఎకో సిస్టం .
వ్యాపారాలు చేసేవారికి దేనికి ఎంత ఇచ్చు కోవాలో తెలుసు .
ప్రభుత్వ ఉద్యోగులకు ... సబ్ ఇన్స్పెక్టర్ మొదలు MRO పోస్ట్ దాక దేనికి ఎంత సమర్పించుకోవాలో తెలుసు .
ఇచ్చు కున్నోడు .. దాన్ని తిరిగీ సంపాదించుకొంటాడు . కాదు కాదు ... ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు .. మూడు రెట్లు ... లాగేసాడు .
ఒక చిన్న స్థాయి అధికారిని... ఎసీబీ ట్రాప్ చేసినా వంద కోట్లు రాలుతుంది .
చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు కానీ .. రాజకీయనాయకులను ట్రాప్ చేస్తే హిమాలయ పర్వతాల అంత సంపద బయట పడుతుంది .
బ్రిటీష్ వాడి దోపిడీ , సంపద తరలింపు గురించి దాదాభాయ్ నవరోజీ " పావర్టీ అండ్ ఆన్- బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా " అనే బుక్ రాసాడు . 150 సంవత్సరాల కాలం లో బ్రిటష్ వాడు దోచుకొని తమ దేశానికి తరలించుకొని పోయిన సంపదతో పోలిస్తే... కనీసం అయిదు రెట్లు భారతావని లో రాజకీయులు దోచేసి... ఇంగ్లాండ్ , దుబాయ్, సింగపూర్, మారిషస్ కు తరలించేసారు .
బ్రిటిష్ వాడిని తరిమేశారు .
మరి రాజకీయుడి ని ?
బ్రిటీషోడు పెద్ద ఫూల్ .
రాజకీయడు మహా కన్నింగ్ ... స్ట్రాటజిస్ట్ .

రాజకీయనాయకుడి స్కీం లో... ప్రజలు మూడు కేటగిరీ లు .
అట్టడుగున పేదలు .
పేదరికం రాజకీయాలకు ఒక పండగ . యాభై ఏళ్ళ క్రితమే “ గరీబీ హటావో “ అనే నినాదం .
పేదరికం పొతే తానకు మనుగడ లేదని రాజకేయుడికి తెలుసు . తనకు జెండాలు మోసేది, ర్యాలీ లు తీసేది వారే కదా .
వ్యవస్థ భాదితులు పేదలు . పేదరికం ICU లో ఉచితాలు అనే స్టెరాయిడ్ లు ఇచ్చే డాక్టర్ రాజకీయుడు .
"అబ్బో .. గొప్ప ట్రీట్మెంట్ అనుకొంటాడు" పేదరికం రోగి . స్టెరాయిడ్ తక్షణ శక్తిని ఇస్తుంది . కానీ ఒంటిని తినేస్తుంది .
ఇది అర్థం కావడానికి మూడు జన్మలు చాలవు చాలా మందికి .
ICU స్టెరాయిడ్ గేమ్ రాజకీయుడి మొదటి పాచిక .
రెండో పాచిక సెంటి మెంటు అనే ఆయింట్మెంట్ . ఇది మధ్యతరగతోడికి .
మధ్య తరగతి . . నలిగి పోతారు .
సాండ్విచ్చ్ మసాజ్ .. జీవితాంతం .
కష్టపడి ..సంపాదించిన దానితో పన్నులు కట్టి కట్టి బతుకుతాడు .
బతుకు మిధ్య .
తన budget అనే కుండకు రాజకీయుడు చిల్లు పెట్టేసాడు .. అని గ్రహించలేడు .
గ్రహించినా .. చేసేది ఏమీ లేదు .
కింద కారి పోతూ ఉంటే చేది చేది నీరు పోస్తూ ఉంటాడు ..
చివరకు మిగిలేవి.. అప్పులు అవమానాలు ఆయాసం.
చాలీ చాలని జీవితం .
మధ్య తరగతోడికి సెంటిమెంట్స్ ఎక్కువ .
కులం .. మతం , ప్రాంతం , అవినీతి పై పై పోరాటం .. ఇలా రకరకాల పద్ధతుల్లో వీడిని ఎమోషనల్ హైజాక్ చేసేస్తాడు రాజకీయుడు .
పిచ్చోడు .. మధ్య తరగతోడు .. టీవీ లు చూసి .. పేపర్ చదివి .. సోషల్ మీడియా పోస్ట్ లు చూసి .. రోజూ .. ప్రతి రోజూ .. ఆవేశం స్టార్ అయిపోతుండాడు . బీపీ పెంచుకొంటాడు .
కుటుంబం భార్య పిల్లల కంటే తన అభిమాన నాయకుడు ... పార్టీ కోసం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అంకమ్మ శివాలు ఎత్తి పోతుంటాడు .

పేదోడే స్మార్ట్ . "ఉత్తుత్తి కబుర్లు వద్దు .. నాకేంటి ? మీటింగ్ కొస్తే ఎంత ? ర్యాలీ చేస్తే ఎంత . ఓట్ కు ఎంత ? గెలిచాక ఏమి చేస్తావు?" అని వడ్డీ వ్యాపారిలా లెక్క కట్టి తీసుకొంటాడు .
పిచ్చి మధ్యతరగతోడు పైసా లాభం లేకపోయినా గానుగెద్దు లాగా సమస్త భారం మోస్తున్నా ఎమోషనల్ హైజాక్ నుంచి బయట పడడు . పడలేడు . బాగుపడే లక్షణాలు ఇసుమంతయినా లేనోడు .
ఇక మూడో వర్గం .. పై వోడు .
“ మనం మనం బరంపురం “ టైపు .
పార్టీ లు భావాజాలాలు కులం మతం ప్రాంతం అన్నే అన్నీ మాయ అని ఎప్పుడో కనిపెట్టినోడు . డబ్బు ఒకటే... నిజం... శాశ్వతం అని నమ్మినోడు .

ఇక్కడిదాకా చదివి .. నేను మాట్లాడుతున్నది తెలంగాణ గురించా? లేక ఆంధ్ర ప్రదేశ్ గురించా? అని ఆలోచిస్తున్నారా ?
777002
మహారాష్ట్రలో 1974లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొని అడ్డుకోవడానికి స్వయంసేవకులు ప్రారంభించిన ప్రయత్నం, నేడు దేశవ్యాప్తంగా ప్రముఖ వినియోగదారుల సంస్థగా అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్‌గా విస్తరించింది.

కొంతమంది స్వయంసేవకులు పుణే నగరంలోని విస్తరిస్తున్న నివాస ప్రాంతాల్లో ప్రతి 25 కుటుంబాలకు ఒక గ్రూపు చొప్పున ఏర్పాటు చేసి, కొన్ని నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి పంపిణీ చేయడం ప్రారంభించారు. దీనివల్ల వస్తువుల ధర, నాణ్యత, బరువు—ఈ మూడు విషయాల్లోనూ వినియోగదారులకు ప్రయోజనం కలిగింది.

ఈ గ్రూపుల వల్ల కుటుంబాలకు లాభం కలుగుతోందని గమనించిన తరువాత, కేవలం మూడు రోజుల్లోనే ఆ ప్రాంతంలో 200 ‘గ్రాహక్ సంఘ్’ గ్రూపులు ఏర్పడ్డాయి. అందరి అవసరాలను సమన్వయం చేసి, ఉత్పత్తిదారుల నుంచే పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయడంతో కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులో 20 శాతం వరకు ఆదా చేసుకోగలిగాయి.

ఆ ప్రాంతంలో ద్రాక్షను పండించి సాగు చేస్తున్న వారిలో ఎక్కువమంది ‘మహార్’ అని పిలవబడే ఎస్సీ వర్గానికి చెందినవారు. వారికి ద్రాక్షకు కిలోకు కేవలం రూ.3.50 మాత్రమే లభించేది.

స్వయంసేవకులు ఏర్పాటు చేసిన వినియోగదారుల సంఘం వారివద్ద నుంచి ద్రాక్షను కిలోకు రూ.4.50 చొప్పున కొనుగోలు చేసి, వినియోగదారులకు కిలోకు రూ.5 చొప్పున విక్రయించడం ప్రారంభించింది. ద్రాక్షను పంపించే అట్టపెట్టెలపై “దీని ద్వారా వచ్చే లాభం ఎస్సీ కుటుంబాల సంక్షేమం కోసం ఉపయోగించబడుతుంది” అని ప్రకటించారు.

🚩ఆర్.ఎస్.ఎస్. అందిస్తున్న విశిష్ట సేవలు’
(శేషాద్రి జీ) అనే పుస్తకం నుండి.. 🚩
922004
#అమ్మానాన్నలు_కొడుకు_ఇంటికి వెళ్ళేముందు ఒకటికి రెండుసార్లు బట్టలు మార్చుకుంటారు.

కూతురు ఇంటికి వెళ్ళేటప్పుడు అలా అనిపించదు.

ఇదే తేడా, ఎవరూ నోరు విప్పి చెప్పని ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతుంది.

పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. బాధ్యతలు తీరిపోయాయి. ఇక మిగిలింది ప్రశాంతమైన జీవితమేనని అనుకుంటారు.

కొడుకు దగ్గరకు వెళ్ళి కొన్నాళ్ళు హాయిగా ఉందామని. కూతురు దగ్గరకు వెళ్ళి నాలుగు రోజులు గడుపుదామని.

కానీ ఆచరణలో ఈ రెండు ప్రయాణాలు ఒకేలా ఉండవు.

కొడుకు ఇంటికి వెళ్ళేముందు ఒక సూక్ష్మమైన లెక్క మొదలవుతుంది—ఎంతకాలం ఉండొచ్చు, ఏం మాట్లాడొచ్చు, కోడలి దినచర్యకు ఎంత ఇబ్బంది కలగకుండా ఉండాలి.

కూతురింటికి వెళ్ళేటప్పుడు ఈ లెక్క ఉండదు. అక్కడ తల్లి ఇంకా తల్లే, తండ్రి ఇంకా తండ్రే.

ఇది కేవలం మన సమాజపు లక్షణం అనుకుంటే పొరపాటు.

అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో—Merrill Silverstein, Cornell University ప్రొఫెసర్, దశాబ్దాలుగా intergenerational family relationships మీద అధ్యయనం చేశారు. ఆయన కనుగొన్న విషయం ఏంటంటే, తండ్రులు-తల్లులు తమ కూతుళ్ళతో ఎమోషనల్‌గా ఎక్కువ దగ్గరగా భావిస్తారు, కొడుకులతో పోలిస్తే. దీన్ని researchలో "matrilineal advantage" అంటారు.

కారణం సంక్లిష్టమైనది. కూతురు తన పుట్టింటితో emotional connection కొనసాగిస్తుంది. కొడుకు పెళ్ళయ్యాక అతని emotional center మెల్లగా తన సొంత కుటుంబం వైపు మారిపోతుంది—ఇది తప్పు కాదు, ఇది సహజమైన పరిణామం. కానీ ఆ మారడంలో, తల్లిదండ్రులు ఒక అడుగు వెనక్కి తగ్గాల్సి వస్తుంది.

జపాన్‌లో దీన్ని ఇంకోలా అధ్యయనం చేశారు. వృద్ధాప్య పరిశోధకులు దీన్ని "filial piety transformation" అంటారు—సాంప్రదాయకంగా కొడుకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని ఉన్న నమ్మకం, ఆధునిక న్యూక్లియర్ ఫ్యామిలీ నిర్మాణంతో ఢీకొంటుంది. కోడలు కూడా తన సొంత తల్లిదండ్రుల బాధ్యత మోస్తుంది. ఇద్దరు వృద్ధ జంటల బాధ్యత ఒకే చిన్న ఇంట్లో ఇమడాలంటే, ఎవరో ఒకరు కొంచెం వెనక్కి తగ్గాల్సిందే.

చైనాలో కూడా ఇదే పోకడ కనిపిస్తుంది—గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొడుకుతో కలిసి ఉండే సంప్రదాయం బలంగా ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులు కూతురి దగ్గర ఎక్కువ సౌకర్యంగా భావిస్తున్నారని ఇటీవలి సర్వేలు చెప్తున్నాయి.

మాధ్యమం మారుతోంది. ఖండం మారుతోంది. కానీ మనిషి మనసులో జరిగే ఈ సూక్ష్మమైన లెక్క మాత్రం ప్రపంచమంతటా ఒకేలా ఉంది.

నా సర్వీసులో వృద్ధాప్య సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేసినప్పుడు, ఈ మాటను చాలామంది నోటి నుంచి విన్నాను—

"కొడుకు ఇంటికి వెళ్తే అతిథిలా ఉండాలి. కూతురింటికి వెళ్తే ఇంకా మా ఇల్లే అనిపిస్తుంది."

ఈ ఒక్క వాక్యంలో ఎంతో బాధ దాగి ఉంది. తను పెంచిన ఇంటికే అతిథిగా వెళ్ళాల్సిన స్థితి.

కానీ ఈ కథలో నిజమైన లోతు ఇక్కడ ఉంది—పిల్లల దగ్గరి నుంచి వచ్చే ఆదరణ ఎంత అనిశ్చితమైనదో, భార్యాభర్తల మధ్య బంధం అంత స్థిరమైనది.

Harvard Study of Adult Development—ప్రపంచంలో మనిషి జీవితం మీద జరిగిన అతి పొడవైన అధ్యయనం, 85 సంవత్సరాలుగా కొనసాగుతోంది—ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. వృద్ధాప్యంలో మనిషి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నిర్ణయించేది సంపద కాదు, కీర్తి కాదు. దగ్గరి సంబంధాల నాణ్యత. మరియు ఆ సంబంధాల్లో అత్యంత స్థిరమైనది, రోజూ పక్కన ఉండే జీవిత భాగస్వామి.

పిల్లలు వాళ్ళ జీవితాలు జీవించడానికి వెళ్ళిపోతారు—అది తప్పు కాదు, అదే ప్రకృతి నియమం. కూతురికి తన అత్తగారి ఇల్లు ప్రాధాన్యత అవుతుంది. కొడుకుకు తన భార్య, పిల్లలు ప్రాధాన్యత అవుతారు.

కానీ భార్యాభర్తలు ఇద్దరూ, చివరి వరకూ ఒకరి పక్కన ఒకరు మిగిలే ఏకైక మనుషులు.

మహాభారతంలో ఒక దృశ్యం గుర్తుకొస్తుంది. ధృతరాష్ట్రుడు, గాంధారి వృద్ధాప్యంలో అడవికి వెళ్ళిపోతారు. వందమంది కొడుకులు పోయాక, రాజ్యం పోయాక, మిగిలింది ఒక్కటే—ఒకరికొకరు తోడుగా నడిచే ఆ చివరి ప్రయాణం.

కొడుకులు ఉన్నప్పుడే, రాజ్యం ఉన్నప్పుడే వాళ్ళిద్దరి బంధం అంత స్పష్టంగా కనిపించలేదు. అన్నీ పోయాక మాత్రమే, ఆ బంధమే మిగిలిన సత్యంగా నిలబడింది.

ఇది నిరాశపరిచే కథ కాదు. ఇది ఒక హెచ్చరిక, ఇంకా సమయం ఉన్నప్పుడే.

పిల్లల మీద పెట్టే ప్రేమను తక్కువ చేయమని కాదు. కానీ ఆ ప్రేమతో పాటు, జీవిత భాగస్వామితో ఉన్న బంధాన్ని కూడా అదే శ్రద్ధతో పెంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ మీ కోసం అక్కడ ఉండాల్సిన బాధ్యత వాళ్ళది కాదు—అది వాళ్ళ సొంత జీవితం. కానీ జీవిత భాగస్వామితో ఉన్న బంధం, మీరు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత బలంగా చివరి వరకూ నిలబడుతుంది.

కొడుకు ఇంటికి వెళ్ళేముందు బట్టలు సర్దుకునే ఆ తల్లి, రేపు తన కూతురు కూడా అదే స్థితిలో ఉంటుందని ఎప్పటికీ ఊహించదు.

ఇది chain. ప్రతి తరం దీన్ని పునరావృతం చేస్తుంది, ఎవరూ మాట్లాడకుండానే.

కానీ ఒక్క సత్యం మాత్రం మారదు—చివరి రోజు వరకూ, మంచంపక్కన నీళ్ళ గ్లాసు అందించే చెయ్యి, పిల్లలది కాదు.

జీవిత భాగస్వామిదే.

✍️TMS RAO
ఒక పరిశీలన ఒక ప్రశ్న ఒక ఆలోచన
@highlight
Tms
1,8000016
ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, భరతనాట్య నర్తకి, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు మరియు బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య సతీమణి శివశ్రీ స్కందప్రసాద్ 'ఎక్స్' వేదికగా పంచుకున్న ఒక అనుభవం ప్రతి ఒక్కరూ ఆలోచించదగినది.

రైళ్లలో, బస్సుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికుల పట్ల మనం చూపవలసిన కనీస మర్యాద, పబ్లిక్ స్పేస్‌లో పాటించాల్సిన సివిక్ సెన్స్ గురించి ఆమె లేవనెత్తిన అంశాలు మనందరినీ ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తున్నాయి.

+

శివశ్రీ స్కందప్రసాద్ అనుభవం ఆమె మాటల్లోనే:

"ఈ రోజు నేను ఒక బాధాకరమైన రైలు ప్రయాణం చేశాను. ప్రజలు పబ్లిక్ స్పేస్‌లను తగినంతగా గౌరవించకపోవడం చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మనం పబ్లిక్‌లో ఉన్నప్పుడు, అరవడం గానీ, గట్టిగా మాట్లాడటం గానీ చేయకూడదు. ప్రతి పర్సనల్ స్పేస్ గౌరవించాలి.

కళాకారులుగా మా మనసులో ఎప్పుడూ వంద ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. మేము నిశ్శబ్దంలో వికసిస్తాం. ఒక పెద్ద గుంపుగా రైల్లో ప్రయాణించేటప్పుడు ఆ ఉత్సాహాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. కానీ, నలభై మంది మధ్యవయస్కులైన పెద్దల గుంపు యాభై ఆరు సీట్ల కోచ్‌ను ఆక్రమించి, ఐదు గంటలపాటు ఆగకుండా అందరితో అంత గట్టిగా మాట్లాడటాన్ని ఒకసారి ఊహించండి. భారతదేశంలో సమస్య ఏమిటంటే వారిని ఎవరూ ప్రశ్నించలేరు. ఆ గుంపులో లేని మిగతా పదహారు మందిమి వారిని ఊరికే భరించాలనేది చెప్పని నియమం.

అందుకే వేరే కోచ్‌లో మరో సీటు దొరుకుతుందా అని నేను టీటీఈని అడిగాను. ఆయన ప్రయత్నించారు కానీ దురదృష్టవశాత్తూ రైలు నిండి ఉండటంతో, అదే కోచ్‌లో ఉండాల్సి వచ్చింది. అకస్మాత్తుగా, అప్పటికే ఆగకుండా కేకలేస్తూ నవ్వుతున్న ఎనిమిది మంది గుంపు 'యునో' ఆడటం మొదలుపెట్టింది. అప్పుడు ఏదైనా చేయగలరా అని నేను మళ్ళీ టీటీఈని అడిగాను.

ఆయన వారిని ఆపమని కోరగా, వెంటనే వారు ఆపేశారు. కానీ కొన్ని నిమిషాల తర్వాత టీటీఈ వెనక్కి వచ్చి వారిని వెక్కిరింపుగా, 'యాకె సర్ గలాటె మాడ్తైదీరా?' (ఎందుకు సర్ గొడవ చేస్తున్నారు?) అని అడిగాడు. దాంతో వారు అతనితో బాగా నవ్వుకుని, 'సర్ మీరు కూడా రండి, ఆడదాం' అన్నారు.

కాబట్టి ఇక్కడ సమస్య ఎవరు గెలిచారు అనేది కాదు. వారితో పాటు నేను కూడా, భారతీయులుగా, పౌర స్పృహ ఆటలో ఓడిపోయాం. ఒక దేశంగా మన పబ్లిక్ ప్రవర్తనను మనం ఎప్పుడు మెరుగుపరచుకుంటాం?"

+

పబ్లిక్ ప్రదేశాలలో తోటివారికి అసౌకర్యం కలిగించకుండా ఉండటం మన బాధ్యత. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? పౌర స్పృహను పెంపొందించుకోవడానికి మనం ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి?
2,200006
చీకటి పట్టాలపై కన్నీటి సంతకం: పంజాబ్ పచ్చని విప్లవం మిగిల్చిన క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్

✍️ Srinivas Ganjivarapu

కోనసీమ ఆక్వా కల్చర్ కు ప్రమాద హెచ్చరిక

రైల్వే రికార్డుల్లో దాని నంబర్ 14722 - అబోహర్-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్. కానీ లోకం దానికి పెట్టిన పేరు ‘క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్’. పంజాబ్‌లోని బటిండా జంక్షన్ నుంచి రాత్రిపూట నిశ్శబ్దంగా కదిలే ఈ రైలు బోగీల్లో ప్రయాణపు సందడి ఉండదు; చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే నిస్సహాయుల మూగ రోదనలే రాజ్యమేలుతాయి. చేతుల్లో ప్లాస్టిక్ సంచుల్లో బయాప్సీ రిపోర్టులు, రేడియేషన్ కాలిన గాయాల నొప్పులు, కీమోతో రాలిపోయిన జుట్టును దాచేందుకు తలలకు చుట్టుకున్న గుడ్డలు ఈ ప్రయాణికుల ఉమ్మడి గుర్తింపు కార్డులు. దేశ ధాన్యాగారమైన పంజాబ్ పచ్చదనం మాటున దాగివున్న ప్రాణాంతక విషాదానికి ఈ 325 కిలోమీటర్ల ఎడారి ప్రయాణమే సజీవ సాక్ష్యం.

బికనీర్ బాట: ఆశలకూ అప్పులకూ నడుమ నిస్సహాయ పరుగు

సొంత రాష్ట్రం దాటి నిరుపేద రైతులు రాజస్థాన్‌లోని బికనీర్‌కు తరలివెళ్లడం వెనుక తీవ్రమైన ఆర్థిక వివక్ష, ఆస్పత్రుల కొరత దాగి ఉన్నాయి. పంజాబ్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స వ్యయం లక్షల్లోకి చేరడంతో, చిన్నకారు రైతులు కొద్దిపాటి భూములను అమ్ముకుని అప్పులపాలై రోడ్డున పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో బికనీర్‌లోని 'ఆచార్య తులసి రీజినల్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' నామమాత్రపు ఖర్చుతో లేదా ఉచితంగా ఆధునిక రేడియేషన్, సర్జరీలు అందిస్తుండటంతో, నిరుపేద రోగులకు అది ఆఖరి ఆశాదీపంగా మారింది.

అన్నపూర్ణ ఒడిలో విష బీజాలు: హరిత విప్లవపు చీకటి కోణం

దేశ ఆకలి తీర్చిన 1960ల హరిత విప్లవం చివరకు పంజాబ్‌ను, ప్రత్యేకించి మాల్వా ప్రాంతాన్ని విషవలయంలోకి నెట్టింది. దేశ వైశాల్యంలో 2% కంటే తక్కువ ఉన్న పంజాబ్, దేశంలోనే అత్యధిక రసాయనాలను వాడే ప్రాంతంగా మారింది. రాష్ట్రంలో ఏటా వాడే 5,270 మెట్రిక్ టన్నుల క్రిమిసంహారకాల్లో ఒక్క మాల్వా పత్తి ప్రాంతంలోనే 75% రసాయనాలు నేలపాలు అవుతున్నాయి.
బీటీ పత్తి తెగుళ్ల నివారణ పేరిట ఎండోసల్ఫాన్, ఆర్గానోఫాస్ఫేట్లు వంటి ప్రమాదకర విషాలను రైతులు విచక్షణారహితంగా పిచికారీ చేశారు. కనీస రక్షణ లేకుండా విష రసాయనాలను పీల్చడం వల్ల శరీరంలోని క్యాన్సర్ నిరోధక జీన్స్ దెబ్బతిని, ఉత్పరివర్తనాల ద్వారా మహమ్మారి ఊరూరా వేళ్లూనుకుంది.

తగ్గిన రద్దీ... కానీ తీరని విషాదం

తీవ్ర విమర్శల తర్వాత సంగ్రూర్‌లో హోమీ బాభా, బటిండాలో ఎయిమ్స్, మొహాలీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పదేళ్ల క్రితం రోజుకు వంద మందికి పైగా రోగులతో కిటకిటలాడిన ఈ రైలులో, నేడు ప్రయాణించే బాధితుల సంఖ్య తగ్గింది. రోగులకు ఆస్పత్రులు దగ్గరయ్యాయే తప్ప, పంజాబ్ తాగునీటిలోని యురేనియం, మట్టిలోని రసాయనాలు ఇంకా తొలగిపోలేదన్నది చేదు నిజం.

కోనసీమకు ప్రమాద ఘంటికలు: రేపటి విషపు గంట!

పంజాబ్ అనుభవం నేడు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న కోనసీమ ఆక్వా రంగానికి స్పష్టమైన ముందస్తు హెచ్చరిక. పచ్చని కొబ్బరి తోటలు, సస్యశ్యామలమైన వరి పొలాల డెల్టా కళ్లముందే విచ్చలవిడి చేపలు, రొయ్యల చెరువుల మయంగా మారుతోంది. వ్యాధుల నివారణ పేరిట వాడుతున్న మేతలు,మందుల్లో అక్రమ సంపాదన అమానవీయం. వ్యర్థ జలాలను ఎటువంటి శుద్ధి లేకుండా గోదావరి పంట కాలువల్లోకి వదిలేస్తుండటంతో తాగునీటి వనరులు మురుగు కాల్వలుగా మారుతున్నాయి.

మరోవైపు ఉప్పునీటి ఆక్వా సాగు కారణంగా తీరప్రాంత భూగర్భ జలాలు విషపూరితమై, ఆ అవశేషాలు నేరుగా ఆహార గొలుసులోకి చేరుతున్నాయి. తక్షణ లాభాల కోసం నేల, నీటిని బలిపెడుతూ పర్యవేక్షణ లోపిస్తే, భవిష్యత్ తరాలు ప్రాణాంతక క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల బారిన పడక తప్పదు. ఇప్పుడే మేల్కొనకపోతే, రేపటి రోజున కోనసీమ నుంచి విశాఖలో పరిశోధన పేరుతో ఏర్పడ్డ ఆసుపత్రులకు మరో 'క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్' పరుగులు తీసే దుస్థితి తప్పదు.
1,6600010
ఏమి సదువులో మ్మీ...పాడు సదువులు
సదవకపోతే బతుకులే లేనట్టు,

సదువు.. సదువు..,

ఇప్పటి తరాలు కష్టానికి దూరం అయినాయి గానీ.. కష్టం సేసిన సేతులు, వొళ్ళు ఎలాంటి రోగం రొట్టు ల్యాకుండా చింత పిక్కలా ఉండేది

సేతుల కట్టానికి విలువ ల్యేని పాడు రోజులు ఇవి
సేతుల కట్టం సేసినోళ్ళకు బతుకు ల్యేని కాలం కదా.

అందుకనే ఇంజనీరింగ్ లు...డాక్టర్లు...
ఇప్పుడు కొత్తగా మర మనుషులను సేసే తెలివి వుండే సదువులు

మీరంతా ఒక మూట వడ్లను పండియ్య గలరా..

సేతుల కష్టాలను తప్పించుకొని,
భూమి కి, మనిషికి మధ్య ఉండే సంబంధాన్ని తెంపే సదువులు
ఎండిన భూమి మీద ఒక పదును వాన పడినప్పుడు... వొచ్చే వాసన
స్టోర్ బియ్యం ఉడికి సెగ బీర్చుకునే టప్పుడు బువ్వ ఉమ్మగిల్లిన వాసన..

ఆరుద్ర కార్తె లో కురిసిన వాన...దున్నిన సేలో నుంచి
ఒక పిడికెడు మట్టిని తీసుకొని వాసన సూడు..
భూమి తల్లి ప్రసవవేదన...
బాలింత వాసన
నా తల్లి... ఎర్రటి ముఖమేల పట్టులాంటి మెత్తని దుప్పటి లాంటి ఆరుద్ర పురుగులు...
ఒట్టి బువ్వలో నెయ్యి పోస్తే ఘమాలించే ఆ బువ్వ మెతుకుల్లాంటి ఉసిల్లు
ఎన్ని దాండ్లకు జన్మ నిస్తూ... పురుడు వాసన ..

మాయా మోహ జగత్తు..
విభ్రమ పరిచే సూర్యోదయాలు...
సూర్యాస్తమయాలు...
చిత్త కార్తె లో తళతళ లాడే ఎండలో
మబ్బులు ల్యాకుండానే కురిసే వానలు....

అబ్బా...ఎన్ని దాండ్లను పోగొట్టుకున్యావు.మ్మీ..

ఒక కొత్త ప్రెపంచాన్ని సృజించడానికి ఇలాంటి సదువులు అవసరమేమో...

ఏమో మ్మీ....
ఆడ పిల్లొళ్ల మీద తండ్రికి బ్రెమ..
సదువుల పేరుతో నైనా మిమ్మల్ని దూరం సేసుకోవడం
మనస్సు నొప్పిగా ఉంది.
ఎప్పుడూ మీ గురుంచే ఆలోసన

మా లాంటి దరిద్రపు రైతు బతుకులు
మాలాంటి హీనమైన బతుకులు.. మీకొద్దు అనే ఊహే..
ఒకానొక ఊరట...

ఈ రోజు కూతుళ్ళ రోజoట గదా...
1,640003
స్వగతం:

1) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లెక్కల పరీక్ష మార్కులు : 145 / 150
2) ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం లెక్కల పరీక్ష మార్కులు : 72/ 150

ఎందుకో తెలియదు. "రీ కౌంటింగ్" కి అప్ప్లై చెయ్యమన్నారు, చేసాను. ఒక లెక్కల ప్రొఫెసర్ గారు నాకు తోడు వచ్చారు. వెళ్ళి నా పేపరు చూసుకున్నాను. అక్షరాలా నేను చేసిన 7 లెక్కలు ఎర్ర పెన్నుతో కొట్టేసి ఉన్నాయి. వాటిని అసలు ఎవాల్యుయేట్ చెయ్యనే లేదు. ఇక మిగిలిన లెక్కలకు ఇష్టం వచ్చినట్టు దిద్ది, చేతికి తోచిన మార్కులు వేసాడు ఆ దిద్దిన మహానుభావుడు. మొత్తం కూడితే 72 మార్కులే, ఎన్ని సార్లు కూడినా. రీ కౌంటిగ్ అంటే అంతేట.

ఆ దెబ్బతో మనసు విరిగిపోయింది. కనీసం 96 శాతం రావాల్సిన ఇంటర్ మార్కులు 76 శాతానికి పడిపోయింది, నేను చేయని తప్పువల్ల. పిలానీలో చదువుకునే అవకాశం పోయింది. ఆ ప్రభావం ఎంసెట్ మీద పడింది. ర్యాంకు 3001. నేను "జెనెరల్ కేటగిరీ" అట, ఆ కారణంగా నాకు మంచి అవకాశం దొరకలేదు. ప్రైవేట్లో డబ్బులుకట్టి చదువుకోమన్నారు. వద్దని డిగ్రీ చదివాను.

మళ్ళీ మూడేళ్ళ తరువాత ఇదే పరిస్థితి. ఈసారి మూడు అవకాశాలు సిద్ధంగా వచ్చాయి. అన్నిటికన్నా గొప్పది ఎం.సీ.యే ఎంట్రన్స్ పరీక్షలో 17 వ ర్యాంకు. మళ్ళీ ఈ "జెనెరల్ కేటగిరీ" అడ్డపడింది నాకు. జెనరల్ కేటగిరీలో కేవలం ఏడంటే ఏడే సీట్లున్నాయి. నీకు పదిహేడు కదా వచ్చింది, అందుకని చక్కగా డబ్బులు కట్టేసి ప్రైవేటు కాలేజీలో చదువుకోమన్నది వ్యవస్థ. డబ్బులు కట్టి చదివే అవకాశమూలేదు, ఆలోచనా లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో మాష్టర్స్ చేసాను. అవగానే, అడుగడుగునా ఈ అడ్డంకులు తట్టుకోలేక, చట్టబద్ధంగా కల్పించబడిన ఈ పరిస్థితులు భరించలేక, నలభై ఏళ్ళకు పైగా ప్రభుత్వోద్యోగం చేసి, అణువణువునా వివక్షను ఎదుర్కొన్న నాన్న గారి మాట విని దేశం వదిలి, అమ్మా,నాన్నని వదిలి, అందర్నీ వదిలి కడుపు చేతబట్టికుని రావల్సివచ్చింది.

నాన్న చెప్పిన మాట "ఒరేయ్, కొన్ని సామాజికవర్గాల వాళ్ళు ఈ దేశంలో బ్రతకాలి అంటే, నిత్యం, ప్రతి క్షణము ఏటికి ఎదురీదాలి.
వారికి రావలసిన అవకాశాలు ఒక జీవితకాలం లేటుగా వస్తాయి. పెళ్ళి చేసుకుని, మీ కుటుంబాన్ని, పిల్లలని మీరు కాస్తన్నా గౌరవంగా పోషించుకోవాలని అనుకుంటే, మీరు బాగుపడి, ఈ దేశానికి కొంతైనా సహాయం చెయ్యాలి అనుకుంటే, దయచేసి ఇక్కడినించి వేరే దేశం వెళ్ళిపోండి." అని. ఒక సారి నన్నూ, అన్నయ్యనూ, చిన్న తమ్ముణ్ణీ బేగం పేట ఎయిర్పోర్ట్ బయటకు తీసుకెళ్ళారు.

దూరంగా ఎగిరే విమానాన్ని చూపించి "మిమ్మల్ని అలా పంపించే స్థాయి కాదు మనది, కానీ మీరు చదువుకుని ఎలాగో అలాగ కష్టపడి ఎగిరి బైటకి వెళిపోండి. ఇక్కడి పరిస్థితులతో మీరు బ్రతకలేరు" అన్నారు చెమ్మగిల్లిన కళ్ళతో. (ఆయనకు రావలసిన డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ పన్నెండేళ్ళకు పైగా ఆలస్యమై, ఇక రిటరైపోతున్నారు అనగా అప్పుడు వచ్చింది, ఎందుకని అడక్కండి, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్ట్టుంటుంది సంబడం) మా నాన్నగారి మాట మాకు శిరోధార్యమైనది.

చిత్రమేమిటంటే, ఇక్కడకువచ్చి కొత్తలో ఒక గొప్ప వ్యక్తి నాకు మిత్రులయ్యారు. సాక్షాత్తూ శ్రీ.విశ్వనాథ సత్యనారాయణగారి పెద్దబ్బాయి. హైదరాబాద్ దూరదర్శన్ శంకుస్థాపన చేసిన వ్యక్తి. ప్రముఖ ఇంజనీరు, వేదవేత్త. ఎన్నో ఇంటర్నేషనల్ రిలీజియస్ సమిట్స్ లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, ఢెల్లీ దూరదర్సన్ వ్యవస్థాపక ఇంజనీర్లలో ఒకరు. లండన్ లో మోటరోలాకు ధీటుగా కంపెనీలను నడిపిన వ్యక్తి. అటువంటి వ్యక్తి తన పెన్షన్ కోసం పడ్డ పాట్లను వివరించి, ఒక నవ్వు నవ్వి "రాం గారూ, ఫణి గారూ, మీరు మన దేశానికి మేలు చెయ్యాలి అంటే అక్కడ ఉండి చేయడం అసాధ్యం. ఇక్కడే ఉండండి. మీకు తోచిన మేలు చేస్తూ ఉండండి. సాహిత్యానికి, సంస్కృతికి, పేదవారికి ఇక్కడినించే ఊతంగా నిలవండి మీ శక్తి మేరలో, మీ పరిథిలో." అన్నారు. ఎందుకో అవన్నీ గుర్తొచ్చాయి ఇవాళ.
ఫణి
1,510005
ఒక్కొక్కప్పుడు ఇద్దరూ దుకాణం దగ్గర వుంటారు. మమ్మల్ని చూసి ఇద్దరూ రెండు వేపులకి పరుగెత్తుతారు.

నా గొప్పతనానికో, పరపతికో ఈ మర్యాద దక్కుతోందనిపించి భుజాలు రహస్యంగా పొంగాయి. ఓసారి ఆపుకోలేక అడిగాను "నా సినిమాలు చూశావా?" అని. ఆ శరీరానికి ఎంత పరిపూర్ణమైన నవ్వుని అతికించాడో దేవుడు! పక్కున నవ్వాడు. ఆ నవ్వుని "చూడలేదు" అని తర్జుమా చేసుకున్నాను. అతని మీద గౌరవం మరింత పెరిగింది.

"వాడు పుణ్యాత్ముడు. వాడికి జన్మలేదు" –ఇది మా ఆవిడ ఎల్లప్పుడూ అతనికిచ్చే కితాబు.

రిబేటు ధరకి లేదా ధర ప్రమేయం లేకుండా పూల సెజ్జ అందించి అతనెంత నష్టపోయాడా నాకనిపిస్తూంటుంది.

చెన్నై బయలుదేరే రోజు దగ్గరికొచ్చేసింది. "రేపు ఊరికి బయలు దేరుతున్నాం" అన్నాను.

"ఉండండి" సార్ అని పక్కనే ఉన్న తమ్ముడి చెవులో ఏదో చెప్పాడు. పక్క దుకాణంలో ఎండు ద్రాక్షపళ్ళ పేకెట్ తెచ్చాడు కుంటి తమ్ముడు. రోడ్డు మీదే మా ఇద్దర్నీ పక్కపక్కన నిలబడమని– సాష్టాంగ పడమన్నాడు తమ్ముడిని.

"వీడికి ఆగష్టులో పెళ్ళయ్యా– దీవించండి" అని.

ఇద్దరికీ కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. సంప్రదాయం పట్ల వాడి మక్కువ, పెద్దల మీద గౌరవం, సుమంగళి తలనిండా పువ్వులు పెట్టుకు స్వామి దర్శనానికి వెళ్ళాలనే పట్టింపూ– ఆర్ద్రమైంది. మా ఆవిడ పర్సందుకొని ఓ వంద రూపాయల నోటు చేతిలో పెట్టబోయాను. ససేమిరా వద్దన్నాడు.

"మీ దీవెన చాలయ్యా" అదీమాట.

కారెక్కుతుండగా మూడేళ్ళుగా ఓ విషయం తెలుసుకోలేదని గుర్తుకొచ్చింది.

"ఒక్క నిమిషం" అని వెనక్కి నడిచాను. మా ఆవిడ ఆశ్చర్యంగా చూస్తోంది.

పూల దుకాణం దగ్గరకెళ్ళి అతన్ని అడిగాను "నీ పేరెన్నప్పా!"

కంచి కామకోఠి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతికి ప్రణామం చేసినట్టుగా రెండు చేతులు జోడించి అన్నాడు.

"మీర్ అయ్యా– మహమ్మద్ మీర్ ఆలం"

(ఇది కథ కాదు, కొడైకెనాల్ వెళ్ళినపుడు– కురింజి అండవర్ ఆలయానికి కుడిపక్కన పూల దుకాణం దగ్గర అతన్ని చూడవచ్చు.)
1,640003
#కురింజి
రచన – గొల్లపూడి మారుతీరావు గారు
తెలుగు జ్యోతి
తెలుగు కళాసమితి రజతోత్సవ ప్రత్యేక సంచిక

ప్రతి సంవత్సరం కొడైకెనాల్ యాత్రలో నన్ను ఆకర్షించే విషయం ఆ నేపాలీ వంటవాడి భోజనం. మా మిత్రుడి గెస్ట్ హౌస్లో తెనాలి వంటలు వండి పెట్టే "వినోద్" విందు ఆ పది రోజులూ పండుగని చేస్తాయి. గుత్తివంకాయకూర, కందిపప్పుపచ్చడి, ఉల్లిపాయపులుసు, పెసరట్టు, మసాలా దోశె, ఆవపెట్టినకూరలూ, ఇంకా వెజిటెబుల్ పులావు, బిసిబిళబాత్, వెజిటెబుల్ మంచూరియా– మీ యిష్టం, ప్రతీ రోజూ ఉదయం వంట రుచులు చూడడానికి లేస్తాను. వెనక తోటలో కాలిఫ్లవర్ నా చేత కోయించి– నా కళ్ళ ముందే వండి నా మతి పోగొడతాడు. సంవత్సరం పొడువునా పదిరోజుల కోసం ఎదురుచూస్తాను.

"నువ్వు కాపురాలు చెడగొడతావయ్యా, మీ వంట తిన్నవాళ్ళు పెళ్ళాల్ని వదిలేసి నీ దగ్గర సెటిలయి పోతారు– తిండికోసం" అంటే వెన్నెల కురిసినట్టు నవ్వుతాడు - నేపాలీ తెలుగులో మురిసిపోతూ.

గెస్ట్ హౌస్కి రెండు కిలోమీటర్ల దూరంలో మురుగన్ ఆలయం. అన్నీ కొండలు - ఎత్తుపల్లాలు కనుక సగం మీదకి నడవాలి, సగం కిందకి దొర్లాలి. ఆలయం పేరే "కురింజి ఆండవర్ ఆలయం". పన్నేండేళ్ళకి ఒకసారి పూచేపువ్వు– కురింజి. అరుదయిన పువ్వు ఆ చెట్టు ఆలయంలో ఉంది. పక్కనే క్రితం సారి పువ్వు పూచిన సంవత్సరం రాసి ఉంచుతారు. నేను పువ్వులు పూసిన సంవత్సరం వెళ్ళాను. చాలా అందమైన పువ్వు అతి సున్నితమైన స్వచ్ఛమైన సువాసన. లేత ఊదారంగు రేకులు– మంచు ఉదయాన పెళ్ళున లేచిన సూర్యరశ్మిలాగ పరిమళిస్తుంది.

నేనిక్కడ ఎవరికీ తెలియదు లేదా చూచాయగ కొందరికి తెలుసేమో, కాస్త అనుమానంగా, వింతగా చూస్తారు; చార్లెస్ శోభరాజును కోయంబత్తూరులో చూసినట్టు. అప్పుడప్పుడు తెలుగు టూరిస్టుల ముఖాలు, ఒక్కసారి వికసించి గొల్లుమంటాయి. కొడైకి దగ్గరలోనే "పెత్తల గుండు" దగ్గర మా డ్రైవరు ఊరు. నన్ను కొడైలో దింపి కారు అక్కడే వదిలేసి ఇంటికి పొమ్మంటాను. ఇన్నిసార్లుగా వస్తున్న మాకు కొడైలో పెద్దగా చూసేది ఏమీ లేదు. సాయంకాలం మా ఆవిడను బతిమాలి రెండు కిలోమీటర్లు నడిపిస్తాను. ఎత్తు రోడ్డు నడిచినంత సేపు నన్ను తిట్టుకొని, పల్లం దిగినప్పుడల్లా దేవున్ని పొగుడుతూ ఉంటుంది. ఏమైనా తిరిగి వచ్చే సరికి ఇద్దరమలసిపోతాం. కొడైలో చీకట్లు తొందరగా ముసురుకుంటాయి. మళ్ళీ వినోద్ భోజనానికి నిరీక్షణ– నిద్ర.

కురింజి ఆండవర్ ఆలయం దగ్గర, ఓ పూల దుకాణం. నల్లగా తుమ్మమొద్దులాగ వుండే యజమాని. మమ్మల్ని చూడగానే నవ్వుతూ పూలసెజ్జని అందిస్తాడు. అందులో కొబ్బరికాయ, పళ్ళు, పూలు అమరి ఉంటాయి. మా కోసం పువ్వుల్ని మారుస్తాడు. ఆ "నవ్వు" ప్రత్యేకంగా మా కోసమేనా? లేక వ్యాపారి "నమూనా" నవ్వా? అని మొదట లెక్క చేయలేదు. సరుకులమ్మే ప్రతీ వ్యాపారికి చిన్న ట్రెడ్మార్క్ ఉంటుంది. కాగా, ఇతనికి నా పేరూ, నా వేషాలూ తెలిసే అవకాశం లేదు. ఏమైనా తెలుగు బస్సులు ఆగడం, తెలుగు నవ్వులూ, రకరకాల కెమెరాల మెరుపులూ– కాస్త నా పరపతి గురించి పసిగట్టాడేమో, క్రమంగా అతని నవ్వు విశాలమైంది. ఎరిగా? లేక పరిచయం పెరిగా?

ఆలయం చేరేసరికి మా ఆవిడ రొప్పుతూ డ్రైవరుని పంపి వేసిన నన్ను తిట్టుకుంటూంటుంది. ఈ పూల యజమాని పరుగున మా దగ్గరికి వస్తాడు. చక్కటి తమిళంలో "అమ్మా!వాంగో!" అని ఆహ్వానిస్తాడు. నాకు కాస్త ఊరట. అప్పుడే వచ్చిన పూలని అలంకరించి సెజ్జని చేతికందిస్తాడు. ఓ మల్లె చెండుని తుంచి, మా ఆవిడ చేతికిచ్చి "ఇది తలలో పెట్టుకొని ఆలయంలోకి అడుగు పెట్టండమ్మా" అంటాడు. అంతే, మా ఆవిడకి "కురింజి అండవర్" అక్కడే ప్రత్యక్షమైనంత సంబరం. ఆవిడ భర్తనైనందుకే నా మీద గౌరవమా? లేదా నా భార్య అయినందుకు ఆవిడకి మర్యాదా? ఏమయినా పరపతికి, పూలచెండుకి పొంతన లేదు.

క్రమంగా– ఆలయం సమీపిస్తూనే– ఆ చింతమొద్దు కోసం చూడడం అలవాటయిపోయింది. ఆ శరీరాన్ని మరిపించే మర్యాద, మప్పితం, ఆర్ద్రత ఆ నవ్వులో. చిన్న పూలచెండు– అందరి సంగతియేమోగాని– మా ఆవిడ యిచ్చినంత డబ్బు తీసుకుంటాడు. దాని వేపు చూసినట్టయినా కనిపించడు. నాకే కాస్త యిబ్బంది అనిపించి "మరో అయిదు రూపాయలు ఎక్కువ యియ్యి" అని మా ఆవిడని గోకుతాను.

కురింజి అండవర్, పూల యజమాని– మాకు క్రమంగా ఎదురుచూసే రొటీను అయిపోయింది. ఒక్కోసారి అతను ఉండడు. దుకాణాన్ని తప్పించుకుందామనుకుంటే అక్కడ వుండే కుంటి కుర్రాడు అడ్డం పడతాడు. అతని పెదాలకు తొర్రి. ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. తమిళం సరిగా అర్థం కాదు. కాని అంతే భక్తిగా పూలసజ్జని అందిస్తాడు.

"మర్యాద" పెద్ద అంటువ్యాధి. అలవాటు పడితే వదిలిపెట్టదు. ఓ రోజు దారిలో వర్షం పట్టుకుంది. తలదాచుకునే చెట్లు లేవు. ఇద్దరం తడిశాం. ఆలయానికి మలుపు తిరిగితే అల్లంత దూరంలో మమ్మల్ని కనిపెట్టి రెండు గొడుగులతో పరుగున వచ్చాడు. భక్తిగా మా ఆవిడకి గొడుగు అందించి నా గొడుగు తను పట్టుకు నా వెంట తనే నడిచాడు. తడిసిన మా బట్టలు చూసి "నాకు చాలా బాధగా వుందయ్యా" అన్నాడు; ముఖం చిన్నబుచ్చుకొని. దర్శనం అయి, వర్షం తగ్గే వరకూ రెండు బల్లలు వేసి కూర్చో పెట్టాడు. అప్పుడు తెలిసింది కుంటికాలు కుర్రాడు అతని తమ్ముడని. ఇద్దరికీ వయస్సులో తేడా.
1,770006
చైనా, జపాన్ లకు చదువు చెప్పిన భారత దేశం....

మన ప్రాచీనుల మేధో సంపద, విశ్వవ్యాప్తంగా జ్ఞాన జ్యోతులు వెలిగించిన అఖండ భారత జ్ఞాన భాండాగారాల గురించి తెలియ జెప్పే క్రమంలో వారికి మూల జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యవస్థల గురించి ముందుగా చెప్పటం నా ధర్మం అన్పించింది. ఈరోజున ఉన్నత విద్య కోసం మనం విదేశాలకు వెళ్తున్నాం. మన పిల్లల్ని పంపిస్తున్నాం. అయితే, కొన్ని వందల, వేల ఏళ్ళ క్రితమే ఆ దేశాలు మన దగ్గర పాఠాలు నేర్చుకున్నాయి. మన దేశం మీద దాడులు చేసి, మన గ్రంధాలను ఎత్తుకొని వెళ్ళాయి. మన విజ్ఞాన సంపదను దోచుకొని వెళ్ళాయి. వాటిని నేర్చుకోవటానికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుండటం దురదృష్టకరం.

అఖండ భారత దేశంలో వందల, వేల ఏళ్ళ క్రితమే విశ్వవిద్యాలయాలు ఉండేవి. ప్రాధమిక విద్యలను గురుకులాల్లోనూ, ఉన్నత విద్యలను విశ్వవిద్యాలయాల లోనూ బోధించేవారు. అలనాటి మన విశ్వవిద్యాలయాల్లో చైనా,జపాన్,కొరియా,పర్షియా,టర్కీ.ఇండోనేషియా,టిబెట్,శ్రీలంక దేశాల నుంచి వచ్చిన వారు విద్యను అభ్యసించే వారు. తక్షశిల ,పుష్పగిరి,నలంద,తెలాహారా (బీహార్లో ఉన్న ఇది నలందాకన్నా ప్రాచీనమైనది),ఒదాంత పురి( బీహార్), సోమపుర (బంగ్లాదేశ్), శారదాపీఠం,(పాకిస్తాన్), జగద్దల (బెంగాల్), నాగార్జున కొండ (ఆంధ్రప్రదేశ్),విక్రమశిల (బీహార్),వలభి (గుజరాత్), కాంచీపురం (తమిళనాడు) మన్యఖేట్ (కర్ణాటక) వంటి విశ్వవిద్యాలయాలు మనదగ్గర ఉండేవి. క్రీస్తుపూర్వం నుంచి వందల ఏళ్ళపాటు విరాజిల్లిన వాటిలో చాలా విశ్వవిద్యాలయాలు తురుష్కుల దండయాత్రల తర్వాత ధ్వంసం అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో వున్న విశ్వవిద్యాలయం ఒక్కటి మాత్రం క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. అది కూడా మధ్యమధ్యలో అనేక ఒడిదుడుకు లకు లోనయ్యింది.

భారతావనిలోని అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ముఖ్యమైనది. క్రీస్తుపూర్వం ఆరు-ఐదు శతాబ్దాల కాలంలో స్థాపించబడిన ఈ విద్యాలయం క్రీస్తు శకం ఐదో శతాబ్దం వరకు అంటే దాదాపు వెయ్యేళ్ళ పాటు ఉజ్వలంగా విలసిల్లింది.సాధారణంగా గురుకులాల్లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక 16 వ ఏట విద్యార్ధులు ఈ విద్యాలయంలోకి ప్రవేశించేవారు. ఇందులో వేదవిజ్ఞానం, గణితం,ఖగోళం,న్యాయశాస్త్రం,వైద్యశాస్త్రం,యుద్ధతంత్రం బోధించేవారు. ఇవే కాకుండా, అష్టాదశ విద్యలైన విలువిద్య,వేట,గజరాజులను మచ్చిక చేసుకొని శిక్షణ ఇవ్వటం వంటివి కూడా నేర్పించేవారు. ఈ తక్షశిల గురించి బౌద్ధ జాతక కథలలో పలు ప్రస్తావనలు ఉన్నాయి.

కౌటిల్యుడుగా సుప్రసిద్ధుడైన చాణుక్యుడు తన అర్ధశాస్త్రాన్ని ,దీర్ఘాయుష్షు ప్రదాతగా పేరొందిన చరకుడు తన చరకసంహితను కూడా ఇక్కడే రాశాడని చెప్తారు. అలాగే, మౌర్య సామ్రాజ్యాధీశుడైన చంద్రగుప్తుడు కూడా ఇక్కడే విద్యలన్నీ నేర్చుకున్నాడని చరిత్రకారులు చెప్తారు.

మరో ముఖ్యమైన విశ్వవిద్యాలయం నలంద. ప్రస్తుత బీహార్లో క్రీస్తుశకం ఐదో శతాబ్దంలో స్థాపించబడి పన్నెండో శతాబ్దం వరకు దాదాపు 700 ఏళ్ళపాటు విజ్ఞానకాంతులు వెదజల్లినది. ఈ కాలంలో మానవ చరిత్ర గతిని మలుపులు తిప్పిన ఎందరెందరో జ్ఞానులను,మేధావులను తయారు చేసింది. సుప్రసిద్ధ గణిత వేత్త ఆర్యభట్ట (క్రీ.శ. 470-550), వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు,భాస్కరాచార్యులు వంటి వారు నలందలో తమ మేధకు పదును పెట్టిన వారే.ఇక్కడ బౌద్ధం ప్రధానాంశం అయినప్పటికీ, గణితం,ఖగోళం,వైద్యం, రాజకీయం, యుద్ధతంత్రం తో పాటు, సంగీతం,సాహిత్యం, చిత్రలేఖనం వంటివి కూడా బోధించేవారు.

ఈ విశ్వవిద్యాలయంలో ఎనిమిది వేర్వేరు కాంపౌండ్ లు ,పది ఆలయాలు, ధ్యానమందిరాలు, ఆరామాలు, తరగతి గదులు, సరస్సులు, ఉద్యానవనాలు ఉండేవి. ముఖ్యంగా తొమ్మిది అంతస్థుల అతిపెద్ద గ్రంధాలయం ఉండేది.అందులో అత్యంత విలువైన లక్షలాది పురాతన గ్రంధాలు ఉండేవి.వేలాది విద్యార్ధులు అక్కడ కూర్చొని తమకు అవసరమైన గ్రంధాలను కాపీ చేసుకొని రాతప్రతులు సిద్ధం చేసుకునే వారు. ఆ రోజుల్లోనే 10 వేలమంది విద్యార్ధులు, రెండు వేలమంది అధ్యాపకులు అక్కడ నివసించటానికి అవసరమైన వసతి సౌకర్యాలు విశ్వవిద్యాలయంలో ఉండేవి.

మనదేశపు ఔనత్యాన్ని తెలియజేసే అంశాల్లో ఇది ఒకటి. వీటి గురించి కనీస అవగాహన లేని కొందరు అర్ధజ్ఞానులు మన దేశాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడటం శోచనీయం.
#ksraju
2,180005
స్థితిజ శక్తి (Potential energy) శివుడైతే, గతిజ శక్తి (Kinetic energy) శక్తి. ఈ గతిజ శక్తినే పాములా కదిలే 'కుండలినీ శక్తి'తో పోలుస్తారు.

సూర్యుని ద్వాదశ కళలు శివశక్తుల ఆలింగనం నుండే ఉద్భవిస్తున్నాయి. సూర్యుని కాంతే చంద్రునిపై ప్రతిఫలించి మనకు చేరుతుందన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. అవి వేర్వేరు కావు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు కుండలినీ శక్తి ప్రవాహం గరిష్ట స్థాయిలో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అత్యంత బలంగా లేదా అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు కుండలిని చాలా చురుకుగా ఉంటుంది. గ్రహణ సమయంలో భూమిపై సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. సముద్రాలు భూమి నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. విశ్వస్థాయిలో చూస్తే, ఇది ఘన స్థితి (solid state) నుండి ద్రవ స్థితి (liquid state) దూరంగా వెళ్లడానికి చేసే ప్రయత్నానికి ప్రతీక. ఇదే కుండలినీ శక్తి ఊర్ధ్వముఖ ప్రయాణం. విశ్వశక్తులకు అనుగుణంగా మీ పూజా విధానాలను కూడా మీరు సమన్వయం చేసుకోవాలి. అందుకే, ఈ మూడు గోళాలు దాదాపు ఒకే రేఖపైకి వచ్చే పౌర్ణమి, అమావాస్య రోజులు పూజకు అత్యంత అనువైనవిగా భావిస్తారు. చంద్రుని గమన చక్రాలు, మన పూజా విధానాల చక్రాలతో ఇంత సన్నిహితంగా ముడిపడి ఉండటానికి కారణం ఇదే. పౌర్ణమి పూజ, అమావాస్య పూజ అని వేర్వేరుగా ఉంటాయి. మీరు విశ్వశక్తులతో మమేకమైనప్పుడు, మీలోని అంతర్గత శక్తులు మరింత అద్భుతంగా పనిచేస్తాయి.

శివశక్తుల ఆలింగనంలో మీకు అక్షరాల జంటలు కనిపిస్తాయి. కం-భం, ఖం-బం మొదలైనవి. ఇవి మీ శరీరంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి మీరు ఈ సూత్రాన్ని (key) ఉపయోగిస్తారు. ఒక బిందువు నుండి మరొక బిందువుకు కాంతి కిరణం ప్రసరిస్తుంది. మొదటి రెండు అక్షరాలు స్వాధిష్ఠాన చక్రం యొక్క కుడి భాగం నుండి వస్తాయి. ఇక్కడి నుండి ఈ బిందువులు మణిపూరక చక్రం వరకు పైకి కదిలి నడుము చుట్టూ తిరుగుతాయి, అదే సమయంలో ఇతర బిందువులు అనాహత చక్రం మరియు హృదయ స్థానం చుట్టూ తిరుగుతాయి. ఇదే ఆ ఆలింగనం. ఈ ఆలింగనం నుండే ప్రపంచానికి ప్రాణదాత అయిన సూర్యుడు ఉద్భవిస్తున్నాడు. అక్కడ ఉన్న అణు రియాక్టర్ (శక్తి కేంద్రం) ఈ సమ్మేళనం నుండే పుడుతుంది. ఎడమ చేయి నడుము చుట్టూ, కుడి చేయి ఛాతీ చుట్టూ ఇలా పెనవేసుకున్నట్లుగా మీరు ఊహించుకోవచ్చు. ఈ ఆలింగనం నుండే మనం సూర్య కళలను ఆవాహన చేస్తాము. సంస్కృత అక్షరాల స్థానంలో ఏ భాషా అక్షరాలనైనా ఉంచుకోవచ్చు. సూర్య కిరణాల కోసం చేసే ఈ పూజలో అక్షరాల కంటే వాటి వెనుక ఉన్న అంతరార్థమే అత్యంత ముఖ్యం.

సూర్య కళలు: ఐం హ్రీం శ్రీం...... నమః
2,190001
సూర్య కళావాహన - సూర్య తత్వం
====================
భూమిపై జీవకోటికి మూలాధారం సూర్యుడే. సూర్యుడే లేకపోతే, ఈ భూమండలం ఒక నిర్జీవ గ్రహంగా మిగిలిపోయేది. సూర్యుని చుట్టూ తిరిగే నవగ్రహాలలో, కేవలం భూమిపై మాత్రమే జీవం విలసిల్లడానికి కారణం—అది సూర్యుడికి ఉండాల్సిన కచ్చితమైన దూరంలో ఉండటమే. సూర్యుడే మన ప్రాణశక్తి. ఆకాశంలో సూర్యోదయం కాగానే, మనమంతా మన దైనందిన బాధ్యతల్లో నిమగ్నమవుతాము. ప్రాణాలను నిలిపే ఈ అద్భుతమైన శక్తి, శివశక్తుల ఆలింగనం (సమ్మేళనం) నుండి ఉద్భవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుని ద్వాదశ (పన్నెండు) కళలలో వర్ణించబడిన అంతరార్థం ఇదే.

సూర్య మంత్రం:
క్లీం సూర్యమండలాయ కామప్రద ద్వాదశ కళాత్మనే శ్రీ మహా త్రిపురసుందర్యాః విశేషార్ఘ్య పాత్రాయ నమః |
ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ |
హిరణ్మయేన సవితా రథేనా దేవో యాతి భువనా విపశ్యన్ ||
హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః సూర్యమండలాయ నమః ||

పదవివరణ:
* సూర్యమండలాయ – సూర్య బింబము లేదా సూర్య వలయము;
* ద్వాదశ – పన్నెండు;
* కళాత్మనే – పన్నెండు కళల స్వరూపమైనది;
* విశేషార్ఘ్య – మనం అమృతాన్ని ఆవాహన చేయబోయే పాలు లేదా మధువు;
* పాత్రాయ నమః – సూర్య స్వరూపంగా భావించే ఆ పాత్రకు నమస్కారం.

మన శరీరంలో సూర్య తత్వాన్ని 'పింగళ నాడి' అనీ, చంద్ర తత్వాన్ని 'ఇడా నాడి' అనీ పిలుస్తారు. ఈ ప్రక్రియలో మనం ఈ రెండింటినీ అనుసంధానం చేయబోతున్నాం. సూర్యునిలోని వేడిని, చంద్రునిలోని చల్లదనాన్ని ఏకం చేస్తున్నాం. ఇక్కడ 'వేడి' అనేది జీవితం పట్ల ఉండే తీవ్రమైన ఆసక్తికి (అనురక్తికి) ప్రతీక కాగా, 'చల్లదనం' అనేది వైరాగ్యానికి (నిస్సంగత్వానికి) ప్రతీక. అంటే, "వైరాగ్యంతో కూడిన అనురక్తిని" మనం సాధన ద్వారా ఏకం చేస్తున్నామన్నమాట.

ఈ రెండింటి కలయికలోనే 'సుషుమ్నా నాడి' దాగి ఉంది. ఇది ఒక లోలకం (pendulum) లాంటిది. లోలకాన్ని పూర్తిగా కుడివైపుకు (సూర్యుని వైపుకు) లాగితే, అది అక్కడే ఆగిపోదు. మధ్యలోకి వచ్చి, మళ్లీ ఎడమవైపుకు (చంద్రుని వైపుకు) ఊగుతుంది. అలాగే, మనసును పూర్తిగా వైరాగ్యం వైపు మళ్లించాలని ప్రయత్నిస్తే, అది అక్కడ నిలకడగా ఉండక, తిరిగి కామం (కోరికల) వైపు దూసుకువెళుతుంది. ఇలా మనసు వైరాగ్యానికి, కామానికి మధ్య నిరంతరం ఊగిసలాడుతూనే ఉంటుంది. కానీ, ఆ లోలకాన్ని సరిగ్గా మధ్యస్థానంలోకి తెచ్చి వదిలేసినప్పుడు మాత్రమే అది స్థిరంగా ఉంటుంది. అప్పుడు దానికి కామం పట్ల ద్వేషం ఉండదు, వైరాగ్యం పట్ల వ్యామోహం ఉండదు. అలాగే కామం పట్ల ఆకర్షణ ఉండదు, వైరాగ్యం పట్ల విముఖత ఉండదు. అదే పరిపూర్ణమైన నిస్సంగత్వం (Absolute detachment). ఇదే సుషుమ్నా నాడి మార్గం. సుషుమ్న వెచ్చగా ఉంటుంది; అందులో సూర్యుని దహించే వేడి ఉండదు, చంద్రుని గడ్డకట్టించే చలి ఉండదు. మీరు ఒకే సమయంలో అనురక్తితోనూ, విరక్తితోనూ ఉంటారు. బౌద్ధమతంలో దీనినే 'మధ్యమార్గం' (Middle way) అంటారు. ఈ విధానం బౌద్ధ మండలాల తత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది.

* ఆ సత్యేన – ఆది నుండి అంతం వరకు సత్యంతో కూడి;
* రజసా – ఆ సత్యం యొక్క ప్రసరణ;
* వర్తమానో – ఆ సత్య ప్రసరణలో ఆద్యంతాలు నిమగ్నమై ఉండటం;
* నివేశయన్నమృతం మర్త్యం చ – అమృతత్వంలోనూ మరియు మర్త్యత్వంలోనూ (మరణశీలతలోనూ), అనగా యోగంలోనూ మరియు భోగంలోనూ మిమ్మల్ని మీరు నిలుపుకోవడం;
* హిరణ్మయేన – బంగారుమయమైన;
* సవితా – ప్రాణదాత (గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవత సవితృ దేవుడే);
* రథేన – రథము. బంగారు రథంపై అధిరోహించి;
* దేవో యాతి – ఆ సూర్యభగవానుడు ఆకాశంలో పయనిస్తున్నాడు;
* భువనా విపశ్యన్ – సమస్త లోకాలను వీక్షిస్తూ.

హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః – ఇందులో 'హ్రీం' అనేది బిందువును త్రికోణం వైపుకు తీసుకువెళ్లే సృజనాత్మకమైన, విస్ఫోటకమైన శక్తి. ఈ బీజాక్షరాలు 'అం' అనే చల్లదనం నుండి 'అః' అనే తీవ్రత (passion) వరకు 'హ్రీం' పొందే మార్పులకు సంకేతాలు. అంటే, మీరు కేంద్రం నుండి కుడివైపుకు, అలాగే ఎడమవైపుకు పయనిస్తున్నారని అర్థం.
హ్రమలవరయుం – మీ శరీరంలో ఈ అక్షరాలు కొలువై ఉన్న మార్గం.

సంస్కృతంలో అక్షరాల వెనుక ఉన్న భావనలు ఎంత పటిష్టంగా నిర్మించబడ్డాయో ఆ అక్షరాల స్థానాలను బట్టి అర్థమవుతుంది. యముడు మృత్యుదేవత. స్వాధిష్ఠాన చక్రానికి ఎడమవైపున 'య' కారం, కుడివైపున 'మ' కారం ఉంటాయి. మీరు 'యమ' అని పలికినప్పుడు, స్త్రీ తత్వం నుండి పురుష తత్వం వైపుకు పయనిస్తున్నారు. ఇది మరణంతో సమానమైన మీ చైతన్య ప్రయాణాన్ని సూచిస్తుంది.

ఇదే అక్షరాలను తారుమారు చేస్తే 'మయ' (మాయ) అవుతుంది. అప్పుడు మీరు శివుని నుండి శక్తి వైపుకు పయనిస్తున్నారు. మాయ అంటే భ్రమ మాత్రమే కాదు, అది ఆనందానికి, అనుభవాల ప్రవాహానికి కూడా ప్రతీక. కాబట్టి, మీరు శివుని నుండి శక్తి వైపుకు వెళుతున్నప్పుడు, ఈ భౌతిక ప్రపంచం చేత మీ చైతన్యం పరిమితం చేయబడటాన్ని మీరు అనుభూతి చెందుతారు. అదే మీరు శక్తి నుండి శివుని వైపుకు పయనిస్తున్నప్పుడు, మీ చైతన్యం విస్తరిస్తుంది, మీరు అపరిమితమవుతారు. ఇక్కడ ప్రవాహం 'శక్తి' కాగా, నిశ్చలత్వం 'శివుడు'.
1,960003
"గురువుగారూ, నేను ఎన్నో పుస్తకాలు చదివాను… కానీ వాటిలో చాలావరకు మర్చిపోయాను. అలాంటప్పుడు ఇంకా చదవడం వల్ల ప్రయోజనం ఏమిటి?"

​ఓ జిజ్ఞాస గల శిష్యుడు తన గురువును అడిగిన ప్రశ్న ఇది. గురువు వెంటనే ఏమీ బదులివ్వలేదు, కేవలం మౌనంగా అతని వైపు చూశారు.

​కొన్ని రోజుల తర్వాత, వారిద్దరూ ఒక నదీ తీరాన కూర్చుని ఉండగా, గురువు హఠాత్తుగా ఇలా అన్నారు:

"నాకు దాహంగా ఉంది. కాస్త నీళ్లు తీసుకురా… అయితే, అక్కడ నేలపై పడి ఉన్న ఆ పాత జల్లెడతో తీసుకురా."

​శిష్యుడు అయోమయంలో పడ్డాడు. అది చాలా వింతైన కోరిక. రంధ్రాలున్న జల్లెడతో నీళ్లు ఎలా తేగలరు?

​కానీ గురువుగారిని ఎదిరించే ధైర్యం చేయలేకపోయాడు.

​ఆ జల్లెడను చేతిలోకి తీసుకుని ప్రయత్నించాడు.
ఒక్కసారి, రెండుసార్లు… మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

​వేగంగా పరిగెత్తాడు, జల్లెడను రకరకాల కోణాల్లో తిప్పాడు, వేళ్లతో రంధ్రాలను మూయడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఏదీ ఫలించలేదు. ఒక్క నీటిబొట్టు కూడా అందులో నిలవలేదు.

​అలసిపోయి, విసుగుతో ఆ జల్లెడను గురువు పాదాల దగ్గర పడేసి ఇలా అన్నాడు:

"నన్ను క్షమించండి. నేను చేయలేకపోయాను. ఇది అసాధ్యమైన పని."

​గురువు అతని వైపు దయతో చూస్తూ ఇలా అన్నారు:
"నువ్వు విఫలం కాలేదు. ఒక్కసారి ఆ జల్లెడ వైపు చూడు."

​శిష్యుడు కిందికి చూశాడు… అతనికి ఒక విషయం అర్థమైంది.

ఒకప్పుడు నల్లగా, మురికిగా ఉన్న ఆ పాత జల్లెడ ఇప్పుడు తళతళా మెరుస్తూ శుభ్రంగా ఉంది. నీరు అందులో నిలవకపోయినా, ప్రవహించిన ప్రతిసారీ దాన్ని కడిగి శుభ్రం చేసింది.

​గురువు కొనసాగించారు:

"పుస్తకాలు చదవడం కూడా సరిగ్గా ఇలాంటిదే. నువ్వు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోయినా పరవాలేదు. జల్లెడలో నుంచి నీరు కారిపోయినట్లు జ్ఞానం జారిపోయినట్లు అనిపించినా నష్టం లేదు…
​ఎందుకంటే నువ్వు చదువుతున్నప్పుడు నీ మనస్సు ఉత్తేజితమవుతుంది.

నీ ఆత్మ నూతనోత్తేజాన్ని పొందుతుంది.
నీ ఆలోచనలకు కొత్త జీవం వస్తుంది.
నువ్వు వెంటనే గమనించకపోయినా, నీలో అంతరంగికంగా ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది."
​పుస్తక పఠనం యొక్క అసలైన ఉద్దేశం ఇదే.

జ్ఞాపకశక్తిని నింపుకోవడం మాత్రమే కాదు…
మన అంతరాత్మను శుభ్రపరచి, ఉన్నతంగా తీర్చిదిద్దడం.

​— రచయిత అజ్ఞాతం
1,060002
అన్నం గురించి మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు...

1.. " నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా. ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! .... ఎంతయినా అమ్మ అంటే అన్నం. .... అన్నం అంటే అమ్మ ! అంతే !

( జంధ్యాల గారు ) .

2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాప సభకి వెళ్ళిన దానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .

3... రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! ... వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .


4. . ఆరు రోజుల పస్తులున్న వాడి ఆకలి కన్నా, మూడు రోజుల పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

5. ఏటా వంద బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవి కావు నాయనా " అని బీదసాదల కి చేటలతో పంచేసే వారు.. అన్నీ మనవి కావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనే గానీ అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )

6. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! 🙏🙏🙏

( చాగంటి కోటేశ్వరరావు గారు ) .

7.. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!

(గౌతమ బుద్దుడు ).

8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారు కూడా అమృతంలా రుచిస్తుంది !

( మాతా అమృతానందమయి ) .

9. . మీ పిల్లలు ఎంత దూరంలో, ఎక్కడ వున్నా , వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పా కాదూ , మీ గొప్పా కాదు .... మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించుకుని మనం బ్రతకాలి..

ఎంతటి మంచి వాక్యాలు.......
పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం...
సేకరణ.
#hopekancharla
1,060009
మీ మీ ఊర్లో కానీ దగ్గర్లో కానీ ఉన్న పురాతన దేవాలయాలు, వాటి చరిత్ర, మన దేశ చరిత్ర కు సంబందించిన విషయాలు మీకు తెలిసి ఉన్నవి 8500206246 కి msg / call చేసి తెలియజేయండి.... మన సొంత చరిత్ర ను మనమే చాటి చెబుదాం, చేయగలిగితే ఏదయినా అభివృద్ధి లో భాగం అవుదాం.
1,290001
మీ మీ ఊర్లో కానీ దగ్గర్లో కానీ ఉన్న పురాతన దేవాలయాలు, వాటి చరిత్ర, మన దేశ చరిత్ర కు సంబందించిన విషయాలు మీకు తెలిసి ఉన్నవి 8500206246 కి msg / call చేసి తెలియజేయండి.... మన సొంత చరిత్ర ను మనమే చాటి చెబుదాం, చేయగలిగితే ఏదయినా అభివృద్ధి లో భాగం అవుదాం.
1,370004
ఈ కంటెంట్ తో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాలనుకుంటున్నాను... కలిసి పనిచేసేందుకు ఉత్సాహం ఉన్న వాళ్ళు msg చెయ్యండి..
1,400005
మంచు కరిగే వేళలో ...
సున్నా డిగ్రీ లు అంత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటే నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది .
సముద్ర మట్టం నుంచి 6000 మీటర్లు అంత కన్నా ఎత్తున్న పర్వత శిఖరాల్లో ఉష్ణోగ్రత ఎప్పుడూ సున్నా కంటే తక్కువ గా ఉంటుంది . దానితో అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తుంది .
కొండపై కురిసిన మంచు నెమ్మదిగా లోయవైపుగా కిందకు పయనిస్తుంది .
ఇలా కిందకు కదిలే మంచునే హిమానీనదం అంటారు .
గత కోనేళ్ళుగా భూమి వేడెక్కుతోంది .
ఈ నాటి పరిసితుల్లో దీనికి కారణాలు
1విద్యుత్ కోసం బొగ్గు వినియోగం . ఇళ్లల్లో పరిశ్రమల్లో గ్యాస్ , విద్యుత్ వినియోగం - 45% శాతం ఇది కారణం .
2.భూమిపై నడిచే వాహనాలు .. విమానాలు -15% కారణం
3. కొత్త పరిశ్రమలు , ఆధునిక వ్యవసాయం , ప్రాజెక్ట్ లు కట్టడం కోసం రియల్ ఎస్టేట్ కోసం అడవుల నరికివేత - 38% కారణం
4. డేటా సెంటర్స్ , డిజిటల్ పరికరాలు - 2% కారణం .
ముందుంది మరణ మృదంగం !
ఇప్పుడు కృతిమ మేధ మొదలయ్యింది . నేటి పరిస్థితిల్లో కృతిమ మేధ డేటా సెంటర్స్ విద్యుత్ లో 15% వాడుకొంటోంది . 2030 కల్లా ఇది 40% అవుతుంది .
డేటా సెంటర్స్ 2025 లోనే 286 టన్నుల బొగ్గు పులుసు వాయువు ను విడుదల చేసాయి . 2030 కల్లా ఇది 2.5 బిలియన్ టన్నులు అవుతుంది .
గాలిలో బొగ్గుపులుసు వాయువు పెరిగితే వాతావరణం వేడెక్కుతుంది .
అంతే కాక ఆ డేటా సెంటర్స్ విద్యుత్ రాకాసులు .
విద్యుత్ వినియోగం కోసం బొగ్గు కావాలి .
అంటే అడవుల్లో తవ్వకాలు .. అడవులు నరకడం .
జల విద్యుత్ అయినా ప్రాజెక్ట్ లు కట్టాలి . అంటే అడవులు నరకడం .
సౌర పవన విద్యుత్ కు షిఫ్ట్ కావాలి . కానీ ఇది పెద్దగా జరగడం లేదు .
వాతావరణానికి మరో ముప్పు .. రాబోయే ఐదేళ్లలో విమానాలు . వీటి సంఖ్య భారీగా పెరుగుతోంది .
విష ప్రచారం :
దీని అన్నింటికీ కారణం పసిఫిక్ మహా సముద్ర వేడెక్కడం .. ఎల్ నినో అని ప్రచారం .
జనాలకు సైన్స్ తెలియదు .
ఎల్ నినో ఇప్పుడు కొత్తగా మొదలయ్యింది కాదు .
ఎన్నో లక్షల ఏళ్లుగా జరుగుతున్నా సహజ ప్రక్రియ .
వాతావరణం వేడెక్కడం ఎల్ నినో వల్ల కాదు .
వాతావరణం వేడెక్కడం వల్ల ఎల్ నినో తరచూ రావడం జరుగుతోంది .
వ్యాపారులు ఏమైనా చేస్తారు .
ఆరేళ్ళ క్రితం అదిగో కరోనా అన్నారు .. ప్రపంచ వ్యాపితంగా లాక్ డౌన్ పెట్టేసారు .
ఫలితంగా ఆన్లైన్ వ్యాపారాలు వంద రెట్లు పెరిగాయి .
వస్తువుల కొనుగోళ్లు , విష వినోదం , గంజాయి, బెట్టింగ్ , ఆన్లైన్ అప్పులు , ఆన్లైన్ అడల్ట్ వ్యాపారాలు ..ఈ మొత్తం టాక్సిక్ అనకొండలా ఎల్లెడలా వ్యాపించింది .
. వెను తిరిగి చూస్తే ... ఇవన్నీ ఒక పద్ధతిలో .. ఒక ప్రణాళిక ప్రకారం... జరిగినట్టు ఇప్పటికైనా మీకు అనిపించడం లేదా ?
ఇదీ అంతే !
హిమాలయాలు అంటార్కిటికా మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి ఒరిస్సా బెంగాల్ లాంటి రాష్టాల్లో తీర ప్రాంత ఆవాసాలు మరో ద్వారకలా నీట ముణగని .. నేపాల్ భూటాన్ లాంటి దేశాలు కనుమరుగై పోనీ .. హరప్పా నాగరికత లా డిజిటల్ యుగ ప్రపంచం వరదల అగ్ని ప్రమాదాల వల్ల అంతరించి పోనీ ..
ఈ ప్రళయ బిజినెస్ ఆగదు .
నాటకాలు మాత్రం మస్తు జరుగుతాయి .
నాటకాలు ఏంటి అనుకొంటున్నారా ?
ప్లాస్టిక్ వినియోగ నాటకాల లాగే ..
ప్లాస్టిక్ వాడొద్దు అని కబుర్లు చెప్పేబదులు ప్లాస్టిక్ ఉత్పత్తి ని నిషేదించవచ్చుగా ?
పర్యావరణ రక్షణ- ఎలక్షన్ ఎజెండా కాదు ..
అది ఎవరికీ పట్టని బిడ్డ . మిడిల్ క్లాస్ వాడి ఆర్థిక సమస్య లాగా .. కాబట్టి ఆ అనాధ బిడ్డను ఏ రాజకీయ పార్టీ ఎత్తుకోదు .
ఎత్తుకొంటే కోర్ట్ లు ఒప్పుకోవు .
అది అంతే !
రాబొయ్యే రోజుల్లో మేఘ విస్ఫోటనాలు , మెరుపు వరదలు , హిమనీ సరస్సుల విస్ఫోటనలు.. ఎండ కాలం లో వడదెబ్బలు సర్వ సాధారణం అయిపోతాయి .
మనం చెయ్యగలిగిందల్లా సరైన చోట మన నివాస స్థలం ఏర్పరచుకోవడం .. మార్చ్ నుంచి ఆగష్టు నెలల్లో పర్వత ప్రాంతాలకు పోకపోవడం .. ఇంటినుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాతావరణ సూచికలను చెక్ చేసుకోవడం .
1,460003
🌹భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవుల కాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన...
**సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.
**కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.
**వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.
**శివలింగాలన్నీ ఒక్కచోటే...
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.
**ఒకేచోట త్రిమూర్తులు...
ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.
**పల్లవ గుహాలయాలు...
ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం...వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు, పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.
**కోనకు ఇలా వెళ్ళాలి...
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబ వరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది
1,150006
ఇప్పటి వరకు పండ్లను ఎండబెట్టి నిల్వ చేయడం లేదా జ్యూస్, జామ్, జెల్లీ వంటి ఉత్పత్తులు తయారు చేయడం సాధారణమే. అయితే పండ్లనే పిల్లలు ఇష్టపడే చాక్లెట్‌లాంటి ఆకారంలోకి మార్చడం ఈ పరిశోధనలోని వినూత్న అంశం. ముఖ్యంగా తాజా డీహైడ్రేట్ చేసిన పండ్ల ముక్కలను మాత్రమే ఉపయోగించడం, ఎలాంటి అడిటివ్స్ లేకపోవడం, చాక్లెట్‌లా సులభంగా తినగలిగే ఉత్పత్తిగా రూపొందించడం ఈ సాంకేతికత ప్రత్యేకతలుగా పేటెంట్‌లో వివరించారు.
ఈ ఆవిష్కరణల వల్ల పనస, సపోట అనాస, వంటి సీజనల్ పండ్లతో పాటు మార్కెట్‌లో పెద్దగా డిమాండ్ లేని లేదా తక్కువగా వినియోగించే పండ్లను కూడా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చవచ్చు. దీంతో పండ్ల వృథా తగ్గడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడితే స్థానిక ఉపాధి కూడా పెరుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు “క్లీన్ లేబుల్ ఫుడ్స”, “నేచురల్ స్నాక్స”, “షుగర్ ఫ్రీ ప్రత్యామ్నాయాలు” వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సమయంలో భారతీయ పండ్లతో, భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతకు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా అవకాశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ పరిశ్రమల స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే ఇది రైతు నుంచి వినియోగదారుడి వరకు విలువను సృష్టించే కొత్త ఫుడ్ చైన్‌గా మారవచ్చు.
ఆహార శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణలు ఎప్పుడూ అత్యంత సంక్లిష్టమైన ప్రయోగశాలల్లోనే పుట్టవు. కొన్నిసార్లు అవి ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతాయి.
“పిల్లలకు చాక్లెట్ ఇష్టం... కానీ అదే ఆనందాన్ని పండ్లతో ఇవ్వలేమా?”
ఈ ప్రయోగం విజయవంతమై విస్తృతంగా అందుబాటులోకి వస్తే, రేపటి పిల్లలు చాక్లెట్‌లా కనిపించే పండ్లను ఆస్వాదిస్తారు. రైతు పండించిన ప్రతి పండుకు కొత్త విలువ దొరుకుతుంది. ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం అనే భావనకు ఇది ఒక అరుదైన ఉదాహరణ. ( AndhraJyothi / 16. 8. 26 )
#healthyliving #chacolets #organicfoodforyou #researchmethods
#SVUniversity #Tirupati
1,200005
నేరేడు, పనస చాక్లెట్‌లు !
....................................................
ఇటీవలి సంవత్సరాల్లో పిల్లలు, యువతలో చాక్లెట్‌లపై అధిక మక్కువ పెరగడాన్ని శాస్త్రవేత్తలు ”చాకోహాలిజం అంటున్నారు. ఇది కేవలం తీపి తినాలనే కోరిక మాత్రమే కాదు; అధిక చక్కెర వినియోగం, పేగుల ఆరోగ్యం, జీవక్రియలపై ప్రభావం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అలవాటు. ఈ సమస్యకు ఆరోగ్యకరమైన పరిష్కారం చూపుతున్నారు ఒక సైంటిస్ట్
ఆయన కనిపెట్టిన Fruit Pops పూర్తిగా తాజా పండ్లతో తయారైన సహజ తీపి స్నాక్. చాక్లెట్ రుచిని కోరుకునే వారికి పండ్ల లోని పోషకాలను అందించాలనే ఉద్దేశంతో దీనిని అభివృద్ధి చేశారు. ఈ ఉత్పత్తిలో శుద్ధి చేసిన చక్కెర, కృత్రిమ రంగులు, కృత్రిమ ఫ్లేవర్లు లేదా రసాయన ప్రిజర్వేటివ్‌లకు చోటు ఇవ్వలేదు. పండ్లలో సహజంగా ఉండే తీపినే ఉపయోగించడం వల్ల ఇది సాధారణ చాక్లెట్ల కంటే ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ ఫ్రూట్ పాప్స్‌ను స్వతంత్ర ఫుడ్ సైంటిస్ట్ డా. చెన్నకేశవరెడ్డి, ఎస్వీయూ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సుచరిత గైడెన్స్ లో అభివృద్ధి చేశారు.
ఇటీవలి కాలంలో పిల్లల్లో చాక్లెట్లు, క్యాండీలు, అధిక చక్కెర కలిగిన స్నాక్స్ వినియోగం పెరుగుతుండటంతో ఊబకాయం, దంత సమస్యలు, జీవనశైలి సంబంధిత అనారోగ్యాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో సహజ పండ్ల ఆధారిత ప్రత్యామ్నాయాల అభివృద్ధి అవసరమని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.
........................................
‘ పిల్లలు ఇష్టపడే రుచి, ఆకర్షణీయమైన రూపంతో పాటు పోషక విలువలు కూడా అందేలా అనేక పరీక్షల తర్వాత ఈ ‘ఫ్రూట్-పాప్స’ తయారు చేశాం. పేరు వింటే ఇది ఫ్రూట్ ఫ్లేవర్ చాక్లెట్ అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఇది చాక్లెట్ కాదు. చాక్లెట్‌లో పండ్ల రుచి కలపడం కాదు. పండ్లనే చాక్లెట్‌లా కనిపించే, తినడానికి సులభమైన ఆకారంలోకి మార్చిన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి. ఇదే ఈ పరిశోధన ప్రత్యేకత. భవిష్యత్తులో ఇటువంటి ఉత్పత్తులు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే రైతులకు కూడా కొత్త మార్కెట్ ఏర్పడవచ్చు. పనస, నేరేడు ,మామిడి, జామ, బొప్పాయి, అనాస, అరటి వంటి స్థానిక పండ్లకు విలువ జోడించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. తద్వారా పండ్ల వృథాను తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.’ అని వివరించారు చెన్నకేశవరెడ్డి.
................................................
కడప జిల్లా అలంఖాన్‌పల్లి గ్రామానికి చెందిన డా.సంగటి చెన్న కేశవరెడ్డి ఆహార సాంకేతికత , పోషకాహార శాస్త్రం రంగాల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పరిశోధకుడు. ఫుడ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఫుడ్ సైన్స్, ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ అష్యూరెన్స్, ఉత్పత్తుల అభివృద్ధి వంటి విభాగాల్లో విశేష అనుభవం సంపాదించారు. ఇప్పటివరకు ఆయన నాలుగు భారతీయ పేటెంట్లు సాధించారు. వాటిలో రెండు నాగజెముడు పండ్ల విలువ ఆధారిత ఉత్పత్తులపై,మరొకటి ఇసుక కొరత సమస్యకు ప్రత్యామ్నాయం, ఇంకొకటి ఎడారి మొక్కల నుంచి ఇంధన ప్రత్యామ్నాయం తయారీ సాంకేతికతపై ఉన్నాయి.
........................................................
ఆయన ఆలోచన వెనుక మరో సామాజిక అవసరం కూడా ఉంది. భారతదేశంలో ప్రతి ఏడాది లక్షల టన్నుల సీజనల్ పండ్లు సరైన మార్కెట్ లేక, నిల్వ సౌకర్యాలు లేక, ప్రాసెసింగ్ అవకాశాలు లేక వృథా అవుతున్నాయి. రైతు ఎంతో కష్టపడి పండించిన పండు కొన్నిసార్లు చెట్టుకిందే రాలిపోతుంది. మరికొన్ని రవాణాలో పాడవుతాయి. ఒకవైపు రైతు నష్టపోతుంటే, మరోవైపు పిల్లలు పోషకాహారం కంటే ప్రాసెస్డ్ స్నాక్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే ఈ సాంకేతికత రూపుదిద్దుకుంది.
ఈ చాక్లెట్లను పూర్తిగా ఆహార శాస్త్ర సూత్రాల ఆధారంగా రూపొందించారు. ముందుగా సరైన పరిపక్వతలో ఉన్న పండ్లను ఎంపిక చేస్తారు. వాటిని శుభ్రపరిచి, ముక్కలుగా కట్ చేస్తారు. అనంతరం ప్రత్యేక ప్రీ-ట్రీట్‌మెంట్ చేసి, ఒక శాతం ఉప్పు ద్రావణంలో నానబెట్టి, 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 48 గంటల పాటు నియంత్రిత విధానంలో ఎండబెట్టి తేమ పూర్తిగా తొలగేలా చూస్తారు. తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన డైస్‌లో కంప్రెషన్ పద్ధతితో ఒత్తి చాక్లెట్‌లా ఆకారంలోకి తీసుకొచ్చి ప్యాక్ చేస్తారు.
ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే ఎలాంటి కృత్రిమ అడిటివ్స్, కృత్రిమ రంగులు లేదా అదనపు పదార్థాలు ఉపయోగించకుండా ఉత్పత్తిని తయారు చేయడం. ఈ ఫ్రూట్-పాప్స్ పూర్తిగా డీహైడ్రేట్ చేసిన పండ్ల ముక్కలతోనే తయారవుతాయి. ఇందులో కరిగే, సులభంగా జీర్ణమయ్యే పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అందువల్ల దీనిని కేవలం స్నాక్‌గా కాకుండా “న్యూట్రాస్యూటికల్ ఫుడ” (ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారం) గా తయారు చేశారు.
1,350000
ఈ ఆనకట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు నిజం తెలుసుకుందాం.

చిత్రంలో కనిపిస్తున్నది ఒడిశా (Odisha) రాష్ట్రంలోని సంబల్‌పూర్ వద్ద ఉన్న ప్రముఖ హీరాకుడ్ డ్యామ్ (Hirakud Dam).
​హీరాకుడ్ డ్యామ్ గురించి వివరాలు:
​ప్రపంచంలోనే అత్యంత పొడవైన మట్టి ఆనకట్ట:
హీరాకుడ్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్టలలో ఒకటి. దీని మొత్తం పొడవు సుమారు 25.8 కిలోమీటర్లు ఉండగా, ప్రధాన ఆనకట్ట పొడవు 4.8 కిలోమీటర్లు.
​నది:
ఈ డ్యామ్‌ను మహానది (Mahanadi River) పై నిర్మించారు.
​నిర్మాణ నేపథ్యం:
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి బహుళార్ధసాధక ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీని నిర్మాణాన్ని 1948లో ప్రారంభించి 1957లో అప్పటి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు.
​ముఖ్య ఉపయోగాలు:
​వరదల నివారణ: మహానది వలన వచ్చే వరదలను నియంత్రించడం.
​నీటిపారుదల: లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం.
​విద్యుత్ ఉత్పత్తి: జలవిద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం.
​చిత్రంలో వర్షాకాలంలో డ్యామ్ జలాశయం (Reservoir) నీటితో నిండి ప్రాజెక్టు గేట్లు తెరిచిన దృశ్యం డ్రోన్/ఏరియల్ వ్యూ (Aerial View) ద్వారా కనిపిస్తోంది.

#highlightseveryone #jawharlalnehru #dam #hirakuddam #orisa #mahanadiriver
2,900004

Showing 30 of 56 posts

రేటింగ్

లాగిన్ అవసరం

Frequently Asked Questions

తెలుగు పుస్తక ప్రపంచం టెలిగ్రామ్ ఛానల్ దేని గురించి?+

తెలుగు పుస్తక ప్రపంచం (@nagaveni_telugubooks) tgdio లో సినిమాలు (Movies) వర్గంలో జాబితా చేయబడిన టెలిగ్రామ్ ఛానల్. ర్యాంకింగ్, రేటింగ్, రివ్యూలు మరియు ఇటీవలి పోస్ట్‌లు చూసి సబ్‌స్క్రైబ్ చేసే ముందు నిర్ణయించండి. ప్రస్తుతం tgdio లో సుమారు 6,506 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

నేను తెలుగు పుస్తక ప్రపంచం (@nagaveni_telugubooks) ను టెలిగ్రామ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?+

tgdio లో ఛానల్ ప్రొఫైల్ తెరిచి, Join / Open in Telegram తో @nagaveni_telugubooks కు ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేయండి.

తెలుగు పుస్తక ప్రపంచం మంచి సినిమాలు (Movies) ఛానల్‌నా?+

tgdio లో జాయిన్ కావడానికి ముందు తెలుగు పుస్తక ప్రపంచం రేటింగ్, రివ్యూలు, ర్యాంకింగ్ మరియు పోస్ట్‌లు చూడండి. ప్రస్తుతం tgdio లో సుమారు 6,506 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇలాంటి సినిమాలు (Movies) ఛానల్‌లతో పోల్చండి.

తెలుగు పుస్తక ప్రపంచం స్టాట్స్ మరియు పోస్ట్‌లు ఎక్కడ చూడాలి?+

tgdio లో @nagaveni_telugubooks పేజీ తెరవండి — సబ్‌స్క్రైబర్ స్టాట్స్, ర్యాంకింగ్, రేటింగ్ మరియు పోస్ట్‌లు. Stats లింక్‌తో గ్రోత్ చార్ట్ చూడండి.