కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) Telegram channel photo

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

@kpdstrustPublic Channel

విరాళాలు పంపాల్సిన వివరాలు. A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ® A/C. No : 50200059599164 IFSC Code : HDFC0001753 Branch : HDFC Bank UPI ID : 7259859202@hdfcbank Gpay/Phone pay/BHIM/freecharge 7259859202

UPSC & SSCతెలుగుభారతదేశం

734

Last views

16k (16,018 subscribers)
సభ్యుడు
—
Rating
91
Total Posts
Oct 21, 2026, 7:19 PM
అప్‌డేట్ చేయబడింది
Apr 3, 2026
Created
Stats

మీరు తెలుగులో కంటెంట్‌ని చూస్తున్నారు. ఇతర భాషల్లోని కంటెంట్‌ని చూడటానికి సైట్ భాషను మార్చండి.

Channel Information

Channel Information
Channel Nameకంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)
Username@kpdstrust
CategoryUPSC & SSC
Languageతెలుగు
Countryభారతదేశం
సభ్యుడు16,018
Channel TypePublic Channel
Created3, ఏప్రి 2026
Last Updated21, అక్టో 2026 • 20 గంటల క్రితం
StatusActive

ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్
#292299+5807
భాష ర్యాంకింగ్
#150+6
కేటగిరీ ర్యాంకింగ్
#2471+61

సబ్‌స్క్రైబర్ వృద్ధి

మొత్తం: 16.0K30 Days growth: -1881.2%
09/2209/2710/0210/0710/1210/1710/21
సబ్‌స్క్రైబర్ వృద్ధి - 30 Days
DateSubscribers
22:09:202616,206
23:09:202616,206
24:09:202616,206
25:09:202616,206
26:09:202616,206
27:09:202616,206
28:09:202616,206
29:09:202616,206
30:09:202616,206
01:10:202616,206
02:10:202616,206
03:10:202616,206
04:10:202616,206
05:10:202616,206
06:10:202616,206
07:10:202616,206
08:10:202616,206
09:10:202616,206
10:10:202616,206
11:10:202616,206
12:10:202616,206
13:10:202616,048
14:10:202616,048
15:10:202616,048
16:10:202616,048
17:10:202616,048
18:10:202616,048
19:10:202616,048
20:10:202616,048
21:10:202616,018
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Weekly
DateSubscribers
Week of 30:03:202617,065
Week of 06:04:202617,021
Week of 13:04:202616,985
Week of 20:04:202616,985
Week of 27:04:202616,934
Week of 04:05:202616,934
Week of 11:05:202616,844
Week of 18:05:202616,844
Week of 25:05:202616,844
Week of 01:06:202616,726
Week of 08:06:202616,726
Week of 15:06:202616,726
Week of 22:06:202616,726
Week of 29:06:202616,599
Week of 06:07:202616,599
Week of 13:07:202616,497
Week of 20:07:202616,497
Week of 27:07:202616,497
Week of 03:08:202616,429
Week of 10:08:202616,429
Week of 17:08:202616,342
Week of 24:08:202616,299
Week of 31:08:202616,299
Week of 07:09:202616,249
Week of 14:09:202616,206
Week of 21:09:202616,206
Week of 28:09:202616,206
Week of 05:10:202616,206
Week of 12:10:202616,048
Week of 19:10:202616,018
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Monthly
DateSubscribers
April 202616,934
May 202616,844
June 202616,599
July 202616,497
August 202616,299
September 202616,206
October 202616,018
సబ్‌స్క్రైబర్ వృద్ధి - Yearly
DateSubscribers
202616,018

ఇటీవలి పోస్ట్‌లు

పదమూడు కాసుల బంగారం

పరమాచార్య స్వామివారు కంచి పొలిమేర్లలో ఉన్న శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశంనుండి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు.

తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నాననీ, అయితే వరుడు తరుపువారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చాననీ దీనంగా విన్నవించుకున్నాడు.

“స్వామీ! వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప, నా కుమార్తెకు మెళ్ళో మూడు ముళ్ళు పడే అవకాశం లేదు.” అని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు.

స్వామి వారు, ”నేను సన్యాసిని. నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది. నా ఎదుట విలపిస్తే ఏం లాభం? ఊళ్ళోకి పోయి, కామాక్షీ అమ్మ దగ్గర కూర్చొని, నీ గోడు చెప్పుకో! నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు అని అనారు.

“సరే అట్లాగే చేస్తాను” నంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకుని, కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి, ఆ దేవికి ఎదురుగా కూచుని ఆమెను ప్రార్థించాడు.

కొంతసేపయింది. ఉత్తరదేశం నుండి ఎవరో ఒక షావుకారు స్వామి వారిని దర్శించడానికి శివాస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించాడు. స్వామి వారు కుశల ప్రశ్నలు వేసారు.

స్వామి వారి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళబోయేముందు ఆ షావుకారు లోపలిజేబులో నుండి ఒక పొట్లం తీసి, శిష్యుడిచేత ఒక పళ్ళెం తెప్పించి, ఆ పొట్లం ఆ పళ్ళెంలో పెట్టి, స్వామికి సమర్పించాడు.

స్వామి వారు “ఏమిటా పొట్లం” అని అడిగారు. ”అందులో కాస్త బంగారం ఉంది. దానిని తమకు సమర్పించుకుంటున్నాను” అన్నాడు షావుకారు.

”సన్యాసిని నాకెందుకు ఆ బంగారం? నన్నేమి చేసుకోమంటావు?”

“స్వామీ మీకు సమర్పించాలని నాకెందుకో అనిపించింది. దానిని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి. మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే.”

“సరి పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది. సుఖంగా వెళ్ళిరా” అని దీవించి పంపారు.

షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి, కుమార్తె పెళ్ళి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడినుండి తిరిగి వచ్చాడు.

“స్వామీ తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను. ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి” అంటూ స్వామి ముందు కూలబడ్డాడు.

పక్కన బల్ల పైన ఉన్న పళ్ళెం చూపించి, స్వామి వారు ఇలా అన్నారు. ”ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉన్నది. ఆ పొట్లంలో ఏమున్నదో దాన్ని విప్పి చూడు.”

వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుదా పొట్లం విప్పి చూసాడు. ”ఏమున్నది ఆ పొట్లంలో” అని అడిగారు.

ఆ బ్రాహ్మణుడు భయంతో, సంభ్రమంతో “బంగారు కాసులున్నవి స్వామీ!” అని అన్నాడు.

”ఎన్ని ఉన్నవి? లెక్కపెట్టు.”

అతను లెక్కవేసి, “పదమూడు కాసులు” తడబడుతూ సమాధానం చెప్పాడు.

”నీవెన్ని కాసులు కావాలన్నావు?”

“పదమూడే స్వామీ!”

“సరే సరే, అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో”

ఆ బ్రాహ్మణుడు ఆనందభాష్పాలతో “అనుగ్రహం స్వామీ, పరమానుగ్రహం” అంటూ స్వామి పాదాలకు సాగిలబడ్డాడు.

--- టి కె త్యాగరాజన్

#KanchiParamacharyaVaibhavam #Paramacharya
734000
సన్యాసి సంకల్పం

ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్ర దేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. పరమాచార్య స్వామివారిని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్ధనానంద సరస్వతి అనబడే సన్యాసి ఒకరు ఈ పుణ్యదినాలలో మహాస్వామివారితో గడపాలని నిశ్చయించుకున్నారు. వారు పాదయాత్రగా విజయావాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది.

ఆ విజయవాడ స్వామి పాదయాత్ర మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి, పరమాచార్య స్వామివారు మఠంలో పనిచేస్తున్న శ్రీ ఏకాంబరం మరియు శ్రీ మెట్టూర్ రాజులను ఒక కారులో విజయవాడ వెళ్లవలసినదిగా ఆదేశించారు. అలాగే పూజ్యశ్రీ విజయవాడ స్వామివారిని కలిసి వారిని కారులో ఇక్కడికి తీసుకురావలసిందిగా చెప్పారు.

అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు. సన్యాసులు కారులో తిరగడం మహాస్వామివారు ఎన్నటికి ఒప్పుకోరు. అలా చెయ్యమని ఆదేశించరు కూడా. ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక.

ఆ విజయవాడ స్వామివారిని ఎలా కలుసుకోవాలో వీరికి తెలియదు. జనార్ధనానంద సరస్వతి స్వామివారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా సమాచారము లేదు. వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకసాగారు. చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు.

వచ్చినవారి నోటివెంట పరమాచార్య స్వామివారి ఆదేశాన్ని వినగానే విజయవాడ స్వామివారు అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో, సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఆ కైలాస వాసి పరమేశ్వరుడే అని వేనోళ్ళ కొనియాడారు.

మహాస్వామివారిని దర్శించాలనే కోరికతో ఆ ముందురోజు వరకూ కర్నూలు వైపు పాదయాత్ర చేశారు. హటాత్తుగా కాలినరం ముడిపడి ఇబ్బంది పెట్టడంతో శివపురంలో ఆగవవలసి వచ్చింది. చాలా ఆందోళన చెందిన స్వామివారు మహాస్వామి వారిని ఇలా కొనియాడారు. “ఈశ్వరా! కైలాసనాథుడవైన నీకు కనీసం ఒక ముసలి ఎద్దు అయినా వాహనంగా ఉంది. కానీ ఇప్పుడు కంచినాథుడుగా, పరమాచార్యులుగా వచ్చిన నీవు, ఉన్న ఆ ఎద్దును కూడా వదిలిపెట్టి మొత్తం దేశం అంతా పాదచారియై తిరగడానికి నిర్ణయించుకున్నావు”

వారు చికిత్స తీసుకుని పాదయాత్రగానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు తడుపారు చాతుర్మాస్యానికే చేరేవారు. విజయవాడ స్వామీ బాధను చూసి మహాస్వామివారే వారికి చేయూతనివ్వదలచి వారిని పిలుచుకుని రావడానికి కారుని పంపారు. వారు సాక్షాత్ శంకరావతారులు కాబట్టే ఇది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్ధనానంద సరస్వతి స్వామి.

కాలినెప్పితో బాధపడుతున్న స్వామివారు అతికష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు. కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామివారి దివ్యసన్నిధికి చేరుకున్నారు. చాతుర్మాస్య సంకల్పంతో పాటు వారి కాలి నరం బాధను కూడా మహాస్వామివారు కరుణతో తొలగించారు.

--- ‘ప్రదోషం మామ గృహం న్యూస్ లెటర్’ నుండి

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,040000
నన్ను కాపాడేవారెవరు?

ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటిని చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నో సార్లు ఆ బాధని భరించలేక నిద్రనుండి మేల్కొనేవాడు.

అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒక రోజు కేటాయించవలసి వచ్చింది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరగసాగింది.

అలా అడిగినవారికి అందరికి అతని చెవుల్లో వినబడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు.

“నన్ను కాపాడేవారెవరు?” అని భోరున విలపించాడు.

నా వద్దకు రా అన్నట్టుగా కనపడుతున్న మహాస్వామివారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదపద్మముల యందు శరణాగతిని వేడాడు. “నేనున్నాను. నావద్దకు రా” అని స్వామివారు భరోసా ఇచ్చినట్టు భావించాడు.

“పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కు లేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినబడుతున్నాయి. మొదట హనుమంతులవారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజం అయ్యాయి కూడా కాని మొత్తానికి నేను మనఃశాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తరభారతంలో ఉండడం ఇష్టం లేదు. నాకు ఎలాగైనా బదిలీ కావాలి. దయచేసి నాపైన మీ కరుణను ప్రసారించండి పెరియవ” అని వేడుకున్నాడు.

“ఇవన్ని నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు ఉన్నాయి కదా? మరి ఆంజనేయ స్వామికే ఎందుకు చెప్పుకోకూడదు?” అని స్వామివారు నవ్వుతూ అన్నారు.

అతను చాలా సిగ్గుపడ్డాడు. “పెరియవ నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామివారిది అని అనుకున్నాను. అది ఎ దయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమి మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవ రక్షించండి”

“ఎప్పుడూ రామ నామం జపిస్తూ ఉండు. కుంబకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడకు వెళ్లి కొన్నిరోజులపాటు ఉండు” అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు.

పదిరోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామికి సాష్టాంగం చేశాడు.

“ఏమిటి? ఆంజనేయస్వామి వారు రామ సేవకు వెళ్లిపోయారా?” అని కొంటెగా అడిగారు. గోవిందపురం వెళ్ళగానే తాని బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినబడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరమూ జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినబడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకి చేరి మనః శాంతిని పోగొట్టవు.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,200000
ఆశ్వీయుజ మాసం – ఆమ్ర ఫలం

పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముందు నేలపైన బుట్టలలో నానారకములైన పళ్ళు ఆన్నీ ఉన్నాయి. నాకు గుర్తున్నంతవరకూ అది పురట్టాసి (ఆశ్వీయుజ) మాసం.

ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్న గుంపు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. మహాస్వామి వారు ఆ పిల్లని పిలిచి “ఇక్కడున్న పళ్ళల్లో నుండి నీకు నచ్చిన ఒక పండు తీసుకో” అని అన్నారు. అక్కడున్న బుట్టల్లో పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష, జామ, కమలాలు ఉన్నాయి. కాని ఆ పిల్ల “నాకు మామిడీ పండు కావాలి” అని అడిగింది. అది మామిడి పళ్ళ కాలం కాదు. మామిడి చెట్లకు పిందెలు కూడా కాచే కాలం కాదు.

మహాస్వామి వారు ఆలోచనలో పడ్డారు. “వేదపురీ! మామిడి తాండ్ర ఏమైనా ఉన్నదేమో మెట్టూర్ స్వామి దగ్గర కనుక్కో” అని అన్నారు. తరువాత వారు ధ్యానంలోకి వెళ్ళారు.

రెండు నిముషాల తరువాత ఆంధ్రదేశం నుండి పండ్ల బుట్టి చేత పట్టుకొని ఇద్దరు భక్తులు వచ్చారు. ఆ పళ్ళెంలో రెండు పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి.

మహాస్వామి వారు కళ్ళు తెరిచారు. వారు ఆ చిన్నపిల్లని పిలిచి “వాటిని తీసుకో” అని చెప్పారు. ఆ పిల్ల ఆ పళ్ళనుండి ఒక మామిడి పండుని తీసుకొనింది. వేదపురి తిరిగి వచ్చి “మామిడి తాండ్ర కూడా లేదు” అని చెప్పి, ఆ పిల్ల చేతుల్లో ఉన్న మామిడి పండుని చూసి ఆశ్చర్యపోయారు.

“అరెరె! ఈకాలంలో మామిడి పండు ఎలా వచ్చింది?” అని మహాస్వామి అడిగారు. పొంగుకొస్తున్న భావోద్వేగంతో కళ్ళ నీరు కారుతుండగా వేదపురి మహాస్వామి వారితో “పెరియవ మామిడి పళ్ళ గురించి తలచుకున్నారు. అవి వచ్చాయి” అని అన్నారు.

పరమాచార్య స్వామి వారి శక్తి ఎంతటిదో మా కళ్ళారా చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. కాని తరువాత చూస్తే ఆ పళ్ళను ఆ తెలుగు వారు మాకు ఎక్కడా కనపడలేదు. బహుశా మా మాంస నేత్రాలకు కనపడని చోటికి వెళ్ళీపోయారెమో!!!

--- రాధా రామమూర్తి, పుదుకొట్టై - మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,400000
మహాస్వామి - మట్టి వైద్యం

ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. తమ అసలు స్వరూపం ఎంటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు.

“తేనంబాక్కం దేవాలయానికి వెళ్లి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా” అని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా, అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో, విభూది ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశ పడ్డాడు. దిగాలుగా తిరిగొచ్చి నిలబడ్డాడు.

“సరే! చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి గాని, కుంకుమ గాని తీసుకుని రా” అని చెప్పారు స్వామివారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కాని, ప్రకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు ఆరోజు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే, పరమాచార్య స్వామివారు మాకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది.

ఆ భక్తుడు మరలా తిరిగిరావడంతో, “సరే వదిలేయ్. వెళ్లి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకుని రా” అని ఆదేశించారు. అతను మట్టిని తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి.

శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని, మహిమాన్వితమైన వారి చేతివేళ్ళతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత దాన్ని బాలు మామకు ఇచ్చి, “వెళ్ళు. వెళ్లి దీన్ని అతనికి (రోగికి) ఇవ్వు” అని ఆదేశించారు.

స్వామివారి ఆదేశానుసారం బాలు మామ ఆసుపత్రికి బయలుదేరారు. కాని ఐసియులో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. కాని అక్కడకు చేరుకున్న తరువాత ఏ సమస్య లేకుండా లోపలకు వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్లి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే, ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే, అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలు మామ ఆలోచన. కాని అక్కడ జరిగింది వేరు.

బాలు మామ లోపలికి వెళ్ళగానే, కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. అ స్థితి చూస్తే అతనే లేచి “అది పరమాచార్య స్వామి ప్రసాదమా? దయచేసి ఇవ్వండి” అని అడుగుతాడేమో అనుకున్నారు బాలు మామ.

బాలు మామకు చాలా ఆశ్చర్యం వేసింది. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాల జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. మొత్తం జరిగిన విషయం మహాస్వామివారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, “సరే! మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చి రా” అని ఆదేశించారు.

స్వామివారి ఆజ్ఞానుసారం బాలు మామ మూడు రోజులపాటు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రాసాదం ఇచ్చారు. అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా, ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు.

--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,550000
రామనామం – విభూతి

ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకుని తను ఎక్కడనుండి వచ్చాడొ చెప్పాడు.

”మీ ఊళ్ళో ‘టుక్కిరి పాట్టి’ అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా” అని అడిగారు మహాస్వామివారు.

”ఆమె మాకు సంబంధీకురాలు” అని చెప్పాడు.

”రామ వినాయకుడు . . . ఇంకా ఉన్నాడా?”

“మా ఊరిలో ఉన్న దేవాలయలోని వినాయకుడు ‘రామ వినాయకుడు’ అని ప్రసిద్ధి” అని బదులిచ్చాడు. ఆ ముసలావిడ, వినాయకుని గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు. కాని ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు.

తరువాత మహాస్వామివారే ఆ కథనంతా ఇలా చెప్పారు.

”ఆ ఊళ్ళో శివాలయం కాని విష్ణ్వాలయం కాని లేవు. ఉన్నది ఒక్కటే ఆలయం అది వినాయకుని ఆలయం. రోజూ ఉదయం, సాయింత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరులో ఉన్న వాగులో స్నానాదికాలు చేసుకుని సంధ్యావందనం చేసేవారు. తిరిగివస్తూ దార్లో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని రామనామాన్ని జపం చెసేవారు. ఊళ్ళోనివారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు. వారి నామజపం ఎతటిది అంటే ఒక మైలుదూరం నుండి కూడా వారి నామసంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.

టుక్కిరి పాట్టి ఎవరంటే, ఏడేళ్ళ చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కాని విధివశాత్తు తొమ్మిదేళ్ళకే భర్త చనిపోవడంతో విధవరాలు అయ్యింది. ఆ ఊరివాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని ‘టుక్కిరి (నష్టజాతకురాలు)’ అని తన దురదృష్టాన్ని ఎత్తిచూపుతూ పిలిచేవారు.

ఆ అమ్మాయి పెద్దదైన తరువాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమిచేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వసువాసినులకు విధించిన పాతపద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటిముందు అలికి శుభ్రం చేసి, బయట ఒక దీపం వెలిగించి ఇంటిలోపలికి వెళ్ళిపొయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమిలేదు కేవలం రామ నామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు.

తిరువయ్యారు త్యాగరాజు ఇరవైఒక్క సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజూ లక్షా ఎనిమిదివేల సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్ర పడీన ఆ అమ్మాయి ‘టుక్కిరి పాట్టి (అవ్వ)’ అయ్యింది. ఆమె జపం లెక్కపెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపంచేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు.

ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం, వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కిరి పాట్టి వద్ద ఉన్నయేమో వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో, “కొంచం వాము కావాలి” అని అడిగాడు. పట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి “ఎందుకు, ఏమైంది నీకు?” అని అడిగింది.

“కడుపు నొప్పి. . . చాలా ఎక్కువగా ఉంది . .”

“ఉండు... ఇప్పుడే వస్తాను”

పాట్టి కొంచం విభూతి తీసుకువచ్చి ‘రామ నామం’ చెప్తూ, ఆ పిల్లవాడి నుదుటున పెట్టింది.

వాడు ఇంటికి పరిగెత్తాడు. ”నాకు కషాయం వద్దు”

“ఎందుకు?”

“కడుపునొప్పి పోయింది”

ఆ బాలుడి తల్లి విషయం అర్థంకాక తికమకపడి బాలుని నుదిటిపైనున్న విభూతిని చూసింది.

“పాట్టి పెట్టింది. వెంటనే నా కడుపునొప్పి పోయింది” అని చెప్పాడు.

మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. ‘టుక్కిరి పాట్టి’కి అంతటి సిద్ధి కలిగిందా?

అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటిచెప్పడానికే విధి ఆమె తలరాతని అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పనిలేదు. ఆయన స్థానాన్ని రామనామ పాట్టి తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే!!”

మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు.

--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,600000
కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ దబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

#KanchiParamacharyaVaibhavam #Paramacharya
1,430000
ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు

అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. కాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”
పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.
1,450000
జయ జయ శంకర !! హర హర శంకర !! స్వామినాథ బాల కథామృతం శ్రీ శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం పిల్లలకోసం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ప్రతీ రోజూ రాత్రి 9:00 గంటలకు zoom ద్వారా…
1,430000
నందనార్ పరంపర

పరమాచార్య స్వామివారు మకాంచేసిన ఒక ఊర్లోని గ్రామదేవత ఆలయం దర్శించుకొని తాముంటున్న బ్రాహ్మణ వీధిలోకి నడుచుకుంటూ వస్తున్నారు. వారితో పాటు ఏడెనిమిదిమంది పరిచారకులు శిష్యులు ఉన్నారు. దార్లో ఇరువైపులా రెండడుగుల గోడతో ఒక చిన్న కల్వర్టు ఉంది. ఒక గోడపై గుమ్మడికాయలు, శెనక్కాయలు, అనపకాయ మొదలైన చాలా కూరగాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు పెట్టి ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనపడని ఆ సంభారాలను ఇప్పుదు చూసి వారందరూ ఆశ్చర్యపొయారు. కాని జరగబోయే మరో పెద్ద ఆశ్చర్యం వారికి తెలియదు.

ఆ గోడ దగ్గరకు రాగానే మహాస్వామివారు ఆగారు. స్వామివారికి పదిహేను అడుగుల దూరంలో ఒక తక్కువ కులస్థుడు నిలబడి ఉన్నాడు. అతను అత్యంత భక్తితో చేతులు కట్టుకుని, స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కళ్ళతో జుర్రుకుంటూ వినయవిధేయతలతో నిలబడ్డాడు. బాలు మామ అతణ్ణి “తిరుక్కుళత్ తిరుత్తొండన్” అని పిలిచేవారు.

అతని కళ్ళనీరు పెల్లుబికి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామివారు ఉన్న చోట నిలబడకుండా, ఆత్మప్రదక్షిణ చేస్తున్నట్టుగా చాలా సార్లు అటువైపు ఇటువైపు తిరుగుతూ అక్కడున్నవారితో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. అవును చిన్నపిల్లాడిలా ఏమి సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు.

అలా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? ఎవరికి అర్థం కావడంలేదు. అతను వాటిని అక్కడ ఎందుకు ఉంచాడో అడగమని వారిని అడిగారు.

“నేను వాటిని ‘సామి’ కోసమే అక్కడ పెట్టాను. ఇవన్నీ మా తోటలో పండించినవి. ‘సామి’ గుడికి వెళ్ళడం నేను చూశాను. మళ్ళా ఇటే తిరిగొస్తారని తెలిసి, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తెచ్చాను. పాలో, పెరుగో అయితే ‘సామి’ తీసుకోరు కదా! ఇవైతే తీసుకుంటారని. తీసుకుంటారు కదా?” అని అన్నాడు.

వాటిని తీసుకోవాల్సిందిగా పరిచారకుణ్ణి ఆదేశించారు స్వామివారు. ఆటవికుడైన గుహుడు భక్తితో ఇచ్చినదాన్ని శ్రీరామచంద్రుడు ఆనందంతో స్వీకరించినట్టు. ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపినవాడు శ్రీరాముడు. ఇవన్నీ రేపు చంద్రమౌళీశ్వరునికి సమర్పించడానికి.

ఒక పదడుగులు ముందుకు వెళ్ళి స్వామివారు వెనక్కు తిరిగి చూశారు. అతను కళ్ళనీరు తుడుచుకుంటున్నాడు.

“నాకు సాష్టాంగం చేసినవారు నా వెనక్కు చూడగలరా?” అని అడిగారు.

”లేదు, చూడలేరు”

“మరి నా వెనుకకు చూడాలంటే ఏం చెయ్యాలి?”

“వారు పరమాచార్యకు ‘ప్రదక్షిణం’ చెయ్యాలి”

ఒక్క నిముషం అంతా నిశ్శబ్ధం.

”లేదా నేనే అతనిముందు ఆత్మప్రదక్షిణం చెయ్యాలి. అప్పుడు అతను నన్ను అన్నివైపులనుండి చూడగలడు. అవును కదా?” అని అన్నారు.

అందరూ నిశ్చేష్టులయిపోయారు. “ఓహ్! అదా సంగతి. కల్వర్టు దగ్గర చెసిన పనంతా ఇందుకోసమేనా? ఆత్మ-ప్రదక్షిణం. అవును కదా”

ఎవరి కోసం? ఏ శివభక్తుని కోసం ఈ దర్శనమంతా? అవును అతనికోసమే; ఆ నిజమైన భక్తునికోసమే. భక్తులకు ఆ కూరగాయలన్నీ శబరి రామునకిచ్చిన పళ్ళు. తెల్ల గుమ్మడికాయ ‘శివలింగము’. దానిపైనున్న బూడిద ‘విభూతి’.

అందరూ విడిదికి చేరుకున్నారు.

”అతను నందనార్ పరంపరకు చెందినవాడు” అని స్వామివారు లోపలికెళ్ళారు.

అక్కడున్నవారందరూ ఈ సంఘటనకు చాలా ఉద్వేగం చెందారు.

దేశాధినేతలకు కూడా లభించని ఇంతటి విశ్వరూప దర్శనం అతనికి లభించింది. మహాస్వామి వారి దృష్టిలో అతనే నిజమైన పరమేశ్వర భక్తుడు. మరి ఇక అంతకంటే అర్హత ఇంకేంకావాలి?

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 6

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,750000
జయ జయ శంకర !! హర హర శంకర !!

స్వామినాథ బాల కథామృతం

శ్రీ శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం పిల్లలకోసం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.

ప్రతీ రోజూ రాత్రి 9:00 గంటలకు zoom ద్వారా పరమాచార్య స్వామివారి కథలు, విశేషాలు, బోధలు, మన సంస్కృతీ సంప్రదాయల గురించి తెలుసుకుందాం

https://us05web.zoom.us/j/85395383532?pwd=sDbP0YSES4az0lWDBVHkOse1cu1Fu4.1

Zoom

Join our Cloud HD Video Meeting

Zoom is the leader in modern enterprise cloud communications.

1,620000
పరమాచార్య గొప్పదనం

1950-51 సంవత్సరాలలో, పరమాచార్య స్వామివారు కుంభకోణం మఠంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి స్వామివారు ఉపన్యసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా మైక్ కూడా లేదు. శ్రీమఠానికి చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారు ఉపన్యాసాంతర్గాతంగా ఒక శ్లోకంలోని ‘కర్మనాశ జలస్పర్శత్’ అన్న రెండు పదాలను పదే పదే చెబుతున్నారు కాని, పూర్తీ శ్లోకం చెప్పడంలేదు. నా అజ్ఞానం వల్ల స్వామివారికి మిగిలిన శ్లోకం తెలియదేమో అనుకున్నాను. నాకు ఆ శ్లోకం మొత్తం రావడంతో బాల్య చాపల్యం చేత, స్వామివారు ప్రసంగిస్తున్నా అత్యుత్సాహంతో గట్టిగా ఆ శ్లోకాన్ని చెప్పాను.

కర్మనాశ జలస్పర్శత్ కరదోయ విలంగనాత్
గండకీ బాహుదరనాత్ ధర్మఃక్షరతి కీర్తనాత్

మహాస్వామివారు తమ ఉపన్యాసాన్ని ఆపి, ఆ శ్లోకాన్ని మరలా చెప్పమని నన్ను ఆజ్ఞాపించారు. ఎవరినా ఉపన్యసిస్తున్నప్పుడు మధ్యలో భాగం కలిగిస్తే, వారికి కోపం రావడంతో పాటు ఆ ఇబ్బంది కలిగించినవాణ్ణి అధికప్రసంగి అని తిట్టుకోవడం సహజం. కాని పరమాచార్య స్వామివారు కరుణామూర్తి. శ్లోకం చెప్పమని స్వామివారు ఆదేశించిన వెంటనే నేను చెప్పడం మొదలుపెట్టాను కాని, సరిగ్గా గుర్తుకురాలేదు. అయినా “ఆ పిల్లవాడు చెప్పాడు చూడండి” అని స్వామివారు నన్ను ఆశీర్వదించారు. నాకు అవకాశం కల్పించడానికే స్వామివారు అ శ్లోకాన్ని మరచిపోయినట్టుగా నటించారు. దాంతోపాటు నా అజ్ఞానాన్ని కూడా బయటపడకుండా చేశారు. పరమాచార్య స్వామివారి కరుణ ఎటువంతిదని తెలిపే ఈ సంఘటన ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో ఎంతో తాజాగా ఉంది.

***************

ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని శివాస్థానంలో ఉన్నారు. వృక్షశాస్త్రంలో డాక్టరు డిగ్రీ పొందిన ఒక యువకుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. మహాస్వామివారు అతణ్ణి, “వెట్రిలై(తమలపాకు) కు ఆ పేరు రావడానికి గల కారణమేమి?” అని అడిగారు. తనకు తెలియదని చెప్పడంతో, స్వామివారే డానికి కారణం తెలిపారు, “అది ఒక లత. ఏ లత అయినా పువ్వులు పూచి, కాయలు కాస్తుంది. కొన్ని పాదులు కాయలు కాయకపోయినా పువ్వులు పూస్తుంది. కాని ఈ తమలపాకు లత పువ్వులు పూయదు, కాయలు కాయదు. కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి. ఈ తీగ కేవలం ఆకులతో ఉంటుంది కాబట్టి దీనికి వెట్రిలై(కేవలం ఆకు) అని పేరు”.

నిజంగా డాక్టరేటు ఇవ్వాల్సింది మహాస్వామివారికే అని అనుకున్నాడు ఆ యువకుడు.

***************

పరమాచార్య స్వామివారికి శిల్పశాస్త్రంలో అపారమైన జ్ఞానం. శిల్పులకు కూడా తెలియని ఎన్ని విషయాలను స్వామివారు తెలిపేవారు. ఆగమశాస్త్రంలో శిలలను మూడు రకాలుగా విభాజించారు: ఆడవి, మగవి, ఆడ మగ కానివి. కొన్ని శిల్పాలు కేవలం మగ శిలలతోనే చేయాలి, కొన్ని ఆడ శిలలతో, మరికొన్ని నపుంసక శిలలతోనే చెయ్యాలి. ఉలి దెబ్బ ద్వారా శిల యొక్క గుణాన్ని శిల్పులు తెలుసుకుంటారు. కాని పరమాచార్య స్వామివారు కేవలం ఆ శిలను చూసే, దాని గుణం తెలుసుకుంటారు.

దాంతోపాటు ఒక్కోసారి ఆ శిలల్లో కప్పలు ఉంటాయి. అటువంటి శిలలతో దైవప్రతిమలు చెయ్యరాదు. ఒకసారి స్వామివారి వద్దకు స్థపతి ఒకరు ఒక శిలను తెచ్చారు. స్వామివారు అందులో కప్ప ఉందని చెప్పారు. అందుకు ఆ శిల్పి పరీక్ష చేసి నిర్ధారించుకున్న తరువాతనే తాను ఈ శిలను తెచ్చానని వాదించాడు.
ఆ శిలను పగులగొట్టమని స్వామివారు ఆదేశించారు. ఆ శిలను బద్ధలుకొట్టగానే ఒక కప్ప ఎగురుకుంటూ బయటకు వచ్చింది. ఆ శిల్పి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ శిలలతో పనిచేసే శిల్పాచార్యులకు కూడా లేని శిల్పశాస్త్ర పాండిత్యం స్వామివారికి సొంతం.

--- యస్. పంచపకేశ శాస్త్రిగళ్, కుంభకోణం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,810000
జయ జయ శంకర !! హర హర శంకర !!

స్వామినాథ బాల కథామృతం

శ్రీ శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి ఆదేశానుసారం పిల్లలకోసం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.

ప్రతీ రోజూ రాత్రి 9:00 గంటలకు zoom ద్వారా పరమాచార్య స్వామివారి కథలు, విశేషాలు, బోధలు, మన సంస్కృతీ సంప్రదాయల గురించి తెలుసుకుందాం

https://us05web.zoom.us/j/85395383532?pwd=sDbP0YSES4az0lWDBVHkOse1cu1Fu4.1

Zoom

Join our Cloud HD Video Meeting

Zoom is the leader in modern enterprise cloud communications.

1,810000
మాతృభాషలోనే మాట్లాడాలి

మధ్య వయసు దంపతులు. నలుగురు పిల్లలు. వస్త్రధారణ, అలంకరణలో కొట్టొచ్చినట్టు కనబడుతున్న ఆధునికత, తోటలో ఒక క్రమ పద్ధతిలో కత్తిరించిన మొక్కల వలే మెడవరకు కత్తిరించి ఉన్న జుట్టుతో ఆడపిల్లలు. నాలుక కొనలపై నర్తిస్తున్న ఆంగ్ల భాష. ఆంగ్ల మాధ్యమ పాఠశాల చదువు.

ఆ పిల్లలని దగ్గరకు రమ్మని పిలిచారు పరమాచార్య స్వామివారు. ఇక సాధారణ ప్రశ్నలు మొదలయ్యాయి: “పేరేమిటి? ఎక్కడ చదువుతున్నారు?” మొదలైనవి.
ఆ పిల్లలు త్వరగానే స్వామివారికి అలవాటు అయ్యారు. భయంలేకుండా స్వామివారితో సన్నిహితంగా మెలుగుతూ వెంట వెంటనే సమాధానాలు ఇస్తున్నారు.

దగ్గరలో ఉన్న ఒక పళ్ళ బుట్టను చూపి, “ఎవరికీ ఏ పండు కావాలో అది తీసుకోవచ్చు” అన్నారు స్వామివారు.

ఆ పిల్లలు చాలా సంతోషపడ్డారు. “థ్యాంక్స్” అంటూ ఆ పళ్ళను తీసుకున్నారు పిల్లలు.

తరువాత స్వామివారు వారిని ఇలా అడిగారు. “మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను. పిల్లలు నా మాట వింటారు కదూ?”

అందరూ ఒక్కసారిగా, “ఓహ్ యెస్! సెర్తైన్లి వుయ్ విల్ డూ” (ఓ సరే! తప్పకుండా మేము చేస్తాము) అని బదులిచ్చారు.

“మీ పాఠశాలలో లేదా వేరే వ్యక్తులతో బయటి ప్రపంచంలో ఉన్నప్పుడు ఆగ్లంలో సంభాషించండి. ఇంట్లో, మీ అమ్మా నాన్న, స్వామి అయిన నేను, మరియు భగవంతుడు - వీళ్ళందరితో మీరు దయచేసి తమిళంలోనే మాట్లాడండి. తమిళం మీకు మాతృభాష (స్వామివారి మాతృభాష కన్నడ; మనకు తెలుగు). మీ అమ్మ మీకు తొలిదైవం. తమిళంలో మాట్లాడడం మీరు ఎన్నటికి మరువరాదు”.

వెంటనే ఆ పిల్లలందరూ తమిళంలో, “ఇక ఇప్పటినుండి అమ్మ, నాన్న, గురువు, దైవంతో తమిళంలోనే మాట్లాడుతాము” అని ఎప్పటిలాగే ఆంగ్లంలో “ప్రామిస్!” అంటూ స్వామివారికి బదులివ్వడం ముగించారు.

పరమాచార్య స్వామివారి ముఖంలో కోటిసూర్య ప్రకాశం. పెద్ద పెద్ద వేద పండితులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కనబడే దానికంటే వంద రెట్లు ఎక్కువగా!

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,950000
దవనం - దొంగ

పరమాచార్యస్వామి వారు ఎక్కడ బసచేసినా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు తరచుగా మహాస్వామి వారిని దర్శిస్తుంటారు. మహాస్వామి వారికి కూడా వారు తెలుసు. ఒక రోజు తరచుగా మహాస్వామి వారిని దర్శించే ఒక ముసలావిడ శ్రీమఠానికి వచ్చింది. తన వంతు రాగానే మహాస్వామి వారికి నమస్కారంచేసి వారిని దర్శించుకుంది. పరమాచార్యస్వామి వారు ఆ ముసలావిడని అశీర్వదించి, ఒక పళ్ళెంలో కొన్ని పళ్ళు ఉంచి ప్రసాదంగా తీసుకొమ్మన్నారు. ఆవిడ ఆ పళ్ళెంతీసుకుని పళ్ళుతీసుకుంటూ ఒక చిన్న దవనం తీగని చూసింది. ఆవిడ ఆ దవనాన్ని పక్కకి విసిరివేసి పళ్లను తీసుకోబోయింది.

మహాస్వామి వారు దీన్ని చూసి,”ఎందుకు ఆ దవనాన్ని పారవేసావు? అది నీకు ఉపయోగపడుతుంది తీసుకో” అని అన్నారు.

ఎందుకు మహాస్వామి వారు ఇలా అంటున్నారో అని ఆవిడ ఒక్క నిముషం ఆశ్చర్యపోయి మరు మాట్లాడకుండా వెంటనే ఆ దవనాన్ని తీసుకుని జాగ్రత్తగా తన వద్ద దాచుకుంది. దర్శనానంతరం ఆవిడ మఠాన్ని వదిలి తన ఊరు చేరుకోవడానికి బస్టాండుకు వెళ్ళింది. తను ఎక్కవలసిన బస్సు దొరకగానే ఎక్కి కూర్చుంది. అలా కూర్చోగానే ఆవిడకు కొద్దిగా నీరసంగా అనిపించి, నిద్రలోకి జారుకుంది.

ఈ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడ మంచిది కాదు. నిద్రపోతున్న ఆ ముసలావిడ సంచీ నుండి పర్సును దొంగిలించింది. కండక్టరు టికెట్టు ఇవ్వడం కోసం వచ్చినప్పుడు ఆ ముసలావిడ నిద్రలేచి డబ్బు ఇవ్వడంకోసం పర్సు వెతకగా అది కనిపించలేదు. పక్కన కూర్చున్న ఆవిడ చేతిలో తన పర్సు చూసి కోపంతో ఆ పర్సు నాది నువ్వు దొంగిలించావు అని గొడవపెట్టుకోసాగింది. కాని ఆవిడ ఆ ముసలావిడ్ని గదమాయిస్తూ ఆ పర్సు తనది అని అందులో ఎంత డబ్బు ఉందో కూడా సరిగ్గా చెప్పింది.

ఇప్పుడు కండక్టరు ఇబ్బందిలో పడ్డాడు. అది ఎవరి పర్సో తేల్చుకోలేకపోతున్నాడు. అకస్మాత్తుగా ముసలావిడకి ఏదో స్ఫురించినట్టు కండక్టరుతో “అందులో డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని అది ఏంటో ఆవిడని చెప్పమని” అడిగింది.

ముసలావిడ చెప్పిన మాటలు విని ఆ పర్సు దొంగిలించినావిడ నోట మాట రాక బేల మొహం వేసింది. అప్పుడు ముసలావిడ కండక్టరుతో అందులో చిన్న దవనం తీగ ఉన్నది అని కావాలంటే చూసుకొమ్మని చెప్పింది. కండక్టరు పర్సుతీసి చూడగా అందులో చిన్న దవనం ముక్క కనిపించింది. అప్పుడు ఆ పర్సు దొంగిలించినావిడ తన తప్పును ఒప్పుకుంది. ఆ ముసలావిడ ప్రార్థన మేరకు ఆవిడను క్షమించారు.

పరమాచార్య స్వామి వారు ఆ చిన్న దవనం ముక్కని పారవేయొద్దని ఎందుకు అన్నారో అప్పుడు అర్థం అయింది. మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించుకుని క్షేమంగా తన ఊరు చేరుకుంది.

#KanchiParamacharyaVaibhavam #Paramacharya
2,120000
పరమాచార్య స్వామివారు కూర్చున్న దేవాలయం మరియు రోడ్డును వేరుచేస్తూ ప్రవహిస్తున్న నీటిప్రవాహం ఉధృతమైంది. మేము చాలామందిమి రోడ్డు మీదనే ఉన్నాము. ప్రవాహం అటువైపునుండి ఆ చీకటిలో శ్రీకంఠన్ అరుపు వినబడింది. అక్కడున్న వారినందరినీ ముఖ్యంగా ఆడవారిని నా కారులో ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందిగా పరమాచార్య స్వామివారి ఆదేశం. అంత పెద్ద వర్షం పడుతుండగా, ఆ చీకట్లో ఘాటురోడ్డులో పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం క్షేమకరం కాకపోయినా, ఆజ్ఞ వచ్చినది నడిచే దేవుని నుండి కాబట్టి, ఇక ఏమి ఆలోచించకుండా పన్నెండుమందిని ఎక్కించుకుని, ఇతర వస్తువులతో పరమాచార్య స్వామి నామం చెప్పుకుంటూ కారులో వెళ్ళిపోయాను. సరిగ్గా ఇంటి గేటు ముందరకు రాగానే కారు ఆగిపోయింది.

మరుసటిరోజు ఉదయం కారు మెకానిక్ బానేట్ తెరవగానే, కార్బురేటర్ మొత్తం నీటితో నిండిపోయింది. అసలు కారు ఇక్కడిదాకా ఎలా వచ్చింది అని అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి కరుణను గుర్తు తెచ్చుకున్నాము.

ఆరోజు రాత్రి అందరమూ మునుపటి యతి మహాలయ ప్రసాదాన్ని స్వీకరించాము. స్వామివారి దృష్టి తగిలినందువల్ల అది సమృద్ధిగా ఉంది. దాదాపు ఎనభై మంది తిన్నా అది ఖాళీ అవ్వలేదు. ఇది నిజంగా అద్భుతమే!

--- సాంబ్ర కృష్ణమూర్తి. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Telegram

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

విరాళాలు పంపాల్సిన వివరాలు.A/C Name : Kanchi Paramacharya Dharmika Seva Trust ®A/C. No : 50200059599164IFSC Code : HDFC0001753Branch : HDFC BankUPI ID : 7259859202@hdfcbankGpay/Phone pay/BHIM/freecharge 7259859202

VIEW CHANNEL
1,980000
యతి మహాలయం

బెల్గాంలో 1979 చాతుర్మాస్యం ముగిసిన మరుసటి రోజు ద్వాదశి కావడంతో పారణకు, పరమాచార్య స్వామివారి భిక్షకు ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెల్లవారుఝాము నాలుగున్నర అప్పుడు మందిరంలో శ్రీ ఏకాంబరం పంచాగం చదివి చెబుతూ చివర్లో, “యతి మహాలయం” అని ముగించారు.

పదిన్నర సమయంలో శ్రీ రాజగోపాల్ (మెట్టూర్ స్వామిగళ్) ఇంటికి వచ్చి, యతి మహాలయ ద్వాదశి రోజు ఎక్కడో సంచరిస్తూ సిద్ధిపొందిన సన్యాసుల ఆరాధన చెయ్యడం చాలా ముఖ్యమని, ఈ సంవత్సరం ఈ ఇంట్లో జరగాలని, పరమాచార్య స్వామివారి ఆజ్ఞ మేరకు ఆరాధనని దార్వార్ శ్రీ బాలచంద్ర ఘనాపాటి, తిరువణ్ణామలై శ్రీ రాము వాధ్యర్ చేయిస్తారని తెలిపారు. దాదాపు ఎనభై మందికి భోజనం పెట్టాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని తెలిపారు. పరమాచార్య స్వామివారు తెలిపిన ప్రకారం, ఈ ఆరాధన సిద్ధి పొందిన సన్యాసులందరినీ ఉద్దేశించి చేసేది. ఇప్పటిదాకా ఆరాధన జరగనివారికి కూడా ఎందుకంటే ఇది “సన్యస్థ మహాలయం”. ఈ ఇంటిలోనే చెయ్యాలని మహాస్వామివారి కోరిక.

ఇది వినగానే మాకు ఆశ్చర్యము, ఆందోళన రెండూ కలిగాయి. బెల్గాం ఇక్కడకు పదిహేడు కిలోమీటర్ల దూరం కావడంతో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చెయ్యడానికి సమయం పడుతుంది. కాని, ఆరాధన పన్నెండున్నర కల్లా మొదలవ్వాలని ఆదేశం. ఫోను ద్వారా బెల్గాంలో ఉన్న స్నేహితులకు విషయం తెలియజేయడంతో, ఆరాధనకు కావాల్సిన సంభారాలతో సాంబ్ర చేరుకున్నారు. పరమాచార్య స్వామివారి ఆదేశం ప్రకారం ఉగార్ స్వామి సమక్షంలో ఆరాధన మొదలయ్యింది.

కోయంబత్తూరు నుండి ఒక పెద్ద మిల్లు యజమాని తన తల్లితో సహా స్వామి వారి దర్శనానికి వచ్చాడు. ఆమె వయస్సు రిత్యా కారునుండి కిందకు దిగలేకపోవడంతో పరమాచార్య స్వామివారే కారు వద్దకు వెళ్లి దర్శనం ఇచ్చారు. అతను తనవెంట తెచ్చిన ఆరు జతల ధోవతులు మహాస్వామి వారికివ్వగా, వాటిని బ్రాహ్మణులకిమ్మని ఇంటికి పంపారు స్వామివారు.

మూడు గంటల పదిహేను నిముషాలకు మొత్తం కార్యక్రమం అయిపొయింది. నలుగురు బ్రాహ్మణులు (ఒకరు ఆదిశంకర స్వరూపులు) భోజనాదులు కూడా ముగించారు. ఇప్పుడే ఒక మహాత్తరమైన సంఘటన జరిగింది.

మా కార్యాలయంలో పనిచేసే ఒకతను పరుగుపరుగున ఇంటికి వచ్చి, పరమాచార్య స్వామివారు ఇంటివైపు వస్తున్నారని తెలియజేశాడు. దర్భాసనం, గొడుగుతో బాలు, ఏకాంబరం ఇతరులు వెంటరాగా సరిగ్గా మూడున్నరకు పరమాచార్య స్వామివారు ద్వారం ముందర ఉన్నారు. మా కళ్ళను మేమే నమ్మలేకున్నాము.

ఎలాగో ఒక పూర్ణకుంభాన్ని త్వరగా సిద్ధం చేసి, వంటింటి బాధ్యత తీసుకున్న శ్రీకంఠన్ పరమాచార్య స్వామివారికి అందించాడు. పరమాచార్య స్వామివారు ఇంటిలోకి రాగానే, పూజగది ఎక్కడని అడిగి వెళ్లి కొద్దిసేపు కూర్చుని జపం చేశారు. వెంటనే ఆరాధన జరిగిన హాలులోకి వచ్చి, తీర్థ కుంభానికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. తరువాత వంటగదిలోనికి వెళ్లి, బ్రాహ్మణులకు సిద్ధం చేసిన వంటకాలను చూపమని శ్రీకంఠన్ ను అడిగారు. మరలా పూజగదిలోకి వెళ్లి, ఆరాధన కోసం వండిన వంటకాలను అన్నంతో సహా తీసుకునిరమ్మని శ్రీకంఠన్ ను ఆదేశించారు. ఎంతటి అద్భుతమైన సన్నివేశం!

సాయంత్రం అయిదు గంటలదాకా మహాస్వామివారు ఇంటిలోనే ఉన్నారు. శ్రీ ఉగార్ స్వామి ఉపన్యాసం విని, ఎయిర్పోర్ట్ దేవాలయానికి ప్రయాణమయ్యారు. వెళ్ళేటప్పుడు గొడుగు, దర్భాసనం, పీట, శాలువా పూజగదిలోనే వదిలేసారు. తరువాత వాటిని తిరిగివ్వాలని ప్రయత్నించినప్పుడు ఆ గృహస్థుడి ఇంటిలోనే ఉంచమని, ప్రతి సన్యాస మహాలయం రోజు ఒక వేద బ్రాహ్మణున్ని ఆదిశంకరులుగా భావించి, భోజనం పెట్టి తాంబూల దక్షిణలు సమర్పించి గౌరవించమని ఆదేశించారు. స్వామివారి అనుగ్రహం వల్ల ఇది ఇప్పటికి జరుగుతూనే ఉంది.

ఆరోజు రాత్రి స్వామివారు దత్తాత్రేయ ప్రతిష్ట కోసం సిద్ధం చేస్తున్న ఆలయంలో కూర్చుని, వచ్చిన భక్తులకు దతాత్రేయ అవతార ఉద్దేశ్యం వివరించారు. మేమందరం సాక్షాత్తు గురు దత్తాత్రేయులనే దర్శించుకున్నాము. నవరాత్రికి కూడా స్వామివారు ఇక్కడే ఉంటారన్న నిశ్చయానికి వచ్చేశాము.

కాని అనుకున్నవన్నీ జరగవు కదా! మరుసటిరోజు, 18 ఆగస్ట్ 1979న ఉదయం ఆరు గంటలప్పుడు స్వామివారు దేవాలయం నుండి బయలుదేరి తూర్పు వైపుగా ప్రయాణమయ్యారు. ఎప్పటిలాగే సేవకులందరూ పరుగుపరుగున స్వామివారిని అనుసరించి వెళ్ళిపోయారు.

మహాస్వామివారు ఘాట్ మార్గంగుండా పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి, కరడి గుడ్డి అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. అక్కడ చుట్టూ కొండల నడుమ, చిన్న నీటి ప్రవాహం వద్ద ఉన్న జంబు లింగ మందిర్ అను ఒక పాడుబడిన శివాలయంలో బస చేశారు. ఆరోజు ప్రదోషం కావడంతో, సాయంత్రం పూజ, అభిషేకము చేయాలని అనుకున్నారు.

బాలు మరియు ఇతరులు అభిషేకం చేస్తుండగా, మహాస్వామివారు గట్టిగా రుద్రం చదవడం మేము విన్నాము. చూస్తోంటే చాకాలం పాటు ఆ ఆలయంలో అభిషేకము, పూజ జరిగినట్టు లేదు. దాని తరువాతనే ఈ అద్భుతం జరిగింది. ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి, ఎటువంటి వర్ష సూచన లేదు. కాని అభిషేకం ముగిసిన వెంటనే, ఆకాశం మొత్తం మేఘావృతమై వర్షం మొదలైంది.
1,880000
జయ జయ శంకర !! హర హర శంకర !!

2026 జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మనం ట్రస్ట్ తరుపున పూర్తిచేసిన కార్యక్రమాల వివరాలు.

* హైదరాబాదులో ఉన్న అభీష్టం గోశాలలోని గోవులకు గోగ్రాసం మరియు పౌష్టిక ఆహారం కొనుగోలు.

* కల్పతరు గోశాల, అద్వైత గోశాలల నిర్వహణ, పనివారి జీతాలు, ఎండు గడ్డి కొనుగోలు.

* వారణాసి క్షేత్రంలో సాధు సంతులకు నిత్య నారాయణ సేవ.

* పరమాచార్య స్వామివారి జన్మ నక్షత్రం నాడు అనుషం మాస వేద పారాయణ.

* విశాఖపట్నంలో ఉన్న సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వారి వేదపాఠశాలకు విరాళం.

* అధిక జ్యేష్ఠ మాసం సందర్బంగా ట్రస్ట్ సభ్యుల తరుపున రెండు గోదానాలు, తొమ్మిది సాలగ్రామాలు దానం.

* చాతుర్మాస్యం సందర్బంగా కంచి కామకోటి పీఠంలో 60 రోజులపాటు ప్రతిరోజూ ట్రస్ట్ తరుపున భిక్షావందనం.

* హైదరాబాదులోని సాకేత్ కాలనీలో ఉన్న క్షిప్ర గణపతి దేవాలయ ప్రాంగణంలో ఏడురోజుల పాటు ప్రవచన విరించి, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారి "ఆనందసాగర స్తవము - మీనాక్షీ వైభవము" ప్రవచనం ఏర్పాటు.

విరాళాలు పంపదలచినవారు Google Pay / Phone Pay / BHIM / Paytm ద్వారా UPI ID : 7259859202@hdfcbank ఉపయోగించి చెయ్యవచ్చు.

ట్రస్టు బ్యాంకు అకౌంటు వివరాలు

A/C Name: Kanchi Paramacharya Dharmika Seva Trust
A/C. Num: 50200059599164
IFSC Code: HDFC0001753
A/C Branch: Kanakapura Road, Bengaluru

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2,120000
రష్యన్ - రిషి

చాలా సంవత్సరాల క్రితం చెన్నైకి వచ్చిన రష్యా మరియు అమెరికా విశ్వవిద్యాలయ ఆచార్యులు పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నారు.

1987లో సోవియట్ యునియన్ లో భారతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి కొన్ని విశ్లేషణాత్మక పేపర్స్ తయారు చేసి మహాస్వామి వారికి చూపించడం నాకు అలవాటు. మహాస్వామివారు అనుగ్రహించిన అటువంటి ఒక పేపర్ తో మేము రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మరియు మాస్కోలోని ఓరియంటల్ స్టడీస్ ఇన్ స్టిట్యూట్ అధ్యక్షుడు రిబెకొవ్ కు అందచేయాలని వెళ్ళాము.

ఆయన గదిలో ఉన్న ఒకేఒక చిత్రపటం కంచి పరమాచార్య స్వామివారిది. అతను ఇంతవరకు మహాస్వామి వారిని ఎప్పుడూ కలవలేదు. ఆయన మాతో “నేను ఎప్పుడైనా చెన్నై వస్తే ఒకటి నేను మహాస్వామి వారిని కలవాలి, రెండు ఒక వలంపురి శంఖు సంపాదించాలి” అని అన్నారు.

కొన్నేళ్ళ తరువాత రిబెకొవ్ చెన్నై వచ్చారు. వారు మహాస్వామి దర్శనం కోసం నాతో పాటు శ్రీమఠానికి వచ్చారు. మేము మఠంలోకి వెళ్ళగానే ఈ రోజు మహాస్వామి వారి దర్శనం లేదు. వారికి జ్వరంగా ఉంది అని అన్నారు. నాతో వచ్చిన రిబెకొవ్ మహాస్వామి వారిని అడగాలని కొన్ని ప్రశ్నలు వ్రాసుకుని వచ్చారు. మహాస్వామి వారి దర్శనం దొరకదు అని మేము చాల నిరాశపడి వెనుతిరుగుతుంటే శిష్యులు మమ్మల్ని వెనుకకు పిలిచి “మహాస్వామి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని అన్నారు. భక్తుల సందడి లేని ఏకాంత దర్శనం మాకు లభించినందుకు మాకు చాలా సంతోషం వేసింది.

మేము లోపలికి వెళ్ళగానే పడుకున్న మహాస్వామి వారు లేచి కూర్చుని నాతో పాటు వచ్చిన అతని ముఖంలోకి కొద్దిసేపు చూసారు. కొంత సమయం తరువాత అతను ఆనంద భాష్పాలు కారుస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. చాలా సేపు నిశ్శబ్దంగానే ఉండిపోయాము. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారు నాతో “అతను ఏం అడగాలనుకుంటున్నాడో అడగమను” అని ఆన్నారు.

అందుకు రిబెకొవ్ “నా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి” అని అతను ఇక ఏమి మాట్లాడదలుచుకోలేదు. మహాస్వామి వారు అతన్ని ఉద్దేశించి “మీ రష్యా భాషలో సంస్కృతము యొక్క ఆనవాళ్ళు చాలా కనిపిస్తాయి. అందులోను ఉత్తర రష్యాలో మట్లాడే మాండలికంలో సంస్కృత శబ్ధములు ఎక్కువగా ఉపయోగిస్తారు“ అని అన్నారు.

అందుకు రిబెకొవ్ “నిజమా? అది ఎలా?” అని అడిగాడు.

మహాస్వామి వారు “మీ దేశానికి రిషివర్శం అనే పేరు కూడా కలదు. ఎందుకంటే యాజ్ఞావల్క్యుడు మొదలైన ఋషులు అక్కడే ఒక వేద పరిశోధనా కేంద్రమునును స్థాపించారు“ అని అన్నారు. మహాస్వామి వారు మాకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు. వారు చెప్పిన విషయాలను విని మేము ఆశ్చర్యపోయాము. మేము వారితో సెలవు తీసుకుంటూ రిబెకొవ్, మహాస్వామి వారితో “నేను హిందువు కావాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.

”నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు హిందువువే” అని అన్నారు.

”అయినా సంతృప్తిగా లేదు. నాకు ఒక హిందూ పేరు ఉంటే బావుండును” అని రిబెకొవ్ అన్నాడు.

స్వామి వారు నవ్వుతూ నావైపు చూసి “ఇతను తెల్లని గడ్డముతో ఋషి లాగా కనిపిస్తున్నాడు కనుక ఇతని పేరు రిషి” అని అన్నారు. రిబెకొవ్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ రిషి (రిబెకొవ్) మాస్కోలో రామకృష్ణ మఠం యొక్క శాఖను స్థాపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/KPDSTrust

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2,120000
ధర్మము – ధర్మాచరణము

నాకు గుర్తున్నంతవరకు అది 1965వ సంవత్సరం. పరమాచార్య స్వామివారు తిరుపతిలో మకాం చేస్తున్నారు. స్వామివారు వేంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం చేయించారు(600/- టికెట్టు). కళ్యాణోత్సవం తరువాత దేవస్థానం వారు ప్రసాదాలను ఇచ్చారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. వీరిని మామూలు క్యూలైన్లలో కాకుండా వేరేగా స్వామి దర్శనానికి పంపిస్తారు. ఆలయ పేష్కారు స్వామివారిపై ఉన్న అపరిమిత భక్తి వల్ల పరమాచార్య స్వామివారితో ఉన్న మా అందరిని శ్రీనివాసుని దర్శనానికి రమ్మని పిలిచాడు. మేము దాదాపు ఒక పదిహేను మందిమి దాకా ఉన్నాము.

అప్పుడు పేష్కారుతో మహాస్వామివారు, “కళ్యాణోత్సవం చేయిస్తే ఎంతమందిని దర్శనానికి అనుమతిస్తారు?” అడిగారు.

”ఆరు మందిని” అని పేష్కారు బదులిచ్చాడు.

”అలా అయితే మేము ఆరుమందిమి మాత్రమే ఈ విశేష దర్శనానికి వస్తాము. నేను, పుదు పెరియావ(జయేంద్ర సరస్వతి స్వామి), మరో నలుగురు” అని చెప్పారు.

వెంటనే పేష్కారు ”అందరమూ వెళ్ళవచ్చు. . . ఏమి పరవాలేదు” అని అన్నాడు.

”అది తప్పు అధర్మం. దేవస్థానం ఒక నియమం చేసింది. కల్యాణోత్సవం టికెట్టుపై ఆరుమందికి విశేష దర్శనం అని. నీవు దేవస్థానం చిప్పంతివి(ఉద్యోగివి). నీకు నాపైన ఉన్న భక్తివల్ల పదిహేనుమందిని దర్శనానికి పంపించడం సరికాదు. దీని వల్ల రెండు తప్పులు జరుగుతాయి. దేవస్థానం తీసుకున్న నిర్ణయాలను ఒక దేవస్థానం ఉద్యోగియే ధిక్కరించడం. అంటే నిబంధనలను పెట్టినవారే వాటిని పాటించకపోతే ఇక ఇటువంటి నిబంధనలు ఎందుకు? మరొకటి నియమాలను అతిక్రమించడానికి నేనే ఒక అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి మేము ఆరుగురు మాత్రమే వస్తాము” అని చెప్పారు.

పేష్కారు ఏదో చెప్పబోతుండగా, మహాస్వామివారు మధ్యలోనే ”ధర్మం కేవలం ప్రచారం చెయ్యడానికి మాత్రమే కాదు. స్వయంగా దాన్ని తప్పక అనుష్టానించి చూపాలి”.

”రామో విగ్రహవాన్ ధర్మః - మూర్తీభవించిన ధర్మమే రాముడు” అన్నట్లు ఈ సంఘటనను నా కళ్ళారా చూడడం చేత పరమాచార్య స్వామివారు సాక్షాత్ రెండవ రాముడై “ఈ యుగానికి రాముడు” అని అర్థమైంది.

[చదివినది విన్నది ధర్మం కాదు ఆచరించినదే ధర్మం. మొత్తం వేద వాంగ్మయ సారమంతా రెండే మాటలు. “సత్యం వద - ధర్మం చర”. “సత్యం పలుకు - ధర్మం పాటించు”. మరి ఏది సత్యం? ఏది ధర్మం? వేదం సత్యం. వేదం చెప్పినది ధర్మం. వేదప్రామాణమే సత్యం. అపౌరుషేయమైన వేదమే ప్రామాణం]

--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,690000
అనంతమైన అనుభవాలు

కేరళ నుండి ఒక జ్యోతిష్కుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఆరోజు స్వామివారు కాష్టమౌనంలో వున్నారు. ఆ జ్యోతిష్కునితో ఏమీ మాట్లాడలేదు కానీ, చిరునవ్వుతో ఒక పండును అతనికి అనుగ్రహించారు.

జ్యోతిష్కుడు బయటకు వచ్చాడు. శ్రీమఠం సిబ్బంది అతణ్ణి చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉండడం సహజం కదా? ఆ సమస్యలు ఎప్పుడు అంతం అవుతాయో అని తెలుసుకోవడం అందరికీ ఇష్టమే కదా.

వెంటనే ఆ జ్యోతిష్కుడు, “ఇక్కడ నేను జోస్యం చెప్పలేను. ఇక్కడ, ఈ స్థలంలో పరమాచార్య స్వామి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంటుంది. స్వామివారు ఉన్న చోటునుండి మూడువందల అడుగుల లోపల ఏ గ్రహమూ మాట్లాడాదు; ఏ దేవతా బదులివ్వదు. మీరు నేను బస చేస్తున్న చోటుకు రండి; మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను” అని చెప్పారు.

ఒక్క దర్శనంతోనే ఆ జ్యోతిష్కుడు స్వామివారిని అర్థం చేసుకున్నాడు.

**************

ఒక భక్తుడు కాశీ క్షేత్రంలో రుద్రైకాదశి జప హోమం చేసి, అక్కడి నుండి గంగాజలం తీసుకునివచ్చి పరమాచార్య స్వామివారికి సమర్పించాడు.

“నీవు రుద్రైకాదశి కోసం ఎక్కడి నుండి గంగాజలాన్ని సేకరించావు?” అని అడిగారు స్వామివారు.

“వైదికులు ఆ జలాన్ని కాశీలోని కేదార్ ఘాట్ గంగా నుండి తీసుకునివచ్చారు”.

“కాశీ పరమేశ్వరుని సొంతం. గంగ నీరు, గంగ మన్ను వంటివి అక్కడినుండి తీసుకునిరాకూడదు. నువ్వు అక్కడినుండి తెచ్చిన తీర్థాన్ని ఏదైనా బిల్వ చెట్టు మొదట్లో వెయ్యి” అని ఆదేశించారు స్వామివారు.

“గంగ ఎక్కడైతే శుద్ధ గంగగా ఉంటుందో అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకునిరావాలి. యమునా నది తనలో కలవడానికి ముందు ఉన్నదే శుద్ధ గంగ” అని చెప్పారు స్వామివారు.

************

పరమాచార్య స్వామివారు విడిదిచేసిన ఆ పల్లెటూరిలో కొన్ని గుడిసెలు వున్నాయి. సాయంత్రం పూట ఆ పిల్లలందరూ ఎందరో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో అల్లరితో ఒకర్నొకరు కొట్టుకుంటూ, పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు. (అటువంటి సందర్భంలో తాము కూడా ఆ పిల్లలతో పాటు చేరిపోయి ఆడుకోవాలన్న భావం స్వామివారి కళ్ళల్లో కనిపిస్తుంది)

అలా ఆ పిల్లల ఆటలను, అల్లరిని చూస్తున్న స్వామివారి దగ్గరికి ఒకామె గిన్నె నిండుగా పాలకోవా తీసుకునివచ్చి, స్వామివారి ముందర ఉంచి, పంచాంగ నమస్కారం చేసింది.

“ఏమిటిది? పాలను మరిగించి తీసుకునివచ్చావా?” అని అడిగారు.

“అవును”

“తియ్యగా ఉంటుందా?”

“అవును ఉంటుంది”

“వాసన?”

ఆమె బదులు చెప్పేలోగానే, స్వామివారే బదులిచ్చారు. “అవును, అది ముక్కుపుటాలను చీల్చుకుని వెళ్తోంది”

“నేను చాలా మడితో తయారుచేశాను. పుల్లగా అవ్వదు. నాలుగు రోజుల దాకా పాడవ్వడు. రోజూ, స్వామివారు కొంచం, కొంచంగా . . .”

స్వామివారు ఆమె మాటలను ఏమాత్రం వింటునట్టులేదు. కానీ ఎంతో కుతూహలంతో, “నువ్వు ఏమి చేస్తావంటే, అక్కడ ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు ఈ గిన్నె తీసుకునివెళ్లి, అంతా వారికి పంచి ఖాళీ గిన్నెను తీసుకునిరా, సరేనా? నాకోసం ఇంకోసారి తయారుచేసుకుని తీసుకునిరా . . .”

క్షీర సాగర శయనుడు మొహిని దేవి రూపంలో అమృతాన్ని పంచినట్టు, ఆమె ఆ పాలకోవాను పరిపూర్ణ తృప్తితో పిల్లలకు ఇచ్చింది. అ పిల్లలు ఆ పాలకోవా తినదన్ చూసి స్వామివారు ఆనందించారు.

*******

పరమాచార్య స్వామివారి ఆగమనాన్ని ప్రతి చిన్న ప్రాణి కూడా ఆనందించింది. శివాస్థానంలో ఎవరూ స్వామివారి గదిలోకి వెళ్ళేవారు కాదు. తమ పనులను స్వామివారే స్వయంగా చేసుకునేవారు.

సేవకులు స్వామివారి గది బయట చిన్న చెక్క పాత్రల్లో నీరు ఉంచేవారు. కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి మరియు అనుష్టానానికి వాటికవే ప్రత్యేకంగా ఉంచేవారు. ఎండాకాలంలో ఎలుకలు, ఉడుతలు మరియు పక్షులు నీతి కోసం అంతా తిరిగి తిరిగి వెతికేవి.

శిష్యులు, భక్తులు ఎవ్వరూ కూడా స్వామివారి గదిలోకి వెళ్లలేకపోయినా, ఈ జంతువులకి అలాంటి అడ్డంకి ఏం లేదు. పూర్తి స్వాతంత్ర్యంతో లోపలకు వెళ్ళి, ఆ చక్క పాత్రలపైకి ఎక్కి, లోపలకు తొంగిచూసి, దాహం తీరేదాకా నీరు త్రాగి పారిపోయేవి.

అవి వచ్చి నీరుతాగి వెళ్లిపోవడాన్ని గమనిస్తూ ఆనందించేవారు స్వామివారు. మనకు అవి ఎలుక, ఉడుత, పిచ్చుక లాగా కనిపిస్తాయి, కానీ స్వామివారికి అవి గణపతి, రామపిరన్, నారాయణుడుగా కనిపిస్తాయేమో.

--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,970000
తేవార పారాయణం

కాంచీపురంలోని పిళ్లైయార్ పాళ్యంలోని తిరుమెట్రలై వీధిలో నివసించే శ్రీ కె. నటరాజ ఓదువర్ గారికి ఇప్పుడు(2003) డెబ్బైఎనిమిది సంవత్సరాలు. పరమాచార్య స్వామివారిపై అపారమైన భక్తి. వారు చెప్పిన విషయం:

పరమాచార్య స్వామివారు పల్లకీలో వెళ్తున్నప్పుడు, నేను ఎన్నోమార్లు తేవారం పత్తికాలు పాడేవాడిని. ఒకసారి స్వామివారు తిరుజ్ఞానసంబంధర్ కచ్చి మెట్రళై, పిళ్లైయార్ పాళ్యంలో సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చారు. నేను ‘తిరుమెట్రళై తేవారం’ పాడాను. వెంటనే స్వామివారు, “నువ్వు తిరుముదుకుండ్రప్ పత్తికం పాడు” అని ఆదేశించారు. ‘దేవా, సిరియోమ్ పిళైప్ పొరుప్పే, పెరియోణే’ (దేవా, నా తప్పులను సహించు, నేను చిన్నవాణ్ని) అన్న మాటలతో మొదలయ్యే జ్ఞాసంబంధర్ తేవారం పాడాను. ‘తిరుఏకాంబమ్ పత్తికం’ పాడమని స్వామివారి తరువాతి ఆజ్ఞ. ‘పణ్డు సెయ్ ద పళవినయిన్ పయన్’ (గత కాలంలో చేసిన కర్మ ఫలం) అని మొదలయ్యే అప్పర్ తేవారం పాడడం మొదలుపెట్టాను. మహాస్వామి వారు ఎంతో సంతోషించి నన్ను ఆశీర్వదించారు.

మహాస్వామి వారు సతారాలో మకాం చేస్తున్నప్పుడు, మేము మువ్వూరు ఒదువర్లమూ తీర్థయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లాము. మమ్మల్ని చూడగానే స్వామివారు చాలా ఆనందపడ్డారు. మమ్మల్ని రెండు రోజులపాటు అక్కడే ఉండి, రోజూ పూజలో తేవారం పాడమని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం మేము మువ్వురమూ శ్రీమఠంలోనే ఉండి తేవారం పాడేవారం. స్వామివారి నుండి సెలవు తీసుకునేటప్పుడు మమ్మల్ని అనుగ్రహించి మాకు ధోవతులను బహూకరించారు. రైల్వేస్టేషనుకు వ్యాను కూడా ఏర్పాటు చెయ్యడం స్వామివారి అవ్యాజ కరుణకు పరాకాష్ట. అది మమ్మల్ని కదిలించివేసింది.

కాంచీపురం బంగారు తోటలో ఉన్న పెరియవా మఠంలో ప్రతి నెలా జరిగే అనుషం విశేష పూజలో ఉదయం పది గంటలప్పుడు నేను తేవారం పారాయణం చేస్తున్నా, రాత్రివేళల్లో పుష్పాపల్లకిలో స్వామివారి చిత్రపటం ఊరెరిగింపుగా జరుగుతున్నప్పుడు కూడా తేవార పారాయణం చేస్తున్నానంటే దానికి కారణం పరమాచార్య స్వామివారి అనంతమైన కరుణ మాత్రమే.

--- కె. నటరాజ ఓదువర్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,880000
శ్రీవారి అతీంద్రియ శక్తి :

ఒకసారి స్వామివారిని హైదరాబాదులో దర్శనం చేసాను. మా నాన్నగారు రామాయణంలో విశ్వామిత్రుడు రామునితో అన్న "రామ! జగన్మోహనా!" అనే పద్యం స్నానం చేసేటప్పుడు, ఖాళీ సమయాల్లో కుర్చున్నపుడు ఎల్లప్పుడూ ఎంతో ఆర్తితో చదువుకొంటూ ఉండేవారు. శ్రీవారు ఆ పద్యాన్ని అదే స్వరంతో అంతే ఆర్తితో చదివి "మీ నాన్నగారెప్పుడూ ఈ పద్యాన్ని చదువుతూ ఉండేవారు కదా?" అని ప్రశ్నించారు. నేను నివ్వెర పడినాను. మా నాన్నగారిని వారెరుగరు. వారుగతించి చాలాకాలమయింది. మరి ఆ పద్యాన్ని ఎల్లప్పుడూ అంత ఆర్తితో చదువుతూ వుండే వారన్న విషయం వీరికేలా తెలిసింది. దాంతో నా వొళ్ళు గగుర్పొడిచింది. ఆరోజు తెనుగు చదవడం తెలుసునా అని పృచ్చించిన నా అజ్ఞానత్వానికి సూటి సమాధానం ఇది.

ఈ కాలంలో కొద్దో గొప్పో శక్తి సంపాదించిన వారంతా దుకాణాలు పెట్టుకుంటున్నారు. ఆశ్రామలు, హాస్పటల్స్ అంటూ పెంచుకు పోతున్నారు. మహా శక్తీ సంపన్నులయిన స్వామివారు మాత్రం ఏమి తెలియని వారివలె వున్నారు. ఆయన లక్షణంగా సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ కాలుమీదకాలేసి కూర్చుని మహారాజులా అనుభవించవచ్చు. వీరు "ఊ" అంటే ధనరాసుల్ని పోగులుగా కుమ్మరించే వారు అనేకులు వున్నారు. అయినా ఆయన ఈ సుఖాలన్నీ కాలదన్నుకొని రోజూ పది క్రోసులో, ఇరవై క్రోసులో ఈ లేవలేని రోజుల్లో ముసలితనంలో నడుస్తూనే వున్నారు.

అది యోగమో, సౌఖ్యమో, ధ్యానమో, మరి ఏ ఇతరమో తెలియదు కానీ ఒక అపూర్వమయిన శక్తి వారివద్దనున్నదని చెప్పుకోవాలి. ఆ శక్తి ఎటువంటిది, ఎక్కడిది అంటే మనమేమి చెప్పగలం? అయితే శక్తికి, శక్తిమంతులకు అభేదం కనుక ఎల్లప్పుడూ నమస్కరించుకొంటూ, ఆ భగవంతుని నారాయణ స్మరణ ఫలం ఈ లోకానికెల్లా మేలు చేయగలదని ప్రార్థిస్తున్నాను.

:- 22/05/1981, గురజాడలో స్వామివారి జయంతి సభలో కీ శే తాడేపల్లి రాఘవానారాయణ శాస్త్రులవారు పలికిన మాటలు.

#KanchiParamacharyaVaibhavam #Paramacharya
2,210000
నేలపై పడ్డ ప్రసాదం

రామస్వామి అయ్యర్ సేలంలో ప్రముఖ న్యాయవాది. ఆ వృత్తిలో ఆయన బాగా రాణిస్తున్నారు. పరమాచార్య స్వామివారి అశేషకోటి భక్తులలో ఆయన కూడా ఒకరు. వారు ఒకసారి మహాస్వామివారి దర్శనానికి వెళ్ళారు. ఆయన వరుసలో నిలబడి స్వామిని దర్శించుకొని విభూతిని ప్రసాదంగా తీసుకున్నారు.

స్వామివారు ఇచ్చేటప్పుడే పొరపాటున చెయ్యి జారిందో లేక తీసుకునే మునుపే ఈయన చెయ్యి వెనక్కు తీసుకున్నారో మొత్తానికి విభూతి ప్రసాదం నేలపై పడింది. నేలపై పడ్డ విభూతిని తీసుకోవడం ఏమిటని రామస్వామి అయ్యర్ ప్రసాదం కోసం మరలా చెయ్యి చాచారు.

అప్పుడు స్వామివారు “నేలపై పడ్డ ఆ ప్రసాదం తీసుకో ఆన్నారు”. మన్నుతో కలిసిన ఆ ప్రసాదాన్నే రామస్వామి అయ్యర్ స్వీకరించాడు. ఎందుకు నేలపై పడ్డ ప్రసాదాన్ని తీసుకొమ్మని స్వామివారు ఆదేశించారు అని పరిపరి విధాల ఆలోచించారు. ఇంటికి చేరుకునే దాకా ఆ అసంతృప్తి వదల్లేదు.

ఎన్నో ఏళ్లుగా న్యాయస్థానంలో కొనసాగుతున్న తంజావూరులో ఉన్న రామస్వామికి చెందిన భూముల వ్యవహారం కొన్ని రోజుల తరువాత ఆయన పరం అయ్యాయి. ఆ న్యాయవాది ఆనందం అనిర్వచనీయం. అసలు దక్కదు అనుకున్న స్థిరచారాస్తులు దక్కితే ఆ ఆనందం వేరు కదా.

ఈ విషయాన్ని మహాస్వామివారికి చెప్పడానికి వెంటనే స్వామీ వద్దకు బయలుదేరారు. రామస్వామి అయ్యర్ ను చూడగానే స్వామివారు ఏమన్నారో తెలుసా?

“ఆరోజు నేలపై పడ్డ ప్రసాదాన్ని తీసుకోవడానికి నువ్వు చాలా ఆలోచించావు. చూశావా ఈరోజు నీకు అంత భూమి లభించింది” అని అన్నారు.

అసలు వచ్చిన విషయం చెప్పడానికి రామస్వామి ఇంకా నోరు కూడా తెరవలేదు. ఆ వచ్చిన విషయమూ, ఆ విషయానికి సంబంధించిన విషయము కూడా స్వామివారే చెప్పేశారు. ఇదే సామాన్యులు అర్థం చేసుకోలేని పరమాచార్య స్వామివారి దివ్య కరుణ.

--- శ్రీ ఆర్. వెంకటస్వామి, “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.



#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2,360000
ఆ జాతకం ఇలా ఇవ్వు

ఆత్తూర్ గ్రామంలో ముకుందరాజ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. పదోన్నతితో అక్కడి నుండి చెన్నైకి మకాం మార్చాడు. అతనికి యమ్.టెక్ చెదివిన ఒక కుమారుడు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివి ఉండడం వల్ల కుమారునికి యు.యస్. లో ఉద్యోగం లభించాలని ఆశించేవాడు. కనుక ఉద్యోగ ప్రయత్నాలకు ముందు అబ్బాయి జాతకం ఒకసారి చూపించాలని అనుకున్నాడు. అప్పట్లో బేతనాయకన్ పాళ్యంలో ఉంటున్న ఆంధ్రదేశానికి చెందిన రాంబట్ల శాస్త్రిగారు ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మంచి పరిచయం ఉన్న శ్రీనివాసన్ అనే సహాయకునికి అబ్బాయి జాతకం ఇచ్చాడు.

ఆయన జాతకాన్ని పరిశీలించి యు.యస్ లో ఉద్యోగం లభిస్తుందని, తెలిసిన బంధువుల పిల్లతో వివాహం నిశ్చయమవుతుందని చెప్పారు. నాలుగు నెలలోనే ఇవన్నీ జరుగుతాయని కూడా చెప్పారు. దీన్నంతా కాగితంపై వ్రాసి శ్రీనివాసన్ కు ఇచ్చారు.

ముకుందరాజ్ ఊర్లో లేకపోవడం చేత, తను వచ్చిన తరువాత ఈ విషయాలు చెబుదామని జాతకాన్ని శ్రీనివాసన్ తన బ్యాగులో ఉంచుకున్నాడు. ప్రతినెలా పరమాచార్య స్వామివారిని దర్శించడం శ్రీనివాసన్ కు ఆనవాయితీ. కొన్నిరోజుల తరువాత మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళాడు. ఆరోజు దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. వారి కష్టాలను చెప్పుకొని స్వామివారి ఆశీస్సులు అందుకుంటున్నారు.

అలా వరుసలో ఉన్న ఒకామె వంతు రాగానే తన కుమారునికి యు.యస్ ఉద్యోగం లభిస్తుందా? త్వరగా పెళ్ళి కుదురుతుందా? అని స్వామివారిని అడిగింది. కాని ఆమె తమ పోస్ట్ మాష్టర్ ముకుందరాజ్ భార్య అని శ్రీనివాసన్ కి తెలియదు.

స్వామివారు నవ్వుతూ శ్రీనివాసన్ వైపు చూసి, “నీ బ్యాగులో ఉన్న ఆ జాతకం ఇలా ఇవ్వు” అని అడిగారు. శ్రీనివాసన్ జాతకంతో పాటు ఆ జ్యోతిష్కుడు వ్రాసిచ్చిన కాగితాన్ని కూడా బయటకు తీసాడు. దాన్ని ఆమెకు ఇవ్వమని స్వామివారు ఆదేశించారు. ఏంజరుగుతోందో అప్పుడు అర్థమైంది ఇద్దరికి.

బ్యాగులో జాతకం ఉందన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు? మనుషుల మనస్సులను తెలుసుకునే మహాస్వామివారికి బ్యాగులో ఏముందో తెలుసుకోవడం పెద్ద కష్టమా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2,260000
బ్రాహ్మణ హత్య - గోగ్రాసం

ఒక ధనిక భక్తుడు ఒకసారి తన మిత్రుడు పొరుగూరికి వెళ్ళాలంటే తన కారును ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ వాహనానికి ప్రమాదం జరిగి అందులో ప్రయాణిస్తున్న అతని మిత్రుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు.

ఈ విషయం ఆ భక్తునికి చాలా బాధను కలుగచేసింది. తన ఆవేదన అంతా, తన వల్ల ఒక కుటుంబం యజమానిని కోల్పోయిందన్న బాధ. ఆ కుటుంబానికి తను ఎంతగానో ఆర్థిక సహాయం చేశాడు, కానీ ఎంత డబ్బు ఇస్తే మాత్రం పోయిన ప్రాణం తిరిగివస్తుంది అని చాలా బాధపడేవాడు.

ఆ భక్తునికి ఒక అనుమానం కూడా ఉండేది. తన వల్ల చనిపోయాడు కాబట్టి ఒక బ్రాహ్మణున్ని చంపిన బ్రహ్మహత్యా దోషం తనకు తగులుతుంది అని. కానీ తన మానసిక వ్యథను చెప్పుకోవడానికి తనకు ఎవరూ దొరకలేదు. శాస్త్ర ప్రమాణం, పరిహారం తెలిపే వారు కూడా ఎవరూ లేరు. అందుకోసమే శాస్త్రం పై మహోన్నతాధికారం కలిగిన మహాస్వామి వారి వద్దకు వచ్చాడు.

మహాస్వామి వారు ఆ భక్తుడు చెప్పినదంతా సాంతంగా విన్నారు. అతనితో ఇలా అన్నారు ”ఆ ప్రమాదం దైవాధీనం. నీ సంకల్పములో గాని నీ చేష్టితములో గాని ఏమి దోషము లేదు. కానీ ఏలనో నీకు పాపభీతి కలిగినది. అంతే కాకుండా లోకోపవాదం కూడా వచ్చింది.

కనుక మొదట ఒక పని చెయ్యి. రామేశ్వరం వెళ్ళి సేతుస్నానము ఆచరించు. సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి వీధిలో వెళ్ళే ఒక గోవుకి తినడానికి గ్రాసం అందించు. రోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి, ఈశ్వరుని దర్శించు. రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించు. ఇవన్నీ నీవు చేసినట్లైతే నీకు కలిగిన దోషము, అపవాదు తొలగిపోగలదు”
భక్తుడు సంతోషించి, ప్రసాదం స్వీకరించి కొద్దిగా సంకోచిస్తూ అక్కడే నిలబడ్డాడు.

మహాస్వామి వారు చూసి, “ఏమిటి నీ సందేహము?” అని అడిగారు. ”అన్ని విషయములు పాటించగలను. కానీ గోవుకు గ్రాసం అందివ్వడం సాధ్యపడదు. ఎందుకంటే నేను నివసించే పట్టణములో ఎక్కడా వీధులలో ఆవులు కనపడవు” అని అన్నాడు.

మహాస్వామి వారు ఠక్కున జవాబిచ్చారు. “ఐతే ఏంటి? మీ ఊరిలో ఎక్కడో ఒక చోట గోశాల ఉంటుంది కదా! నీ దగ్గర కారు కూడా ఉంది కదా! ఉదయం ఐదు గంటలకు లేచి నీ కారులో వెళ్ళి అక్కడ ఉన్న అన్ని గోవులకు గ్రాసం తినిపించి రా”

ఆ భక్తుడు చాలా సంతోషించి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయాడు.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
2,330000
చిరిగిన చీర

పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చెయ్యాలని తలచి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేశారు. శ్రీకార్యం వ్యక్తులు కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు.
మహాస్వామి వారు ఇక పూజ మొదలుపెట్టబోతూ, కామాక్షి అమ్మవారికి కట్టిన చీర మోకాలు వద్ద కొద్దిగా చినిగి ఉండడం గమనించారు. అమ్మవారికి కట్టీన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలని నిశ్చయించుకున్నారు స్వామివారు. పూజ చాలా అద్భుతంగా జరుగుతోంది. ఆ పూజను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు.

హఠాత్తుగా, చాలా చోట్ల చినిగి ఉన్న వస్త్రం ధరించిన ఒక భిక్షకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీర, తినడానికి కాస్త ఆహారం కావాలని అడిగింది. ఆమె పరమాచార్య స్వామివారిని సమీపించకుండా అక్కడున్న వారందరూ అడ్డుపడుతున్నారు. కాని మహాస్వామివారు ఆమెని అడ్డగించవద్దని తన వద్దకు రానీయమని ఆదేశించారు. కరుణాసాగరుడు స్వామివారు ఆమెకేం కావాలని అడిగారు. తన దగ్గర ఈ చినిగిపోయిన చీర మాత్రమే ఉన్నదని, కావున ఒక మంచి చీరను ఇప్పించమని వేడుకుంది. ఒక మంచి చీర, పళ్ళు, ప్రసాదం ఒక పళ్ళెంలో తీసుకొనిరమ్మని పరమాచార్య స్వామివారు శ్రీకార్యాన్ని ఆదేశించారు. స్వామివారి ఆదేశానుసారం వారు అలాగే తీసుకునివచ్చి ఆమెకు అందించారు.

స్వామివారు నవ్వుతూ ఆమెని బావుండమని ఆశీర్వదించారు. ఆమె ఆ పళ్ళాన్ని తీసుకుని రోడ్డువైపుకు వెళ్ళింది. ఇలాంటి వారు ఆ చీరను డబ్బుకోసం అమ్ముకుంటారని తలచి శ్రీకార్యం వ్యక్తి ఒకరు ఆమెను అనుగమించి వెళ్ళారు. ఆమెకు, మహాస్వామి వారికి తెలియకుండా అతను ఆమెని వెంబడిస్తున్నాడు.

ఆమె రోడ్డును దాటి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా, ఎవరో ఇతణ్ణి గట్టిగా చరచడంతో మూర్చవచ్చి నేలపై పడిపోయాడు. ఆమె ఆలయం లోపలికి వెళ్ళీ అదృశ్యమైపోయింది. దారిన వేళ్తున్న వారి సహాయంతో పూజామండపానికి తిరిగొచ్చాడు. ఈ సంఘటనను మహాస్వామివారికి చెప్పడానికి అతను చాలా భయపడ్డాడు. ఎవరూ ఏమీ చెప్పకుండానే మహాస్వామివారికి అంతా తెలుసు. అతణ్ణి నిలదీయడంతో తను కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయం మొత్తం చెప్పాడు. తను చేసిన పనికి క్షమించవలసిందిగా వేడుకున్నాడు.

అమ్మవారికి చిరిగిపోయిన చీర కట్టారని, అందుకే అమ్మవారు చిన్న లీల చేయదలచి ఇలా చేసిందని తెలిపారు. నిజమైన భక్తుణ్ణి కరుణించడానికి అమ్మవారు ఎంత కిందకైనా దిగి రాగలదు. అలాగే పరమాచార్య స్వామివారు కూడా, ఎందుకంటే అమ్మవారే పరమాచార్య స్వామి కాబట్టి.

--- శ్రీ ఇంద్రా సౌందరరాజన్, కంచియిన్ కరుణై కడల్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
1,750000

Showing 30 of 91 posts

రేటింగ్

లాగిన్ అవసరం

Frequently Asked Questions

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) టెలిగ్రామ్ ఛానల్ దేని గురించి?+

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) tgdio లో UPSC & SSC వర్గంలో జాబితా చేయబడిన టెలిగ్రామ్ ఛానల్. ర్యాంకింగ్, రేటింగ్, రివ్యూలు మరియు ఇటీవలి పోస్ట్‌లు చూసి సబ్‌స్క్రైబ్ చేసే ముందు నిర్ణయించండి. ప్రస్తుతం tgdio లో సుమారు 16,018 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

నేను కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) (@kpdstrust) ను టెలిగ్రామ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?+

tgdio లో ఛానల్ ప్రొఫైల్ తెరిచి, Join / Open in Telegram తో @kpdstrust కు ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేయండి.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) మంచి UPSC & SSC ఛానల్‌నా?+

tgdio లో జాయిన్ కావడానికి ముందు కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) రేటింగ్, రివ్యూలు, ర్యాంకింగ్ మరియు పోస్ట్‌లు చూడండి. ప్రస్తుతం tgdio లో సుమారు 16,018 సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఇలాంటి UPSC & SSC ఛానల్‌లతో పోల్చండి.

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి) స్టాట్స్ మరియు పోస్ట్‌లు ఎక్కడ చూడాలి?+

tgdio లో @kpdstrust పేజీ తెరవండి — సబ్‌స్క్రైబర్ స్టాట్స్, ర్యాంకింగ్, రేటింగ్ మరియు పోస్ట్‌లు. Stats లింక్‌తో గ్రోత్ చార్ట్ చూడండి.