ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
ఏపీ స్థానిక సంస్థల (పట్టణ, గ్రామీణ) రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఫిర్యాదులు, సమస్యల కోసం (0866) 2490023, 2490024, 2490025, 2490026 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. అలాగే ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపేందుకు
[email protected],
[email protected] ఐడీలను సంప్రదించాలని ఈసీ తెలిపింది. అదనపు సమాచారం కోసం
sec.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.